screen
-
స్క్రీన్కు బానిసవుతున్న బాల్యం
విహాన్ వయసు మూడున్నరేళ్లు. తన తోటి పిల్లలు చురుకుగా ఆడుతూ, కేరింతలు కొడతూ, చిట్టిచిట్టి మాటలతో అలరిస్తుంటే తాను మాత్రం ఏమి పట్టనట్లు దిగాలుగా ఉంటున్నాడు. రోజంతా మొబైల్ చూస్తూ కాలం గడుపుతున్నాడు. మాటలు రావడం లేదని తల్లిదండ్రులు డాక్టర్ వద్దకు తీసుకెళితే అసలు విషయం బోధపడింది. చిన్నప్పటి నుంచి తనకు మొబైల్ చూపించడంతో దానికి బానిసయ్యాడని తెలిసింది. టెక్నాలజీ పెరుగుతోందని సంబరపడాలో..అది మన తర్వాతి తరాలకు శాపంగా మారబోతుందని బాధపడలో తెలియని పరిస్థితి నెలకొంది. పుట్టి ఎడాదిన్నర కావస్తున్న చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మొబైలే ప్రపంచమైంది. చిట్టిపొట్టి మాటలు నేర్చుకుంటూ తాత, అమ్మమ్మలూ, నాయనమ్మలతో సంతోషంగా గడపాల్సిన బాల్యం ఎలక్ట్రానిక్ స్క్రీన్లకు బానిసవుతుంది. గతంలో ఇంట్లో పెద్దవారు పిల్లలకు మాటలు, మంచి అలవాట్లు నేర్పుతూ కాలం గడిపేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేయడంతో పిల్లలను పట్టించుకునేవారు లేకుండా పోయారు. వివిధ కారణాల వల్ల తాతలు, అమ్మమ్మ, నాయనమ్మలు పిల్లల వద్ద ఉండలేకపోతున్నారు. దాంతో తెలిసి తెలియక తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల పిల్లలను ఎలక్ట్రానిక్ వస్తువులకు బానిసలుగా మారుస్తున్నారు.పేరెంట్స్ నుంచే పిల్లలకుకేవలం పిల్లల చేతిలోని ఫోనే కాకుండా, తల్లిదండ్రులు వాడే ఫోన్ వల్ల కూడా పిల్లలకు మాటలు రావడం లేదని ఎస్తోనియా దేశంలోని టార్టూ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అద్యయనం ద్వారా తెలిసింది. తల్లిదండ్రులకు ఫోన్‌ని అతిగా చూసే అలవాటు ఉంటే అది పిల్లలకూ వస్తుందట. వాళ్ల స్క్రీన్‌టైం సమయం కూడా దాదాపు ఉండటం గమనించారు. రెండు నుంచి నాలుగున్నరేళ్ల వయసులో ఉన్న పిల్లల్ని ఎంపిక చేసుకుని వారి భాషానైపుణ్యాలని పరిశీలించారు. పిల్లలూ, వాళ్ల తల్లిదండ్రులూ రోజులో ఎంత సమయం ఫోన్లో గడుపుతున్నారో చూశారు. స్క్రీన్ టైమ్ అతితక్కువగా ఉన్న తల్లిదండ్రులూ, పిల్లల మధ్య భాషానైపుణ్యాలని పరీక్షించారు. ఈ తరహా పిల్లల్లో భాషానైపుణ్యాలు ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ‘షరతులు తీరిస్తే జాబ్ చేయడానికి సిద్ధం’సమయం గడపాలిమొబైల్ ఫోన్లు చూపించడానికి బదులుగా పిల్లలతో ఎక్కవ సమయం గడిపేందుకు చొరవ చూపాలని శాస్త్రవేత్తలు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. పిల్లలతో కలిసి అవుట్‌డోర్‌లో ఆడేందుకు సమయం కేటాయించాలని చెబుతున్నారు. ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి పిల్లలతో గడపాలంటున్నారు. -
రెప్పవాలదే..!.. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం మందికి నిద్రలేమి సమస్య
సాక్షి, అమరావతి: మానవాళి నిద్రకు దూరమవుతోంది. రాత్రిళ్లు కంటినిండా కునుకు లేకుండానే తెల్లారుతోంది. సగటు 7 గంటల నిద్ర అనేది ఇకపై చెప్పుకోవడానికి తప్ప.. ఆస్వాదించడానికి అవకాశం లేకుండాపోతోంది. ప్రముఖ వైద్య పరికరాల సంస్థ ‘రెస్‌మెడ్’ నిర్వహించిన తాజా సర్వేలో దీర్ఘకాలంగా నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు తేలింది. అంతర్జాతీయంగా 40 శాతం మంది ప్రజలు నిద్ర సమస్యతో నలిగిపోతున్నారు. వారంలో కనీసం మూడు రోజుల కూడా మంచి నిద్రను పొందలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల్లో పగటిపూట నిద్రపోవడం, ఉదయాన్నే వివిధ ప్రతికూల ప్రభావాలతో పాటు ప్రతి చిన్న విషయానికీ ఎక్కువగా చిరాకుపడటం కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో మునిగితే అంతే.. రెస్‌మెడ్ గ్లోబల్ స్లీప్ సర్వేలో ఆ్రస్టేలియా, బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, భారత్, ఐర్లాండ్, జపాన్, కొరియా, మెక్సికో, న్యూజిలాండ్, సింగపూర్, తైవాన్, థాయ్‌లాండ్, యూకే, యూఎస్ఏలో ప్రజల నిద్ర అలవాట్లను ట్రాక్ చేసింది. ఇందులో స్వల్పంగా 13 శాతం మంది మాత్రమే రాత్రిళ్లు ఆరోగ్యకర నిద్రను అనుభవిస్తున్నట్టు తేలింది. జపానీయులు (57శాతం) ప్రతి వారం రాత్రిళ్లు సరైన నిద్రలేక ఇబ్బంది పడుతున్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ముఖ్యంగా నిద్రకు ముందు ఎక్కువ మంది సామాజిక మాధ్యమాల్లో ముగినితేలుతుండటం దుష్ప్రభావాలను పెంచుతోంది. మరికొంతమంది అర్ధరాత్రి వరకు టీవీలు చూడటం, ఇతర డిజిటల్ పరికరాలను వినియోగిస్తుండటంతో నిద్ర దూరమైపోతోందని నివేదిక స్పష్టం చేస్తోంది. వ్యక్తిగత ఆందోళనలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఊబకాయం వంటి ప్రధాన కారణాలతో చాలా మంది రాత్రిళ్లు కంటిపై కునుకు వేయట్లేదు. ప్రతి 10 మందిలో ముగ్గురు నిద్ర మధ్యలో మేల్కొనకుండా ఉండలేకపోతున్నారని నివేదిక పేర్కొంది. యూకేలో 44 శాతం, ఫ్రాన్స్‌లో 42 శాతం మంది ప్రజల్లో నిద్రకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారతదేశంలో 42 శాతం, థాయ్‌లాండ్‌లో 41 శాతం కొంత వరకు రాత్రిళ్లు నిద్ర హాయిగానే ఉన్నట్టు తేలింది. రుతుక్రమం ఆగిన స్త్రీలలో నిద్రలేమి సమస్య అధికంగా ఉంది. ఐర్లాండ్, ఆస్ట్రేలియాలో ఎక్కువ శాతం మహిళలు కలత నిద్రతో ప్రభావితం అవుతున్నారు. నిద్రలో శ్వాసకు అంతరాయాలు(స్లీప్ అప్నియా) పెద్ద రుగ్మతగా పరిణమించింది. భారత్‌లో అత్యధిక మందికి 6 గంటలు కంటే తక్కువ నిద్ర భారత్‌లోనూ అంతర్జాతీయ సర్వేలతో పాటు స్థానిక సర్వేల్లోనూ నిద్రలేమి భయపెడుతోంది. గతంలో రోజుకు ఏడు గంటలు కూడా నిరంతరాయంగా నిద్రపోవడంలో భారతీయలు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే తాజా సర్వేలో.. 61 శాతం మంది భారతీయులు గడిచిన 12 నెలల్లో రాత్రిపూట 6 గంటల కంటే తక్కువగా నిద్రపోగా, 38 శాతం మంది 4 నుంచి 6 గంటల మధ్య మాత్రమే నిద్రించడం గమనార్హం. వారిలో దాదాపు 23 శాతం మంది 4 గంటల కూడా నిద్రపోలేదు. అంటే రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోయే ప్రజలు 2002లో 50 శాతం నుంచి ఇప్పుడు 55 శాతానికి పెరగడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. దీంతో భారత్‌లో 2024లో నిద్రలేమి సమస్య 61 శాతానికి పెరిగింది. 72 శాతం మంది నిద్రలో ఒకటి, రెండు సార్లు వాష్‌రూమ్‌ని ఉపయోగించడం కోసం మేల్కొంటున్నట్టు తేలింది. చాలా మంది నిద్రపోవడానికి ఆలస్యంగా వెళ్తుండటం కూడా వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. కోవిడ్ బారిన పడిన వారిలో నిద్ర నాణ్యత లోపించినట్టు సర్వేలు చెబుతున్నాయి. నిద్రలేమిని అధిగమించేందుకు రోజూ నడక, గంటపాటు క్రమం తప్పకుండా వ్యాయామం, రాత్రిపూట తేలికపాటి భోజనం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భోజనానికి నిద్రకు మధ్య 3 గంటల సమయాన్ని పాటించడంతో పాటు నిద్రకు మూడు గంటలకు ముందు టీ, కాఫీలకు దూరంగా ఉండాలని, నిద్ర కోసం పుస్తకం చదవడం, ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలని వారంటున్నారు. -
రాజమౌళి- మహేశ్ కాంబోలోకి ఎంట్రీ ఇస్తున్న నాగార్జున
సూపర్ స్టార్ మహేశ్‌బాబు– కింగ్ నాగార్జున స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ ఈ కాంబినేషన్ ఏ సినిమాకీ? అంటే.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందనున్న చిత్రానికి అంటున్నారు. ‘గుంటూరు కారం’ సినిమా హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న మహేశ్‌బాబు తన తర్వాతి చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మహేశ్‌బాబు కెరీర్లో 29వ మూవీగా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనుంది. ఈ చిత్రానికి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇటీవలే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ ప్రాజెక్టు కోసం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట రాజమౌళి. ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే నాగార్జున కూడా కీలక పాత్రలో నటించనున్నారని టాక్. సినిమాలో చాలాప్రాధాన్యం ఉన్న ఓ పాత్రకి నాగార్జునని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. నాగార్జునకి దక్షిణాదితో పాటు ప్రత్యేకించి బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే జాతీయ స్థాయిలో పేరున్న నాగార్జునను ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ కోసం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భోగట్టా. ఏప్రిల్‌లో ఈ సినిమాప్రారంభం కానుంది. మరి మహేశ్‌బాబు– నాగార్జున కాంబో తెరపై కనిపిస్తుందా? అంటే ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్న. -
ఎన్నికల వేళ.. చేరికలపై బీజేపీ నూతన కమిటీ
ఢిల్లీ: బీజేపీలో చేరే ఇతర పార్టీల నేతల నాణ్యతను చెక్ చేసేందుకు బీజేపీ నూతన కమిటీని నియమించింది. పార్టీలో చేరాలనుకునే నేతలను అనుమతించాలా? తిరస్కరించాలా? అనేదానిపై నూతనంగా ఏర్పాటు చేసిన ఆ కమిటీయే నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ జనవరి 6న తొలిసారి సమావేశం కానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీకి విధేయులుగా లేని నాయకులు చేరే ప్రమాదాన్ని తగ్గించేందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ముకుల్ రాయ్, బాబుల్ సుప్రియో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో చేరిపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బీజేపీ కొత్త ఎత్తుగడతో ముందుకు వచ్చింది. దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలో రావడానికి సన్నద్ధమవుతోంది. రానున్న ఎన్నికల్లో పొరపాట్లు జరగకుండా లోటుపాట్లను సమీక్షిస్తోంది. ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా గెలుపొందడానికి ఎన్నికల ప్రచారాలకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాల జాబితాను సిద్ధం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు, ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనపై చర్చించేందుకు బీజేపీ సీనియర్ నేతలు ఈరోజు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ, ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్ ఉన్నారు. ఇదీ చదవండి: మణిపూర్‌లో భద్రతా దళాలపై ముష్కరుల దాడి -
Anagha Maya Ravi: మమ్ముట్టి ఆన్‌స్క్రీన్ కూతుర్ని చూశారా? రచ్చ లేపుతోందిగా (ఫోటోలు)
-
బై బై ముంబై
రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లైకా ప్రోడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ముంబైలో ప్రారంభమైంది. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ముంబై షెడ్యూల్ ముగిసిందని వెల్లడించి, ఓ వర్కింగ్ స్టిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్. ఇలా ముంబైకి బై బై చెప్పారు రజనీకాంత్. ఇక 1991లో విడుదలైన హిందీ చిత్రం ‘హమ్’ తర్వాత రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి 33 ఏళ్లకు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రం ఇది. రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఓ సామాజిక అంశం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో రజనీకాంత్ కనిపిస్తారని, వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. -
ప్రస్తుతానికి అందుబాటులో లేను!
