మోహన్‌బాబుతో మంచు లక్ష్మీ సినిమా.. ముహూర్తం ప్రారంభం | Manchu Lakshmi And Mohan Babu Together Seen In Film For The First Time | Sakshi
Sakshi News home page

Manchu Lakshmi : తొలిసారి తండ్రితో కలిసి నటిస్తున్న మంచు లక్ష్మీ

Published Sun, Feb 13 2022 10:32 AM | Last Updated on Sun, Feb 13 2022 11:21 AM

Manchu Lakshmi And Mohan Babu Together Seen In Film For The First Time - Sakshi

Manchu Lakshmi And Mohan Babu Together Seen In Film: తండ్రీకూతురు మోహన్‌బాబు, లక్ష్మీ తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్న చిత్రం శనివారం ప్రారంభమయింది. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రతీక్‌ ప్రజోష్‌ దర్శకుడు. ముహుర్తపు సన్నివేశానికి మంచు మనోజ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, మంచు విష్ణు తనయుడు అవ్రామ్, లక్ష్మీ కుమార్తె విద్యా నిర్వాణ స్క్రిప్ట్‌ అందజేశారు.

దర్శకురాలు నందినీ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇదొక స్టన్నింగ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌’’ అన్నారు దర్శకుడు. మలయాళ నటుడు సిద్ధిఖ్‌ కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రానికి కథ–మాటలు: డైమండ్‌ రత్నబాబు, సంగీతం: ప్రియదర్శన్‌ బాలసుబ్రమణ్యం, కెమెరా: సాయిప్రకాశ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement