
Lakshmi Manchu Shares Mohan Babu Full Home Tour Video: మంచు లక్ష్మీ ఇటీవల యూట్యూబ్ వీడియోలతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన మంచు మోహన్ బాబు హోం టూర్ ప్రోమో వీడియోకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్‌లోడ్ చేసిన కాసేపటికే వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. తాజాగా మోహన్ బాబు ఇంటికి సంబంధించిన ఫుల్ వీడియోను విడుదల చేసింది.
ఇది తన తండ్రి 6వ ఇల్లని.. దీని గురించి తలుచుకుంటే ఎంతో గర్వంగా అనిపిస్తుందని మంచు లక్ష్మీ పేర్కొంది. ఎక్కడో మొదుగులపాలెం ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చి స్వయంకృషితో నిలదొక్కుకొని ఈ ఇల్లు నిర్మించారని తెలిపింది. చెట్లను ఎక్కువగా ఇష్టపడే తన తండ్రి వాటికి దగ్గరగా ఉండేలా ఇల్లు తీసుకున్నారని పేర్కొంది.
ఇక ఇంట్లో కిచెన్, జిమ్, స్టీమ్ రూమ్, గార్డెన్ ఏరియా, చిన్నారుల ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం ప్రత్యేక రూమ్, ఇలా సకల సౌకర్యాలు ఉన్నాయి. మరి ఎంతో విలసవంతమైన మోహన్ బాబు ఇంటిని మీరు కూడా చూసేయండి..