పుట్టినరోజు (అక్టోబర్ 13) సందర్భంగా పూజా హెగ్డే తన తాజా చిత్రం గురించి థ్రిల్లింగ్ న్యూస్ ఒకటి చెప్పారు. షాహిద్ కపూర్ సరసన తొలిసారి ఆమె కథానాయికగా నటించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు రోషన్ ఆండ్రూస్ తెరకెక్కించనున్నారు. ఇలా బర్త్ డేకి ఓ థ్రిల్లర్ మూవీకి సైన్ చేయడం పట్ల పూజా హెగ్డే ఆనందంగా ఉన్నారు. ‘‘ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఎందుకంటే కథాంశం కొత్తగా ఉంది. అలాగే నాది చాలా విభిన్నమైన పాత్ర. షాహిద్ కపూర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుండటం హ్యాపీగా ఉంది. తను మంచి నటుడు. అందుకే ఈ సినిమా ప్రయాణాన్ని ఆరంభించడానికి ఆసక్తిగా ఉన్నాను’’ అని పేర్కొన్నారు పూజా హెగ్డే. ఇక పుట్టినరోజుని ఎలా జరుపుకున్నారంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీ మాల్దీవుల్లో ఉన్నారు. ‘కరెంట్లీ అన్ అవైలబుల్’ (ప్రస్తుతం అందుబాటులో లేను) అంటూ మాల్దీవుల్లో సేద తీరుతున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు పూజా హెగ్డే. -
ఇదెక్కడి వర్క్ ఫ్రొం హోమ్ రా మామ...
-
వర్చువల్ మీటింగ్.. స్క్రీన్‌పై చెడ్డీలు..
కొన్ని ఐటీ సంస్థల్లో ఇప్పటికీ వర్క్ ఫ్రం హొమ్ నడుస్తోంది. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే హాయిగా పనిచేసుకుంటున్నారు. అయితే పని వేళల్లో ఆన్లైన్ షాపింగ్ చేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఈ సంఘటన గురించి తెలుసుకుంటే అర్థమౌతుంది. ఢిల్లీకి చెందిన అమన్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఇంటి నుంచి పని చేస్తున్న అతను వర్క్ టైమ్‌లో బాక్సర్ల కోసం ఆన్లైన్ షాపింగ్ చేశాడు. ఇందు కోసం తన బ్రౌజర్లోని ఒక ట్యాబ్‌లో ఈ-కామర్స్ సైట్‌ను ఓపెన్ చేశాడు. అయితే వర్చువల్ ఆఫీస్ మీటింగ్ సమయంలో తన స్క్రీన్‌ను షేర్ చేయమని అడిగినప్పుడు, అతను అనుకోకుండా షాపింగ్ పేజీకి సంబంధించిన ట్యాబ్‌ను షేర్ చేశాడు. ఇంతలో దురదృష్టవశాత్తూ స్క్రీన్ స్ట్రక్ అయిపోయింది. ఇంకేముంది అతని ఆన్లైన్ చెడ్డీల షాపింగ్ పేజీని అందరూ చూసేశారు. అతను ఆ స్క్రీన్ మార్చడానికి వీలు లేకుండా పోయింది. ఆ వర్చువల్ ఆఫీస్ మీటింగ్‌లో పాల్గొన్న అతని సహోద్యోగులు స్క్రీన్ మార్చరా నాయనా అంటూ ఎన్ని ఇన్కాల్ మెసేజ్‌లు పెట్టినా లాభం లేకోపోయింది పాపం. వర్క్ టైమ్‌లో జరిగిన ఈ పొరపాటు గురించి అమన్ సరదాగా ట్విటర్లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన సహోద్యోగుల నుంచి వచ్చిన సందేశాల స్క్రీన్షాట్లను షేర్ చేశాడు. వర్క్టైమ్లో ఆన్లైన్ షాపింగ్ వంటి ఇతర వ్యాపకాలు పెట్టుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెప్పాడు. guys pls pray for me 😭 pic.twitter.com/da5md2O4FC — Aman (@AmanHasNoName_2) June 1, 2023 ఇదీ చదవండి: హెచ్‌సీఎల్‌కు షాక్! కార్మిక శాఖను ఆశ్రయించిన ఐటీ ఉద్యోగులు.. ఎందుకంటే.. -
వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. గూగుల్ మీట్ తరహాలో
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా వీడియో కాల్స్ చేసే సమయంలో యూజర్లు వినియోగార్ధం స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ తరహాలో వీడియో కాల్స్ చేస్తున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు వాట్సాప్ సైతం అదే తరహాలో ‘స్క్రీన్ షేరింగ్’ ఆప్షన్ తెచ్చేందుకు నిమగ్నమైంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌పై బీటా టెస్టర్లకు అందుబాటులో ఉందని, త్వరలో అందరికి పూర్తిస్థాయిలో వినియోగించేలా విడుదల కానుందని వాబీటా ఇన్ఫో వెల్లడించింది. ఇక, స్క్రీన్ ఫీచర్ ముఖ్య ఉద్దేశం..యూజర్లు వీడియో కాల్ మాట్లాడే సమయంలో అదే కాల్‌ను ఇతరులకు షేర్ చేసేలా డెవెలప్ చేస్తోంది. స్క్రీన్ కింద కొత్తగా స్క్రీన్ షేరింగ్ బటన్ అందిస్తున్నది. ఈ బటన్ క్లిక్ చేస్తే సరి.. మీ ఫోన్ లో చేసేది ప్రతిదీ రికార్డు అవుతుంది. అవతలి వ్యక్తికి కూడా షేర్ అవుతుంది. అయితే ఇలా వీడియో కాలింగ్ రికార్డు చేయడానికి యూజర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. -
ఈ మొబైల్ ఉంటే ఇంట్లో థియేటర్ ఉన్నట్టే.. ధర ఎంత ఉండొచ్చంటే?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇంట్లోనే మనకు నచ్చిన స్క్రీన్ సైజులో థియేటర్ క్వాలిటీతో వీడియోలు, సినిమాలు వీక్షించొచ్చు. వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ‘ప్రొజెక్టర్ మోడ్ స్మార్ట్ ఫోన్ల’తో డిజిటల్ రంగం మరింత స్మార్ట్ కానుంది. చేతిలో సెల్‌ఫోన్ ఉంటే ఇంట్లో గోడలు.. నేల.. కార్యాలయం.. కార్లు.. విహార యాత్రలకు వెళితే ఆరు బయటి ప్రాంతాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ సెల్‌ఫోన్‌లోని ప్రొజెక్టర్ ద్వారా వీడియోలు చూడొచ్చు. సెల్ఫోన్లో ప్రొజెక్టర్ ఇన్‌బిల్డ్ చేసి చైనా, జపాన్, అమెరికా, సౌత్ కొరియాకు చెందిన పలు కంపెనీలు వీటిని రూపొందించాయి. లినోవా, అక్యుమెన్, మోటో–జెడ్, మోవి, శాంసంగ్ బీమ్–2 మోడల్స్ పేరుతో ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లోకి విడుదలయ్యాయి. త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి. థియేటర్ క్వాలిటీతో.. ఈ ఫోన్లలో ఇంటిగ్రేటెడ్ లేజర్ ప్రొజెక్టర్ ఉంటుంది. లినోవా కంపెనీ తొలుత దీన్ని రూపొందించగా.. ఆ తర్వాత ఇతర కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పుడు మార్కెట్లో ఈ ఫోన్ల ధర రూ.35 వేల నుంచి రూ.1.80 లక్షల వరకూ పలుకుతున్నాయి. ఫోన్, ప్రొజెక్టర్ క్వాలిటీ ఆధారంగా వీటి ధరలు ఉన్నాయి. 50 నుంచి 200 ఇంచుల స్క్రీన్ వరకూ మనం వీడియోలో ప్రొజెక్ట్ చేయొచ్చు. ఇందులో హెచ్డీ, ఫుల్ హెచ్డీ, 4కే క్వాలిటీతో వీడియోలు చూడొచ్చు. హోమ్ థియేటర్‌ను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి డీటీఎస్ సౌండ్‌తో పూర్తిగా థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌తో వీడియోలు చూడొచ్చు. వీడియో ప్రజెంటేషన్‌కు ప్రొజెక్టర్ల అవసరం లేకుండా ఇలాంటి సెల్‌ఫోన్‌తో ప్రజెంటేషన్ చేయొచ్చు. -
ఆ విషయంలో షావోమీ రికార్డ్‌ను బ్రేక్ చేయనున్న ఐఫోన్!
