భక్తవత్సలం నాయుడు అనగానే కొద్దిమందికే తెలుసు. అదే మోహన్‌బాబు అనగానే వెంటనే కలెక్షన్ల కింగ్ అనేస్తారు. అలా ఆయన పేరు ప్రేక్షకుల మదిలో సుస్థిరంగా నిలబడిపోయింది. నటుడిగా, నిర్మాతగా చిత్రసీమకు ఎనలేని సేవలు ఆయన చేశారు. నటనలో రాణించాలనే లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెహన్‌బాబు ఎన్నో అవరోధాలను అధిగమించి ఎనలేని కీర్తిని గడించారు. తాజాగా ఆయన పంచుకున్న ఫోటో నెట్టంట ట్రెండ్ అవుతుంది.
సుమారు 50 ఎళ్లకు పైగా మోహన్‌బాబు సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. ఇప్పటి వరకు 500పైగా చిత్రాల్లో ఆయన నటించారు. రాజదండం చేత పట్టుకుని ఉన్న తన ఫోటోను మోహన్‌బాబు అభిమానులతో పంచుకున్నారు. 'ఎంతో చారిత్రక ప్రాధాన్యం గల అపురూప రాజదండం నాకు అందడం నా పూర్వజన్మ సుకృతం. ఈ రాజ దండం ఎలా వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో అతి త్వరలో వివరాలు తెలియజేస్తాను.' అని తన ఎక్స్ పేజీలో ఆయన పేర్కొన్నారు.
1980 దశకంలో మోహన్‌బాబు సినిమా విడుదలైంది అంటే చాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రికార్డ్‌లు నమోదు కావాల్సిందే. అలా ఆయన నుంచి వచ్చిన సినిమాలు నిర్మాతలకు భారీగా లాభాలను తెచ్చిపెట్టాయి. ఆయన నటుడే కాదు మంచి అభిరుచి ఉన్న నిర్మాత కూడా అలా తన కూతురు లక్ష్మి మంచు పేరుతో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై 90కి పైగా చిత్రాలు నిర్మించారు. ఇప్పడు కన్నప్ప చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తో మోహన్‌బాబు నిర్మిస్తున్నారు.
మోహన్‌బాబుకు విద్యారంగం అంటే గౌరవం. అందుకే ఆయన 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక స్కూల్స్, కాలేజీలు స్థాపించారు. ఈ క్రమంలో మోహన్‌బాబుని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో 2007లో సత్కరించింది. ఇప్పుడు ఆయన చేతికి అందిన రాజదండం ప్రత్యేకత ఏంటో అనేది త్వరలో మోహన్‌బాబు వెళ్లడించనున్నారు.
ఎంతో చారిత్రక ప్రాధాన్యం గల అపురూప రాజ దండం నాకు అందడం నా పూర్వజన్మ సుకృతం. pic.twitter.com/bRTK1j7m9X
— Mohan Babu M (@themohanbabu) July 11, 2024
Comments
Please login to add a commentAdd a comment