ఖరీదైన ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ( iPhone 15 Pro Max) ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. అయితే ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ల ఫ్రంట్ గ్లాస్‌కు సంబంధించిన వీడియోలు ఇటీవల ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఇందులో స్క్రీన్ బెజెల్ చాలా సన్నగా ఉన్నట్లు తెలుస్తోంది. డిస్ప్లే స్క్రీన్కు చుట్టూ ఫోన్ ఫ్రేమ్‌కు మధ్య ఉన్న అంచును స్క్రీన్ బెజెల్ అని అంటారు. ఇదీ చదవండి: యాపిల్ దిమ్మతిరిగే టెక్నాలజీ.. మడత ఐఫోన్లు కింద పడినా ఏమీ కావు! ఈ స్క్రీన్ బెజెల్ విషయంలో షావోమీ రికార్డ్‌ను ఐఫోన్ అధిగమించనుంది. షావోమీ (Xiaomi) 13 స్క్రీన్ బెజెల్ 1.81 ఎంఎం. ఇప్పటివరకూ ఇదే అతి సన్నని బెజెల్. ఇప్పుడు ఈ రికార్డ్‌ను యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బద్ధలుకొట్టబోతోంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ ఫోన్ బెజెల్ వెడెల్పు 1.55 ఎంఎం ఉంటుందని టిప్‌స్టర్ ఒకరు ట్విటర్లో షేర్ చేశారు. ఆల్వేస్ ఆన్, ప్రో మోషన్ వంటి డిస్ప్లే ఫీచర్లను యాపిల్.. రాబోయే ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లకు పరిమితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే Wi-Fi 6E నెట్వర్క్ ఐఫోన్ 15 ప్రో మోడళ్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుందని పుకారు వచ్చింది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లలో హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌తో కూడిన సాలిడ్ స్టేట్ బటన్లు, టైటానియం ఫ్రేమ్, అధిక ర్యామ్ వంటి కొత్త ఫీచర్లు ఉండొచ్చని తెలుస్తోంది. iPhone 15 Pro Max will break the record of 1.81mm bezel black edge held by Xiaomi 13, and we measure that its cover plate black bezel width is only 1.55 mm.(S22 and S23 ≈1.95mm,iPhone 14 Pro 2.17mm) pic.twitter.com/9TBrVCGSCo — Ice universe (@UniverseIce) March 17, 2023 -
మోహన్‌బాబుతో మంచు లక్ష్మీ సినిమా.. ముహూర్తం ప్రారంభం
Manchu Lakshmi And Mohan Babu Together Seen In Film: తండ్రీకూతురు మోహన్‌బాబు, లక్ష్మీ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న చిత్రం శనివారం ప్రారంభమయింది. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకుడు. ముహుర్తపు సన్నివేశానికి మంచు మనోజ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మంచు విష్ణు తనయుడు అవ్రామ్, లక్ష్మీ కుమార్తె విద్యా నిర్వాణ స్క్రిప్ట్ అందజేశారు. దర్శకురాలు నందినీ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇదొక స్టన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్’’ అన్నారు దర్శకుడు. మలయాళ నటుడు సిద్ధిఖ్ కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రానికి కథ–మాటలు: డైమండ్ రత్నబాబు, సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం, కెమెరా: సాయిప్రకాశ్. Today is a day I have always dreamt of living and here it is. I ll be sharing the screen with none other than my dad for the very first time. I am so grateful to the universe, my angels and my ancestors for guiding me and making me so capable enough for this day. #blissed pic.twitter.com/UwsaNzCwSI — Lakshmi Manchu (@LakshmiManchu) February 12, 2022 -
గుడ్ న్యూస్.. అదే జరిగితే ఫోన్ రేట్లు తగ్గడం ఖాయం!
సాధారణంగా స్మార్ట్ ఫోన్ తయారీలో డిస్ప్లే, కొన్ని ప్యానెల్స్ క్వాలిటీ విషయంలో ఫోన్ మేకర్లు కాంప్రమైజ్ అవ్వరు. ఇండియమ్ అనే అరుదైన ఎలిమెంట్‌ను ఇందుకోసం ఉపయోగిస్తుంటారు. ఇది చాలా కాస్ట్లీ వ్యవహారం. అయితే ఇండియమ్ ప్లేస్‌లో మరో మెటీరియల్‌ను తీసుకొస్తే.. తమ భారం తగ్గుతుందని, తద్వారా ఫోన్ల రేట్లు తగ్గించి మార్కెట్ పెంచుకోవాలని దశాబ్ధం పైగా కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో గుడ్ న్యూస్ చెప్పారు యూకే రీసెర్చర్లు. భూమ్మీద దొరికే తొమ్మిది అరుదైన మూలకాల్లో Indium మూలకం ఒకటి. ఇండియంతో(Indium Tin Oxide రూపంలో) ఓఎల్ఈడీ(organic light-emitting diode) టచ్ స్క్రీన్లను, ఇతర ప్యానెల్స్‌ను తయారు చేస్తుంటారు. మొబైల్స్‌తో పాటు కంప్యూటర్, పీసీలు, టీవీలు, సోలార్ ప్యానెల్స్, ఎల్ఈడీ లైట్స్ తయారీలో సైతం ఈ మూలకాన్ని ఉపయోగిస్తుంటారు. ఇది చాలా చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఫోన్ ధరల విషయంలో కొన్ని కంపెనీలు అస్సలు కాంప్రమైజ్ అవ్వవు. అయితే ఈ మెటీరియల్ ప్లేస్‌లోకి గ్రాఫిన్‌ను గనుక తీసుకొస్తే.. ఫోన్ మేకర్స్‌కి భారీ ఉపశమనం దొరుకుతుందనే ప్రయోగాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో.. యూకేకి చెందిన పేరాగ్రాఫ్ కంపెనీ, లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీలు సంయుక్తంగా చేసిన పరిశోధనలో ప్రత్యామ్నాయ మెటీరియల్ విషయంలో స్పష్టత వచ్చింది. గ్రాఫిన్‌తో తయారు చేసిన ఓఎల్ఈడీ డిస్ప్లే, ప్యానెల్స్‌ను.. డెమోను విజయవంతంగా చూపించారు పరిశోధకులు. తద్వారా ఇండియమ్‌కు గ్రాఫిన్ సరైన ప్రత్యామ్నాయమనే విషయాన్ని ఇన్నాళ్లకు ప్రపంచానికి చాటి చెప్పారు. ఇండియమ్ ప్యానెల్ వాస్తవానికి ఇండియమ్‌కు ఆల్టర్నేట్ కోసం చాలా కాలంగా పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఏదీ ఇండియమ్ ఇచ్చినంత అవుట్‌పుట్ ఇవ్వలేకపోయింది. ఈ తరుణంలో గ్రాఫిన్ రీప్లేస్ చేస్తుందన్న వార్త ఫోన్ మేకర్స్‌కు శుభవార్తే అని చెప్పొచ్చు. ఇక Grapheneను వండర్ మెటీరియల్ అని అభివర్ణిస్తుంటారు. ఇండియమ్‌తో పోలిస్తే దీనికి అయ్యే ఖర్చు చాలా చాలా తక్కువ. సింగిల్ లేయర్ కార్బన్ అణువులు, తేనెపట్టులాంటి నిర్మాణంను పోలి ఉండే గ్రాఫిన్‌ను.. భూమ్మీద దొరికే బలమైన మెటీరియల్స్‌లో ఒకటిగా చెప్తుంటారు. కానీ, అవసరానికి అనుగుణంగా ఆకారాన్ని మార్చుకోవచ్చు.. పైగా కాపర్ కంటే మంచి విద్యుత్ వాహకంగా పని చేస్తుంది కూడా. మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్స్ తయారీలో ఇప్పటిదాకా గ్రాఫిన్‌ను వాడింది లేదు. కాబట్టి.. తొలి అడుగు పడడానికి కొంచెం టైం పట్టొచ్చు(అన్నీ కుదిరితే 2023 తొలి భాగం అనేది ఒక అంచనా). అదే జరిగితే స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదు.. కంప్యూటర్లు, టీవీల తయారీ ఖర్చు..మార్కెట్లో కొన్ని బ్రాండెడ్ ఫోన్ ధరలు కూడా తగ్గే అవకాశం లేకపోలేదు. చదవండి: జీమెయిల్ మెమెరీ ఫుల్ కాకుండా ఉండాలంటే.. ఇలా చేస్తే సరి -
సినిమాలను తలదన్నేలా ప్రీ వెడ్డింగ్ షూట్లు
సాక్షి, ఎదులాపురం(ఆదిలాబాద్): వివాహ వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ సమయంలో మర్చిపోలేని రీతిలో.. మధుర జ్ఞాపకంలా యువతీ యువకులు పెళ్లికి సిద్ధమవుతున్నారు. సినిమాలను తలదన్నేలా ప్రీ వెడ్డింగ్ షోలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మొదట ఖర్చుకు వెనుకాడినా.. క్రేజీ పెరుగుతుండడంతో ఇప్పుడు డబ్బులకూ వెనుకాడకుండా పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకుంటున్నారు. సినిమా తరహా మాదిరిగా సినీ, జానపద గీతాలపై కాబోయే జంటలు వీడియో షూట్లో చేసి వాటిని పెళ్లి జరిగే రోజు ఎల్ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకమైన లొకేషన్స్.. ప్రీవెడ్డింగ్ షూట్ కోసం ఫొటో, వీడియో గ్రాఫర్లు ప్రత్యేక లొకేషన్లు ఎంపిక చేస్తున్నారు. జిల్లాలో కొర్టికల్, కుంటాల, పొచ్చెర జలపాతం, సాత్నాల ప్రాజెక్టు, ఖండాల, ఆదిలాబాద్ గాంధీ పార్కు, మత్తాడి వాగులు, ఆలయాలు, ప్రకృతివనాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఒక్కో ఫ్రీ వెడ్డింగ్‌షో చిత్రీకరణకు రెండు నుంచి మూడు రోజుల సమయం తీసుకుంటున్నారు. రూ.20 వేల వరకు చార్జి ఒక్కో ప్రీవెడ్డింగ్ షోకు ఫొటో, వీడియో గ్రాఫర్లు రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు చార్జి చేస్తున్నారు. వాహన, డ్రెస్సు, కాస్టూమ్స్, ఇతర ఖర్చులన్నీ వెడ్డింగ్ షో చేయించుకునేవారు భరిస్తారు. పెళ్లి ఫొటో, వీడియోలు, ఫ్రీ వెడ్డింగ్‌కు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు తీసుకుంటున్నారు. ఫ్రీ వెడ్డింగ్ షో ద్వారా జిల్లాలోని యువత ఫొటోగ్రఫీ ద్వారా ఉపాధి పొందుతున్నారు. మధుర జ్ఞాపకం ప్రీ వెడ్డింగ్ ఒక మంచి అనుభూతి. పెళ్లికి ముందు ఒకరి భావాలు మరొకరికి అంతగా తెలియదు. ప్రీ వెడ్డింగ్‌తో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వేదికగా నిలుస్తోంది. ఒక మధుర జ్ఞాపకం. అంతే కాకుండా ప్రస్తుతం ఒక ట్రెండ్‌గా సాగుతుండడంతో ప్రీ వెడ్డింగ్ తీయించుకున్నాం. – సౌరబ్, శ్రీజ, ఆదిలాబాద్ సినిమా తరహాలో వెడ్డింగ్ షో సినిమా తరహాలో పాటలు చిత్రీకరించేలా వెడ్డింగ్ షో చేస్తున్నాం. ఒక పాటకు రూ.20 వేలు తీసుకుంటుంన్నాం. స్వయం ఉపాధి పొందడంతోపాటు నలుగురికి ఉపాధి చూపుతున్నాం. చిత్రీకరించిన పాటను పెళ్లిరోజు ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రదర్శిస్తున్నాం. – నవీన్, ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ చదవండి: మీసాల వెంట్రుకలతో సూటు.. ఎంత అందంగా ఉందో చూడండి! -
శాంసంగ్‌కు చెక్‌పెట్టేందుకు పెద్దప్లానే వేసిన ఎల్జీ...!
ప్రపంచవ్యాప్తంగా పలు మొబైల్ కంపెనీల రాకతో మార్కెట్లలో ఎల్జీ తన స్థానాన్ని పదిలంగా కాపాడుకోలేకపోయింది. పలు మొబైల్ కంపెనీల దెబ్బకు ఎల్జీ స్మార్ట్ఫోన్ల బిజినెస్‌ను వీడింది. స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తులను నిలిపివేసిన స్మార్ట్ఫోన్లకు ఉపయోగపడే టెక్నాలజీని మాత్రం ఎల్జీ వీడలేదు. తాజాగా శాంసంగ్ మొబైల్స్‌కు చెక్ పెట్టేందుకు ఎల్జీ సరికొత్త ప్లాన్‌తో ముందుకురానుంది. ఎల్జీ కంపెనీలలో ఒకటైన ఎల్జీ కెమ్ (LG Chem) భవిష్యత్తులో వాడే స్మార్ట్ఫోన్లకు కొత్త రకం ఫోల్డబుల్ స్క్రీన్‌తో ముందుకు వచ్చింది. ఈ కొత్త రకం ఫోల్డబుల్ స్క్రీన్ అధిక ధర గల శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 3, గెలాక్సీ ఫోల్డ్ 2 ఫోన్లలో ఉపయోగించే టెక్నాలజీని ప్రభావితం చేసే అనేక సమస్యలను పరిష్కరిస్తోందని ఎల్జీ భావిస్తోంది. చదవండి: India’s First Electric Vehicle : భారత తొలి ఎలక్ట్రిక్ కారు ఇదేనండోయ్..! మన్నిక ఎక్కువ..! ప్లాస్టిక్ లాగా... ఎల్జీ కెమ్ తయారు చేసిన ఫోల్డబుల్ స్క్రీన్ అత్యంత శక్తివంతంగా, మన్నికగా, గాజు తరహాలో అనుభూతిని కలిగించే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. స్క్రీన్ మెటిరియల్ ప్లాస్టిక్ గుణాన్ని పోలీ ఉండనుంది. ఈ స్క్రీన్‌ను రియల్ ఫోల్డింగ్ విండో స్క్రీన్‌గా ఎల్జీ పిలుస్తోంది. స్క్రీన్ మెటీరియల్‌ని టెంపర్డ్ గ్లాస్‌తో ఎల్జీ పోల్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఎల్జీ తన కంపెనీ నుంచి రోలబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయాలనే ప్రణాళికలను నిలిపివేసింది.ఎల్జీ స్మార్ట్ఫోన్ల తయారీ నుంచి వైదొలిగినా.. గూగుల్, ఆపిల్, షావోమీ, వన్‌ప్లస్ వంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ దారులకు తన స్క్రీన్లను సరఫరా చేయాలనే లక్ష్యాన్ని ఎల్జీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ధరలు తగ్గే అవకాశం..! శాంసంగ్ కొన్ని సంవత్సరాల క్రితం ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేయగా , ఆ స్మార్ట్ఫోన్ల ధర గణనీయంగా ఉన్నాయి. ఎల్జీ కెమ్ తయారుచేసిన స్క్రీన్‌తో ఫోల్డబుల్ ఫోన్ల ధరలు గణనీయంగా పడిపోయే అవకాశం ఉందనీ ఎల్జీ తెలిపింది. ఎల్జి కెమ్ స్క్రీన్ మెటీరియల్ తక్కువ మిల్లీమీటర్ల మందాన్ని మాత్రమే కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. మన్నిక విషయానికి వస్తే ఈ స్క్రీన్‌ను సుమారు 2 లక్షల సార్లు మడత పెట్టవచ్చునని ఎల్జీ పేర్కొంది. ఎల్జీ కెమ్ వచ్చే ఏడాది నుంచి రియల్ ఫోల్డింగ్ విండో స్క్రీన్‌ను భారీ సంఖ్యలో ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తోంది. చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో దిగ్గజ కంపెనీ..! -
‘భారత మాతా సినిమా’ కథ ముగిసిందా?!
సాక్షి, ముంబై : ‘ ప్రతి పదేళ్లకోసారి ఓ కొత్త సవాల్ వచ్చి పడుతూనే ఉంది. 1980 దశకంలో సినిమా వీడియోలు వచ్చాయి. అంతే ఇక సినిమా థియేటర్ల పని అయిపోయిందన్నారు. 2010లో టెర్రరిజమ్ బాంబు దాడులు, ఆ తర్వాత మల్టీ ప్లెక్సులు, ఓటీటీలు వచ్చాయి. అంతే సింగిల్ థియేటర్ కథ ముగింసిందన్నారు. ఇప్పుడు 2020లో కరోనా ముట్టడించింది. ఇంతకాలం కష్టనష్టాలకోడ్చి బయట పడిందీ ఓ ఎత్తు. ఇప్పుడు కరోనా తెచ్చిన కష్టాల నుంచి బయట పడడం ఓ ఎత్తు. ఏం జరుగుతుందో చూద్దాం’ అని ముంబై నగరంలోని ‘భారత మాతా సినిమా’ థియేటర్ యజమాని కపిల్ భోపాత్కర్ వ్యాఖ్యానించారు. 1939లో ఏర్పాటైన ఈ సినిమా హాలు పేరు ముందు లక్ష్మీ థియేటర్. ‘నేషనల్ కార్పొరేషన్ మిల్’ స్థలంలో ఓ మూలన, ఆ మిల్లులో పనిచేసే కార్మికుల వినోదం కోసం ఏర్పాటయింది. కార్మికుల షిప్టులను దృష్టిలో పెట్టుకొని సినిమా ఆటల వేలలుండేవి. 1982–83 మధ్య ఆ కార్పొరేషన్ పరిధిలోని 60 బట్టల మిల్లుల్లో కార్మికులు సమ్మె చేశారు. ఆ సందర్భంగా మొదటిసారి సినిమా హాలుకు కష్టాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు వల్ల అక్కడి నుంచి మిల్లులు, మిల్లులోని కార్మికులు పెద్దపెద్ద మిల్లులకు తరలి పోయారు. (బాయ్‌కాట్ సల్మాన్ ఖాన్) సినిమా వీడియోలు రంగప్రవేశం చేయడంతో ఇక ‘భారత మాతా సినిమా’ కథ ముగిసిందంటూ బంధు మిత్రులు హెచ్చరించారని, అయితే మానవుడు సంఘ జీవని, ఇంట్లో కూర్చొని సినిమా చూసే బదులు మిత్రులతో కలిసి సినిమాకు వెళ్లడానికే ఎవరైనా ఇష్ట పడతారంటూ ఓ జర్నలిస్టు మిత్రుడు తన భుజం తట్టినట్లు కపిల్ తెలిపారు. ఆ తర్వాత మల్టీప్లెక్స్‌లు, నేటి ఓటీటీల వల్ల సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని ఆయన చెప్పారు. ఓటీటీ అంటే ఒవర్ ది టాప్ అని అర్థం. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హులు, స్లింగ్ టీవీ తదితర యాప్‌లు ఓటీటీ పద్ధతిలో సినిమాలను మనకు ప్రసారం చేస్తున్నాయి. (సుశాంత్ సింగ్ విశేషాలెన్నో!) ఇలాంటి పోటీలను తట్టుకొని ఇప్పటికీ ‘భారత మాతా సినిమా’ మనుగడ సాగించడానికి టిక్కెట్ ధర అతి తక్కువగా ఉండడం, ఎక్కువగా మరాఠీ చిత్రాలను ఆడించడమే కారణం. టాప్ క్లాస్ టిక్కెట్ ధర కేవలం 80 రూపాయలే. ఒకప్పుడు 750 సీట్ల సామర్థ్యంతో ఏర్పాటైన ఆ సినిమా హాలు సీట్ల ఆధునీకరణ వల్ల 600 సీట్లకు పరిమితమైంది. మరోసారి ఆధునీకరించడం కోసం మార్చి ఒకటవ తేదీన సినిమా హాలును మూసి వేశారు. ఆ తర్వాత లాక్డౌన్ వచ్చింది. తెరచుకునే అవకాశం లేకుండా పోయింది. సినిమా హాలు శాశ్వతంగా మూసివేసి అక్కడ మరో వ్యాపారం నిర్వహించాలంటే అందుకు చట్టం అనుమతించడం లేదు. 1992లో తీసుకొచ్చిన చట్ట ప్రకారం ఓ సినిమా హాలును మూసివేసినట్లయితే ఆ స్థలంలో మూడోవంతు స్థలంలోనైనా మరో సినిమా థియేటర్ నిర్మించాలి. అందుకనే సింగిల్ థియేటర్లు మూత పడిన చోట పుట్టుకొచ్చిన మల్టీఫ్లెక్స్‌లలో సినిమా హాళ్లు వెలిశాయి. అంత స్థలం తనకు లేకపోవడం వల్ల హాలును మూసివేయలేక పోతున్నానంటూ కపిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై నగరంలోని దాదాపు వంద సింగిల్ థియేటర్ల పరిస్థితి ఇలాగే ఉంది. దేశవ్యాప్తంగా సింగ్ థియేటర్ల పరిస్థితి బాగోలేదు. (ఇప్పట్లో ముంబైకి వచ్చే సాహసం చేయను) -
అవి వర్చువల్ నీటి అలలు
-
అబ్బురపరిచే వర్చువల్ నీటి అలలు
సియోల్: నీటి అలలు వేగంగా ఓ భవనంలోని గాజు గదిలోకి దూసుకుపోవటం ఎప్పుడైనా చూశారా? అలాంటి ఓ అద్భుతమైన దృశ్యం దక్షిణ కొరియా దేశంలో చూడవచ్చు. అవి నిజమైన నీటి అలలు కావు.. వర్చువల్ అలలు. సియోల్ నగరంలోని ఓ పెద్ద భవనంలో ఉన్న గాజు గదిలో ప్రపంచంలోనే అతిపెద్ద వర్చువల్ అవుట్ డోర్ హై డెఫినేషన్ స్క్రీన్ ప్రోగ్రామ్ చేయబడింది. దీంతో నీటి అలలు ఎగిసిపడుతున్నట్లు కనిపిస్తున్న వర్చువల్ స్క్రీన్ చూపరులను అబ్బురపరుస్తోంది. అనామోర్ఫిక్ ఎలుషన్గా వర్ణించబడిన ఈ వర్చువల్ అలలు 80 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల పొడవైన తెరపై ప్రతి గంటకు ఒకసారి నిజంగా నీటి అలలు ఎగిసిపడినట్లు దర్శనమిస్తాయి. అనామోర్ఫిక్ ఎలుషన్ దృశ్యం కనిపించాలంటే నిర్దిష్టమైన కోణంలో చూడాలి. ఆశ్చర్యపరిచే ఈ ఆర్ట్‌ను డిస్ట్రిక్ట్ అనే సంస్థ రూపొందించింది. ఈ సంస్థకు ఆర్ట్# వన్ వేవ్‌గా పేరు ఉన్న విషయం తెలిసిందే. ‘మా సంస్థ నుంచి పలు సృజనాత్మకమైన కళలను సృష్టించాలనుకుంటున్నాం’ అని డిస్ట్రిక్ట్ సంస్థ డైరెక్టర్ జూన్ లీ స్టఫ్ తెలిపారు. (మృత్యుశకటం.. భీతావహ వాతావరణం) శామ్సాంగ్ స్మార్ట్ ఎల్ఈడీ టెక్నాలజీని ఉపయోగించి 1620 చదరపు మీటర్ల స్మార్ట్ స్క్రీన్‌లో ఈ అలలకు సంబంధించిన ఆర్ట్‌ను ఇన్స్టాలేషన్ చేయబడింది. ఈ తెరను తయారు చేయడానికి సుమారు రెండు నెలలు సమయం పట్టినట్లు డిస్ట్రిక్ట్ సంస్థ పేర్కొంది. ఇక ఈ స్క్రీన్ రెజల్యూషన్ 7,840 x 1,952 పిక్సెల్స్ ఉంది. ఈ వర్చవల్ తెర అలలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే నాలుగు లక్షలు మంది ఈ వీడియోను విక్షించగా, నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు. వర్చువల్ తెర తయారు చేయటం వెనకు అద్భుతమైన నైపుణ్యం దాగి ఉంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘దక్షిణ కొరియన్లు ఇంత సాంకేతికతో భవిష్యత్తులో ఇంకా ఎంత ముందుకెళుతారోనని అసూయగా ఉంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. -
చుట్టేసే ట్యాబ్లెట్ ఇది...
ఫొటో చూస్తే విషయం అర్థమైపోతుంది. కెనెడాలోని క్వీన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ట్యాబ్లెట్ ఇది. స్క్రీన్‌ను ఉండలా చుట్టేయగలగడం దీని ప్రత్యేకత. డాక్టర్ రోల్ వెర్టిగాల్ నేతృత్వంలోని బృందం ఈ నమూనా యంత్రాన్ని తయారు చేసింది. వివరాలు చూస్తే.. ఏడున్నర అంగుళాల వెడల్పు ఉండే ఈ ట్యాబ్లెట్ స్క్రీన్‌పై చిత్రాలు 2కే రెజల్యూషన్‌లో కనిపిస్తాయి. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో తయారుచేసిన గొట్టం లాంటి ఆకారంపై ఈ తెరను చుట్టేయవచ్చు. గొట్టానికి రెండు చివరల చక్రాల్లాంటివి ఉంటాయి. వాటిని అటు ఇటు తిప్పితే స్క్రీన్‌పై ఉండే ఫొటోలు, వీడియోలు, సమాచారం కనిపిస్తుందన్నమాట. ఈ చక్రాలకు ఒకవైపు ఉండే కెమెరాలను వాడుకుంటే సంజ్ఞల ద్వారా కూడా ట్యాబ్లెట్‌ను పనిచేయించవచ్చు. మొబైల్‌ఫోన్, వాయిస్ రికార్డర్గానూ దీన్ని ఉపయోగించుకోవచ్చునని, అవసరం లేనప్పుడు ఎంచక్కా జేబులో పెట్టేసుకోవచ్చునని వెర్టిగాల్ తెలిపారు. ఈ వినూత్నమైన ట్యాబ్లెట్ వివరాలను ఈ వారం స్పెయిన్‌లో జరగబోయే మొబైల్ హెచ్సీఐలో విడుదల చేస్తామని ఆయన చెప్పారు. -
టీవీ ఎక్కువగా చూస్తున్నారా.. చావుకు దగ్గరైనట్టే
మాంచెస్టర్ : తీరిక సమయంలో చాలా మంది చేసే పని టీవీ చూడటం. రిలాక్స్ కావడానికి అయితే ఫరవాలేదు కాని అదే పనిగా టీవీకి అతుక్కుపోతే మాత్రం చావుకు దగ్గరవ్వటమే అంటున్నారు పరిశోధకులు. ఎక్కువ సమయం టీవీ తెరను అదేపనిగా చూడటం వల్ల గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు. స్కాట్లాండ్కు చెందిన ‘‘యూనివర్శిటీ ఆఫ్ గ్లస్గో’’ జరిపిన ఓ పరిశోధనలో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి. గ్లస్గో విశ్వవిద్యాలయం దాదాపు 4 లక్షల మందితో అతిపెద్ద సర్వేని నిర్వహించింది. శారీరికంగా దృఢంగా లేని వాళ్లు, కండరాళ్ల సత్తువ లేని వాళ్లు మరింత ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. ఎక్కువ సేపు అలా టీవీ తెరను చూస్తూ ఉండటం వల్ల గుండె సంబంధ, ప్రేగు క్యాన్సర్, డయాబెటీస్, ఒబిసిటీ వంటి వ్యాధులు దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. ఇంకో విషయం ఏంటంటే ఇది కేవలం టీవీ తెరకు మాత్రమే కాదు కంప్యూటర్ తెరకు కూడా వర్తిస్తుంది. అయితే ఈ ప్రభావం విషయానికి వస్తే అందరిపై ఒకే విధంగా ఉండదు. టీవీ, కంప్యూటర్ ను చూస్తున్నపుడు ఎంత విరామం తీసుకుంటున్నారు. శారీరకంగా వారు ఎంత బలంగా ఉన్నారు, ఆరోగ్యపు అలవాట్లు , శారీరక శ్రమ ఇలా అన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. -
పీవీఆర్ స్క్రీన్ల వేట
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ చెయిన్ ఆపరేటర్, పీవీఆర్ మరిన్ని ‘స్క్రీన్ల’ను చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా 30 స్క్రీన్లను కొనుగోలు చేయనున్నామని పీవీఆర్ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 70–80 స్క్రీన్లను కొనుగోలు చేస్తామని కంపెనీ జాయింట్ ఎండీ సంజీవ్ కుమార్ బిజ్లి చెప్పారు. కొనుగోలు చేయడానికి పలు స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయని, కానీ తమకు తగినవి మాత్రమే కొనుగోలు చేయాలనుకుంటున్నామని, ఈ విషయమై కసరత్తు జరుగుతోందని వివరించారు. గత ఏడాది పీవీఆర్ కంపెనీ డీఎల్ఎఫ్ నుంచి 32 స్క్రీన్ల డీటీ సినిమాస్‌ను రూ.433 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం పీవీఆర్ సంస్థ 48 నగరాల్లో 122 ప్రోపర్టీల్లో 562 స్క్రీన్లను నిర్వహిస్తోంది. కాగా ఇటీవలనే పీవీఆర్‌లో 14 శాతం వాటాను వార్బర్గ్ పిన్కస్ అనే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ రూ.820 కోట్లకు కొనుగోలు చేసింది. -
యుద్ధానికి ’తెర’లె
ఖైదీ నంబర్ 150, శాతకర్ణి సినిమాలకు థియేటర్ల కేటాయింపులో రాజకీయం ఇతర సినిమాలకు స్క్రీన్ కష్టాలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : సినిమాల్లో హీరోలు చేసే ఫైట్లు చూసి అభిమానులు ఈలలు వేసి కేరింతలు కొట్టడం చూశాం. మా హీరో సినిమా హిట్ అంటే.. కాదు మా వాడి సినిమా హిట్ అంటూ అభిమానులు మాటల యుద్ధం చేసుకోవడమూ చూశాం. తాజాగా మరో రకం యుద్ధం జరుగుతోంది. అదే థియేటర్ల యుద్ధం. గత ఏడాది హీరో బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమాను ఎక్కువ థియేటర్లలో ప్రదర్శింపచేసేందుకు.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా ప్రదర్శనకు థియేటర్లు దొరక్కుండా చేశారనే విమర్శలొచ్చాయి. ఈ ఏడాది కూడా సంక్రాంతి రోజుల్లో సంస్కృతి కొనసాగుతోంది. చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ నటించిన గౌతమీపుద్ర శాతకర్ణి సినిమాల విషయంలో థియేటర్ల యుద్ధం జరుగుతోంది. ఏలూరులో ఇదీ పరిస్థితి ఏలూరు నగరంలోని అంబికా థియేటర్ కాంప్లెక్స్‌లో మూడు, సత్యనారాయణ కాంప్లెక్స్‌లో మూడు, విజయలక్ష్మి థియేటర్లో రెండు, బాలాజీ థియేటర్లో రెండు స్క్రీన్లు కలిపి మొత్తం 10 స్క్రీన్లు ఉన్నాయి. ఈ నెల 11న ఖైదీ నంబర్ 150 విడుదల అవుతుండగా, 12న గౌతమీ పుత్ర శాతకర్ణి విడుదల కాబోతోంది. వీటితోపాటు దిల్ రాజు నిర్మణ భాగస్వామ్యంతో నిర్మితమైన శతమానం భవతి చిత్రం 14వ తేదీన విడుదలవుతూ సంక్రాంతి బరిలో నిలిచింది. 11వ తేదీన ఖైదీ నంబర్ 150 సినిమాను నగరంలోని అన్ని స్క్రీన్లపైనా ప్రదర్శించేందుకు రంగం సిద్ధం చేశారు. 12వ తేదీన విడుదలయ్యే శాతకర్ణి విడుదల తరువాత కూడా అన్ని థియేటర్ కాంప్లెక్స్‌ల్లో ఈ రెండు చిత్రాలను ఏదో ఒక తెరపై ప్రదర్శించనున్నారు. కాగా శతమానం భవతి చిత్రంపై కొద్దిగా అంచనాలు ఉన్నప్పటికీ ఇద్దరు అగ్రనటుల మధ్య పోటీలో ఈ చిత్రానికి తెరలు కరువయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అంబికా కాంప్లెక్స్ ఒకదానిలో మాత్రమే ఈ చిత్రం ప్రదర్శించనున్నట్టు చెబుతున్నారు. కాగా విప్లవ కథానాయకుడు ఆర్.నారాయణమూర్తి నటించిన కానిస్టేబుల్ వెంకట్రామయ్య, భారతీయ నటి దీపికా పడుకొనే నటించిన ఇంగ్లిష్ చిత్రం ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ఆ ఫ్ జాండర్ కేజ్ చిత్రం ఈనెల 14న విడుదల కానున్నాయి. ఇవి ఏ థియేటర్లో విడుదలయ్యేది ప్రశ్నార్థకంగానే ఉంది. వీటికి తెరలు దొరికేదీ లేనిదీ చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల జయాపజయాలపై ఆధారపడి ఉంటుంది. చింతలపూడిలో.. చింతలపూడి నియోజకవర్గంలో చిరంజీవి సినిమాను మొదటి రోజున రెండు బెనిఫిట్ షోలు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రమే వెళ్ళే ఈ షోలకు టికెట్ ధర రూ.500 నిర్ణయించారు. మొదటి రోజున పట్టణంలోని ఎక్కువ థియేటర్లలో ఇదే సినిమా వేయడానికి సిద్ధం చేశారు. పండగ మూడు, నాలుగు రోజులు రత్నా కాంప్లెక్స్‌లో చిరు 150 సినిమా మాత్రమే వేసే అవకాశం ఉంది. బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి కూడా ముందుగానే బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మడానికి రెడీ అవుతున్నారు. ఈ పండగకు రెండు చిత్రాల మధ్య చిన్న చిత్రాలకు థియేటర్లు దొరికే పరిస్థితి లేదు. నరసాపురంలో.. నరసాపురం పట్టణంలో మూడు, మొగల్తూరులో రెండు థియేటర్లు ఉన్నాయి. వీటిలో పెద్ద సినిమాలనే బుక్ చేశారు. చిన్న సినిమాలకు ప్రస్తుతానికి చాన్స్ కనబడటం లేదు. నరసాపురంలో మొదటి రోజున మూడు థియేటర్లలోనూ ఖైదీ నంబర్ 150 సినిమా ప్రదర్శిస్తున్నారు. ఈనెల 12 నుంచి ఓ థియేటర్లో చిరంజీవి సినిమా, మరో థియేటర్లో బాలకృష్ణ సినిమా ప్రదర్శిస్తున్నారు. మొగల్తూరులో ఒక దాంట్లో చిరంజీవి సినిమా, మరొక థియేటర్లో బాలకృష్ణ సినిమా ప్రదర్శిస్తున్నారు. చిరంజీవి సినిమా స్పెషల్ షో టికెట్ ధర ప్రస్తుం రూ.500 ఉంది. రూ.1000కి పెరిగే అవకాశం ఉందంటున్నారు. -
తెర పై నేను ఎలా ఉంటాను?
‘వారెవ్వా ఏమి ఫేసు? అచ్చు హీరోలా ఉంది బాసూ... వచ్చింది సినిమా ఛాన్సు...’ అంటూ పొగడ్తలతో ముంచెత్తే వాళ్లుంటారు.. ‘నువ్వా...సినిమాల్లోనా? ఫేసెప్పుడైనా అద్దంలో చూసుకున్నావా?’ అంటూ తీసిపారేసేవాళ్లూ ఉంటారు. దీంతో అసలు తాను సినిమాలకి నప్పుతానా? హీరో/ హీరోరుున్‌గా బాగుంటానా? కమెడియన్‌గా సూట్ అవుతానా? క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఓకే అనిపిస్తానా? ఇలాంటి సందేహాలు ఎప్పటికీ తీరవు. మరి వాటిని తీర్చుకోవాలంటే... స్క్రీన్ టెస్ట్ చేయాలి. ఏ డెరైక్టరో మనల్ని చూసి పిలిచి మరీ ఆ టెస్ట్ చేయాలి. అది జరగడం అంత ఈజీ కాదు. మరెలా? సిటీలోని కొన్ని ఫొటో స్టూడియోల దగ్గర దీనికి సమాధానం ఉంది. - చైతన్య వంపుగాని సినిమాల్లో నటించాలనే కోరిక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిలో ఉంటుంది. అరుుతే స్క్రీన్‌పై తన ముఖం, మొత్తంగా లుక్ ఎలా ఉంటుంది? ఎలాంటి మేకప్ అవసరమవుతుంది? ఇలాంటి సందేహాలతో సతమతమవుతుంటారు. ఇలాంటి వారికి స్పష్టత ఇచ్చేందుకు సిటీలోని ఫొటో స్టూడియోలు వివిధ రకాల సేవలందిస్తున్నారుు. రేపటి తారల కోసం... సినిమాల్లో నటించాలనే కోరిక ఉంటే తొలి అడుగు పోర్ట్‌ఫోలియో. దీనిని రూపొందించే ముందు మనిషి ఎత్తు, రంగు, ఫిజిక్ చూస్తారు. తర్వాత విభిన్న రకాల కాస్ట్యూమ్స్‌లో ఫొటోషూట్ చేస్తారు. ఈ షూట్లో ఫొటోగ్రాఫర్, మేకప్ ఆర్టిస్ట్, స్టైలిస్ట్లుంటారు. ఈ సందర్భంలోనే ఏ డ్రెస్‌లో ఎలా ఉన్నారు? ఏ యాంగిల్లో లుక్ బాగాలేదు? బాగా ఉంది? ఏ పార్ట్‌ను ఎలా హైలెట్ చేసుకోవాలి? బాగాలేదనిపిస్తున్న పార్ట్‌ని ఎలా దాచిపెట్టాలి? తదితర అంశాలపై సదరు వ్యక్తికి తర్ఫీదు ఇస్తారు. అనంతరం విభిన్న రకాల గెటప్స్‌తో రూపుదిద్దుకున్న పోర్ట్ ఫోలియోను దగ్గర ఉంచుకొని సినిమా ప్రయత్నాలు పూర్తి స్థారుులో మొదలుపెట్టేందుకు వీలవుతుంది. అందుకనే సినిమా రంగానికి వెళ్లాలనుకునేవారు వేయాల్సిన తొలి అడుగుకు తోడయ్యే ఫొటో స్టూడియోలకు సిటీలో ఇప్పుడు మంచి డిమాండ్. మా దగ్గర సినీ కలలు సాకారం.. ‘హీరో శర్వానంద్, ప్రముఖ యాంకర్ సుమలు ఏ మేకప్‌లో ఉంటే ప్రేక్షకులను ఆకట్టుకుంటారో దానికి అనుగుణంగా వారికి మేకప్ పరమైన అభ్యాసం చేరుుంచాను’ అంటూ గుర్తు చేసుకున్నారు నారాయణగూడలోని భట్ స్టూడియో యజమాని నటరాజ్ భట్. ఇప్పుడాయన తన స్టూడియో ద్వారా తారలై తెర మీద వెలగాలనుకునే వారికి పలు మార్గాల్లో సేవలందిస్తున్నారు. ఇటీవలే సుమ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ ఫొటో స్టూడియోలో మేకప్ కోర్సును కూడా నేర్పిస్తుండడం విశేషం. ఇందులో టీవీ, సినిమా, స్టేట్ ఆర్టిస్ట్, బ్రైడల్ మేకప్ కోర్సులను నేర్పిస్తారు. నటి అర్చన, బాబా సెహగల్‌తో పాటు మరికొంత మంది బాలీవుడ్ స్టార్స్ ఫీల్డ్‌లోకి రాకముందు తన దగ్గర మేకప్, స్క్రీన్ ప్రెజెంటేషన్ చేరుుంచుకున్నవారేనని చెప్పారు నటరాజ్. -
తిట్టుకున్నా సరే... రాజీ పడను!
విధి, కావ్యాంజలి, ఉమ్మడి కుటుంబం, రాధాకళ్యాణం, ఆహ్వానం, దామిని... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సీరియళ్లే ఉన్నాయి శ్రీరామ్ ఖాతాలో. అయితే ఈ మధ్య ఆయన స్క్రీన్ మీద కనిపించడం లేదు. స్క్రీన్ వెనుక మాత్రం పెద్ద బాధ్యతనే నిర్వర్తిస్తున్నారు. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, వరూధినీ పరిణయం లాంటి హిట్ సీరియళ్ల నిర్మాతగా బిజీ బిజీగా ఉన్నారు. పలకరిస్తే ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం... చాలా మంచి నటుడు మీరు. మరి నటనకు దూరంగా ఉంటే ప్రేక్షకులు మిమ్మల్ని మిస్సవ్వరా? అదేం ఉండదు. ఎవరు కనిపిస్తే వాళ్లకే కనెక్టయిపోతారు ప్రేక్షకులు. శ్రీరామ్ అనే నటుడు ఉన్నాడన్న విషయం గుర్తుంటుందేమో కానీ, అతను ఏమైపోయాడు అని దిగులు పడేంతగా ఏమీ ఉండదు. అసలు నిర్మాతగా ఎందుకు మారాలనిపించింది? అదేమీ నా లక్ష్యం కాదు. అనుకోకుండా జరిగిందంతే. నా ఫ్రెండ్స్ కొందరిని దర్శకులుగా ప్రోత్సహించడం కోసం నేను నిర్మాతగా మారాను. ‘శైలు’ నా మొదటి సీరియల్. కొన్నాళ్లపాటు నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే నటించాను. కానీ నిర్మాత బాధ్యతలు చాలా పెద్దవి. వాటితో పాటు నటన అంటే కష్టమైపోయింది. క్వాలిటీ మిస్సవుతానేమోనని భయమేసింది. అందుకే కొన్నాళ్లు నటనకు దూరంగా ఉందామనుకున్నాను. ఓటమిలో ఉన్నప్పుడు విజయం కోసం కష్టపడతాం. కానీ విజయం సాధించిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. ప్రస్తుతం నేను అదే చేస్తున్నా. సీరియల్ నిర్మాణం అంటే చిన్న విషయం కాదు. ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? ఏ కొత్త పని మొదలుపెట్టినా సవాళ్లనేవి ఉంటాయి. అప్పుడనేంటి... ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నాను. ముఖ్యంగా నటీనటుల విషయంలో సమస్య వస్తుంది. కొంతమంది ఉంటారు. కాస్తో కూస్తో పేరు రాగానే యాటిట్యూడ్ మారిపోతుంది. సీరియల్ సక్సెస్‌కి తామే కారణం అన్న భావనలోకి దిగిపోతారు. దాంతో పనిమీద నిర్లక్ష్యం వస్తుంది. పర్ఫెక్షన్ తగ్గుతుంది. నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. నేనూ నటుణ్నే కాబట్టి నటనలో పరిణతి ఎంత అవసరం అనేది చెబుతుంటాను. కొందరు వింటారు. కొందరు వినరు. అలాంటప్పుడు వాళ్లని మార్చాల్సి వస్తుంది. అలా చాలాసార్లు మార్చాను కూడా. ఇలా చేస్తే ఎవరూ బాధపడరా? పడతారు. కానీ నేనేం చేస్తాను? క్వాలిటీ ముఖ్యం కదా! ఈరోజు నేను నిర్మాతగా నిలబడ్డాను అంటే క్వాలిటీ విష యంలో రాజీపడకపోవడం వల్లే. ఐదేళ్లుగా జీ తెలుగుకి సీరియల్స్ చేస్తున్నాను. వాళ్లు నన్ను చాలా ప్రోత్సహిస్తారు. ఎందుకంటే శ్రీరామ్ సీరియల్ అంటే బాగుంటుంది, తను క్వాలిటీ మెయింటెయిన్ చేస్తాడు అన్న నమ్మకం ఉండటం వల్లే కదా! నేను ప్రతిక్షణం ప్రతి విషయాన్నీ చూసుకుంటాను. నటించి చూపిస్తాడు. ఒక్కోసారి డెరైక్ట్ చేసి చూపిస్తాను. స్క్రిప్ట్ రాసిన రోజులు కూడా ఉన్నాయి. ఇదంతా క్వాలిటీ కోసమే. నాకు కోపమెక్కువని, తిడతానని అంటారు. తిట్టుకుంటారు. అయినా రాజీపడను. ఈ మధ్య సీరియళ్లు కూడా సినిమాల్లోలాగా పాటలు, ఫైట్లు, రొమాన్స్‌తో నిండిపోతున్నాయి. అవంత అవసరమా? ప్రేక్షకులకు కొన్ని నచ్చుతాయి. వాటిని యాడ్ చేయడంలో తప్పు లేదు కదా! కానీ సీరియళ్లు నెగిటివ్ ప్రభావం ఎక్కువ చూపిస్తాయన్న కామెంట్ ఉంది. దానికేమంటారు? చూడటం మానేయమనండి. మేం కూడా తీయడం మానేస్తాం. ఓ సీన్ మధ్యలో ఆపితే తర్వాత ఏమవుతుందోనని ఆసక్తిగా తర్వాతి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తారు. వాళ్ల ఆసక్తిని బట్టే మేం సీరియల్స్ తీసేది. వాళ్లు చూడనిది మేం ఎందుకు తీస్తాం చెప్పండి! డబ్బింగ్ సీరియల్స్ ఎక్కువవుతున్నాయి. పోటీ పెరుగుతోందా? డబ్బింగ్ సీరియల్స్ మన సీరియల్స్‌కి ఎప్పుడూ పోటీ కాదు. మరి వాటిని ఆపేయమని గొడవ ఎందుకు? ఎందుకంటే... సీరియళ్ల మీద ఆధారపడి కొన్ని వేలమంది బతుకుతున్నారు. వాళ్లందరికీ పని లేకుండా పోతుందని. అంతేతప్ప అవి మనకు పోటీ అవుతాయని కాదు. కానీ ఇన్ని సీరియళ్లు వస్తున్నాయి, జనం చూస్తున్నారు. అంటే మన దగ్గర లేనిదేదో వాళ్ల సీరియళ్లలో ఉందనేగా? అదే నిజమైతే ఆ సీరియళ్లన్నీ హిట్టయ్యి ఉండేవి. కానీ అయ్యాయా? ఏవో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడానికి మనవాళ్లు డబ్బింగ్ సీరియళ్లని ఫిల్లర్స్లాగా వాడుకుంటున్నారు. అందుకే సూపర్ ప్రైమ్ టైమ్‌లో డబ్బింగ్ సీరియళ్లు ఉండవు. అన్నీ తెలుగు సీరియళ్లే ఉంటాయి. దాన్నిబట్టే తెలుస్తోంది కదా! కానీ హిందీ సీరియళ్ల క్వాలిటీ మనవాటిలో ఉండదుగా? వాళ్లది ఇంటర్నేషనల్ మార్కెట్. మనది రీజినల్ మార్కెట్. వాళ్లు ప్రపంచంలో ఎక్కడైనా వాటిని అనువదించి ప్రసారం చేసుకోగలరు. కానీ మన మార్కెట్ అంత విస్తరించలేదు. ఆ అవకాశం లేదు కూడా. కన్నడలో డబ్బింగ్ సంస్కృతే ఉండదు. వాళ్లు ఇష్టపడరు. అంటే మనం పక్క రాష్ట్రంలో కూడా మన సీరియల్‌ని మార్కెట్ చేయలేం. అందుకే మన బడ్జెట్ తక్కువ ఉంటుంది. ఆ బడ్జెట్‌కి సరిపడానే క్వాలిటీ ఉంటుంది. నిజానికి నేను ఖర్చు ఎక్కువే పెడతాను. దాంతో కొందరు ఫ్రెండ్స్... ‘ఎందుకంత ఖర్చు పెడతావు, నువ్విది అలవాటు చేస్తే అందరికీ ఇబ్బంది’ అని నవ్వుతూనే అంంటుంటారు, నేను నవ్వుతూనే వింటాను. బట్ నో కాంప్రమైజ్. సినిమా నిర్మాణం వైపు వెళ్లే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? నాకో డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. దాన్ని సీరియల్‌గా తీయడం కుదరదు. సినిమాగానే తీయాలి. కాబట్టి బహుశా వెళ్తానేమో! మళ్లీ శ్రీరామ్‌ని నటుడిగా చూసే అవకాశం లేదా? అదేం లేదు. తప్పకుండా మళ్లీ నటిస్తాను. ఎందుకంటే నేను నటనను చాలా మిస్ అవుతున్నాను. అందుకు చాలా బాధపడుతున్నాను కూడా. అవకాశం దొరగ్గానే ఓ సర్‌ప్రయిజింగ్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకొస్తాను. - సమీర నేలపూడి -
వెండితెరకు అంపశయ్య
‘‘కొన్ని దశాబ్దాల కిందటి సంచలన నవల ‘అంపశయ్య’కు తెరరూపమిచ్చే ప్రక్రియ దాదాపుగా పూర్తి కావచ్చింది’’ అని దర్శకులు ప్రభాకర్ జైని చెప్పారు. ‘అమ్మా నీకు వందనం’, ‘ప్రణయ వీధుల్లో’ చిత్రాల తర్వాత ఆయన చేస్తున్న చిత్రం ‘అంపశయ్య’. జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిత్రవిశేషాలను ప్రభాకర్ జైని చెబుతూ - ‘‘నా గత రెండు చిత్రాలూ పలు పురస్కారాలు దక్కించుకున్నాయి. ఆ చిత్రాలతో పోలిస్తే మరింత వ్యయ ప్రయాసలతో ‘అంపశయ్య’ను రూపొందిస్తున్నాను. ఇది బహు భాషా చిత్రం. జాతీయ అవార్డుని లక్ష్యంగా చేసుకుని ఈ చిత్రం చేస్తున్నా. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నవీన్‌కు ఇంటిపేరుగా మారిపోయిన అంపశయ్య ఒక యువకుని మనసులో చెలరేగే రకరకాల కల్లోలాలకు ప్రతిరూపం. కథానుగుణంగా 1970నాటి పరిస్థితులను అత్యంత సహజంగా చూపిస్తున్నాం. ఈ పీరియడ్ ఫిలింలో హీరోగా శ్యాంకుమార్, హీరోయిన్గా తెలుగమ్మాయి పావని బాగా నటించారు. నర్సాపూర్ అడవులు, వరంగల్ రామప్ప టెంపుల్, ఉస్మానియా యూనివర్సిటీ... తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం’’ అని చెప్పారు. -
దుమ్ములేపుతున్న బుల్లితెర భామలు
-
స్క్రీన్ షేర్చేసుకుంటున్న కమల్,రజనీ..?
-
విడుదలకి సిద్దమైన బాలయ్య ’ లయన్’
-
స్మార్ట్ ఫోన్ చిక్కులకు చిట్కాలివిగో...
ఆండ్రాయిడ్ ఫోన్ అప్పుడప్పుడైనా సతాయిస్తోందా? స్క్రీన్ జామై... లేదంటే కొన్ని అప్లికేషన్లు సరిగా పనిచేయకుండా మొరాయిస్తోందా? స్మార్ట్‌ఫోన్‌తో చిక్కులు అందరికీ కామనే. అయితే చాలా వరకూ సమస్యలను మనమే సరిచేసుకోవచ్చు. సాధారణంగా స్మార్ట్ఫోన్లతో వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి? వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? అన్నది చూద్దామా... పదే పదే గూగుల్ ప్లే స్టోర్ క్రాష్ అవుతూంటే... స్మార్ట్ఫోన్లతోపాటు ఇన్‌బిల్ట్‌గా వచ్చే గూగుల్ ప్లే స్టోర్ తరచూ క్రాష్ అవడం మనందరికి అనుభవమైన సమస్య. దీనికి వైరస్, మాల్, యాడ్వేర్లతో సంబంధం లేదు. క్యాష్ మెమరీలో తేడాలు రావడం వల్ల ఇలా జరుగుతూంటుంది. క్యాష్ మెమరీని తుడిచేస్తే ప్రాబ్లెమ్ పోయినట్లే. ఈ పనిచేసేందుకు ఏం చేయాలంటే... ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆప్స్‌ను సెలెక్ట్ చేసుకోండి. కుడివైపునకు స్వాప్ చేస్తూ వెళితే ‘ఆల్’ అన్న ట్యాబ్ కనిపిస్తుంది. దాంట్లో గూగుల్ ప్లే స్టోర్‌ను గుర్తించి డేటా, క్యాష్‌లను తుడిచేయండి. ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. అప్పటికీ సమస్య తీరకపోతే గూగుల్ ప్లే సర్వీసెస్, గూగుల్ సర్వీసెస్ ఫ్రేమ్‌వర్క్‌లలోని డేటా, క్యాష్‌లను కూడా తుడిచేసి చూడండి. సిస్టమ్ యూజర్ ఇంటర్ఫేస్ జామ్ అయిపోతే... స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ఉన్నట్టుండి ఫ్రీజ్ అయిపోవడం... రీస్టార్ట్ చేయడంతో మళ్లీ పనిచేయడం మనం చూసే ఉంటాం. ఒకవేళ రీస్టార్ట్ చేసిన తరువాత కూడా స్క్రీన్‌లోని యూజర్ ఇంటర్ఫేస్ పనిచేయలేదనుకోండి. దీనికి సంబంధించి క్యాష్ మెమరీని తొలగించుకోవడం ద్వారా కొంత ఫలితముంటుంది. క్యాష్ వైప్ చేసుకునేందుకు మొదట్లో చెప్పినట్లుగా సెట్టింగ్స్‌లోని ఆప్ ట్యాబ్‌కు, అందులోని ఆల్ సెక్షన్‌కు వెళ్లి యూజర్ ఇంటర్ఫేస్ను సెలెక్ట్ చేసుకోవాలి. వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ కాకపోతే.... ఇలాంటి సమస్యకు ఎక్కువగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని రూటర్ లోపం కారణమవుతూంటుంది. రూటర్తోపాటు ఫోన్‌ను ఒకసారి రీస్టార్ట్ చేయడం ద్వారా వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావవచ్చు. ప్లే స్టోర్‌తో అప్లికేషన్లు డౌన్లోడ్ కాకపోతే... కొన్ని సార్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్లు డౌన్లోడ్ కాకుండా ఇబ్బంది పెడుతూంటాయి. దీనికి రెండు రకాల పరిష్కారాలున్నాయి. గూగుల్ ప్లే స్టోర్ క్యాష్ మెమరీని వైప్ చేయడం ఒకటైతే... గూగుల్ ప్లే హిస్టరీని ఇరేజ్ చేయడం రెండో పద్ధతి. క్యాష్‌ను వైప్ చేయడమెలాగో ఇప్పటికే చూశాం. హిస్టరీని తొలగించాలంటే ప్లే స్టోర్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌ను ఓపెన్ చేయండి. అందులో క్లియర్ హిస్టరీని సెలెక్ట్ చేసుకుంటే సరి. వీడియో ప్లే కాకపోతే... వీఎల్సీ, లేదా ఎంఎక్స్ ప్లేయన్లను ఉపయోగించి చూడండి. వీటితోనూ వీడియో ప్లే కాకపోతే దాంట్లోని ఫార్మాట్ సపోర్ట్ చేయడం లేదని అర్థం. మామూలుగా వీఎల్సీ, ఎంఎక్స్ ప్లేయర్లు చాలావరకూ ఫార్మాట్లను సపోర్ట్ చేస్తాయి. ప్రొప్రైటరీ ఫార్మాట్లకు మాత్రం ఆయా వీడియోలు సూచించే ప్లేయర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌ను రీ ఇన్స్టాల్ చేయాలంటే... మీ స్మార్ట్‌ఫోన్ ఆప్స్ ఫోల్డర్లో గూగుల్ ప్లే స్టోర్ కనిపించడం లేదా? అయితే మీరు పొరబాటున దాన్ని అన్ ఇన్స్టాల్ చేశారన్నమాట. రూట్ యాక్సెస్ లేకుండా ప్లే స్టోర్‌ను తొలగించలేము కాబట్టి అన్ఇన్స్టాల్ మాత్రమే చేయగలం. దీని తిరిగి ఇన్స్టాల్ చేసుకోవాలంటే సెట్టింగ్స్‌లోని ఆప్స్‌లోకి వెళ్లండి. కుడివైపునకు స్వాప్ చేసుకుంటూ వెళితే... డిసేబుల్డ్ అన్న ట్యాబ్ కనిపిస్తుంది. అందులో గూగుల్ ప్లే స్టోర్‌ను గుర్తించి క్లిక్ చేస్తే తిరిగి ఎనేబుల్ చేయవచ్చు. కొన్ని ట్యాబ్లెట్లలో గూగుల్ ప్లే స్టోర్ అస్సలు ఉండదు. అటువంటి సందర్భాల్లో ధర్డ్‌పార్టీ నుంచి ఏపీకేను డౌన్లోడ్ చేసుకుని గూగుల్ ప్లే స్టోర్‌ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీని కోసం సెట్టింగ్స్‌లోని సెక్యూరిటీ ట్యాబ్‌లోకి వెళ్లి అక్కడున్న అన్నోన్ సోర్సెస్‌ను టిక్ చేయండి. అప్పుడు థర్డ్‌పార్టీ నుంచి ప్లే స్టోర్‌ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మెమరీ తక్కువగా ఉన్నప్పుడు... రకరకాల పనుల కోసం అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుని... కొంత కాలం తరువాత స్పేస్ లేదని చిరాకు పడుతూంటాం. స్మార్ట్‌ఫోన్‌లో మెమరీని సద్వినియోగం చేసుకునేందుకు మార్కెట్లో అనేక అప్లికేషన్లు ఉన్నాయి. వీటితో కొంత మెమరీని సేవ్ చేసుకోవచ్చు. అలాకాకుండా అప్లికేషన్లను అన్ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా కూడా మెమరీని ఆదా చేయవచ్చు. అయితే స్పాటిఫై వంటి మ్యూజిక్ ఆప్స్ అన్ ఇన్స్టాల్ చేసేందుకు అవి ఎక్కడున్నాయో తెలియాలి. అటువంటి సందర్భాల్లో సీసీ క్లీనర్ వంటి అప్లికేషన్లు వాడటం మంచిది. డిస్క్ యూసేజ్ వంటి వాటితో ఏ అప్లికేషన్ ఎంత మెమరీ తీసుకుంటోందో చూసుకోవచ్చు. తదనుగుణంగా చర్యలు తీసుకోవచ్చు ఆన్ అవుతూనే ఫోన్ క్రాష్ అవుతూంటే.. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బూట్ కాకుండా సతాయిస్తూంటే... పదే పదే క్రాష్ అవుతూంటే.. దాన్ని సేఫ్ మోడ్‌లో ఆన్ చేయడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. అయితే సేఫ్‌మోడ్‌లో ఎలా ఆన్ చేయడం అన్నది ఒక ప్రశ్న. దీనికి కూడా ఒక సింపుల్ పద్ధతి ఉంది. ఫోన్ పవర్‌బటన్‌ను కొద్దిసేపు నొక్కి పట్టుకుంటే... పవర్ ఆఫ్ అన్న ఆప్షన్ వస్తుంది. పవర్ ఆఫ్ ఆప్షన్‌ను కూడా కొద్దిసేపు నొక్కి పట్టి ఉంచితే... ఫోన్‌ను సేఫ్ మోడ్‌లో రీబూట్ చేయాలా? అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరి. ఒకసారి మీరు సేఫ్‌మోడ్‌లో స్మార్ట్‌ఫోన్‌ను ఆన్ చేసిన తరువాత అనవసరమైన, తేడాగా ఉన్న అప్లికేషన్లను తొలగించి రీస్టార్ట్ చేస్తే బూటింగ్ సమస్య పోతుంది. స్కానింగ్ కోసం ఆఫీస్ లెన్స్.. అకస్మాత్తుగా మీ పాస్‌పోర్ట్ కాపీ లేదంటే ఇంకో రసీదు స్కాన్ చేయాలి? ఏం చేస్తారు? దగ్గర్లో ఉన్న డీటీపీ సెంటర్‌కు వెళ్లడం చాలామంది చేసే పని. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే ఒక చిన్న అప్లికేషన్ ద్వారా ఈ పని మీరు ఎక్కడుంటే అక్కడే చేసేయవచ్చు. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా ఆండ్రాయిడ్‌తోపాటు ఐఫోన్ కోసం కూడా ఆఫీస్ లెన్స్ పేరుతో ఇలాంటి ఓ అప్లికేషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. మీరు స్కాన్ చేయాలనుకుంటున్న రసీదు లేదా కాగితాన్ని ఫొటో తీసి అప్లికేషన్‌ను రన్ చేస్తే చాలు. మీకు నచ్చిన ఫార్మాట్ (పీడీఎఫ్, డాక్స్, పీపీటీఎక్స్, జేపీజీ)లోకి మార్చేసి ఇస్తుంది. వన్నోట్తో కలిసి ఈ అప్లికేషన్ బిజినెస్కార్డులు, రసీదులు తదితర డాక్యుమెంట్లను స్కాన్ చేయగలదు. స్కాన్వన్, వన్నోట్లు బిజినెస్ కార్డులను స్కాన్ చేయడంతోపాటు వాటిల్లోని ఫోన్ నెంబర్లను నేరుగా ఫోన్లోకి ఫీడ్ చేసుకునేందుకు వీలుకల్పిస్తాయన్నది తెలిసిందే. మొబీ ఎన్షూర్... స్మార్ట్‌ఫోన్ ఎక్కడైనా మరచిపోయినా, ఎవరైనా ఎత్తుకెళ్లినా చాలా ఇబ్బంది. మన నెంబర్‌కు పదేపదే కాల్ చేయడం అవతలివారు లిఫ్ట్ చేయకపోవడం పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినా పెద్దగా ఫలితం లేకపోవడం మనలో చాలామందికి అనుభవం. ఈ సమస్యలన్నింటినీ ఒక్క ఎస్ఎంఎస్తో సరిచేయవచ్చునంటోంది మొబీ ఎన్షూర్ టెక్నాలజీస్. ఈ సంస్థ అభివృద్ధి చేసిన మొబీ ట్రాకర్ అప్లికేషన్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే దాని పోగొట్టుకున్నా తిరిగి వెతుక్కోవడం చాలా సులువు. ఎందుకంటే... పోగొట్టుకుపోయిన తరువాత ఈ అప్లికేషన్ ఎప్పటికప్పుడు తాను ఉండే ప్రాంతం వివరాలు మీరు సూచించే మరో నెంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో పంపుతూ ఉంటుంది. అంతేకాదు.... అవతలివాళ్లు సిమ్ మార్చినా సరే... కొత్త సిమ్ నెంబర్‌ను కనిపెట్టి మీ ఇతర నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేస్తుంది. దాంతోపాటు అవతలి వ్యక్తి కొత్త నెంబర్‌తో ఏఏ నెంబర్లకు ఫోన్ చేశారన్న వివరాలు కూడా మెయిల్ ఐడీకి పంపుతుంది. చిన్న మెసేజీతో మీ ఫోన్‌ను లాక్ చేయడంతోపాటు ఆఫ్ బటన్ తాత్కాలికంగా పనిచేయకుండా చేసేయవచ్చు. దీనివల్ల ఫోన్ ఎత్తుకెళ్లిన వారు ఫోన్ అస్సలు ఆఫ్ చేయలేరు. ఇన్ని వివరాలు దొరికిన తరువాత మీ ఫోన్ మళ్లీ మీకు దొరకడం చాలా సులువే కదా! మెదడుకు ఇంగ్లీష్ మేత... స్మార్ట్‌ఫోన్‌లోని గేమ్స్‌తో మీరు టైమ్‌పాస్ చేస్తూనే ఉంటారు కదూ... కాలం గడిపేందుకు మాత్రమే కాకుండా మీ మెదడుకు మేతగానూ ఈ గేమ్స్ ఉపయోగపడితే? అదికూడా ఇంగ్లీషు భాషలో మీ పరిజ్ఞానాన్ని పెంచేదైతే? భలే ఉంటుంది. లెటర్క్రాఫ్ట్ అచ్చంగా ఇదే పనిచేస్తుంది. క్రాస్‌వర్డ్ పజిల్ మాదిరిగా గళ్లుగళ్లుగా ఉండే ఈ గేమ్‌లో పదాలను వెతికి సరిచేయాల్సి ఉంటుంది. లెవల్స్ పెరిగేకొద్దీ పదాల సంక్లిష్టత పెరుగుతుందన్నమాట. నిర్ణీత సమయంలో వీలైనన్ని ఎక్కువ పదాలను గుర్తించాల్సి ఉంటుంది. పదం పొడవునుబట్టి మీకు పాయింట్లు వస్తాయి. లెటర్క్రాఫ్ట్ ప్రస్తుతానికి ఐఫోన్ వినియోగదారుల కోసం మాత్రమే అందుబాటులో ఉంది. గేమ్ ఉచితంగానే లభిస్తున్నప్పటికీ కొంచెం డబ్బు చెల్లించడం ద్వారా మీరు గుర్తించిన పదాల జాబితా, మీ ప్రోగ్రెస్ వంటి అదనపు వివరాలు -
మైక్రోసాఫ్ట్ వండర్ టెక్ హాలో లెన్స్!
డెస్క్‌టాప్ కంప్యూటర్ పేరు చెప్పగానే.... ఓ స్క్రీన్, మౌస్.. కీబోర్డు కళ్లముందు కదులుతాయి. అనంత విశ్వం కూడా ఈ బుల్లిపెట్టెలోనే ఇమిడిపోతుంది. ఆ స్క్రీన్‌పైనే రకరకాల ప్రాంతాల్లో రకరకాల సమాచారాన్ని చూసుకుంటూ అర్థం చేసుకుంటూ మార్చుకుంటూ గడిపేస్తాం మనం. ఇకపై ఆ అవసరం లేదంటోంది మైక్రోసాఫ్ట్. కొన్ని నెలల్లో అందుబాటులోకి రానున్న హాలోలెన్స్ టెక్నాల జీతో మీరున్న గదే పీసీ తెరగా మారిపోతుందంటోంది. ఏమిటీ హాలోలెన్స్ టెక్నాలజీ? ఎలా పనిచేస్తుంది? హాలీవుడ్ సినిమా ఐరన్‌మ్యాన్ చూశారా? దాంట్లో జార్విస్ పేరుతో ఓ సూపర్ కంప్యూటర్ ఉంటుంది. దాని సీపీయూ ఎక్కడుంటుందో సినిమాలో చూపించలేదుగానీ... హీరో మాటలనే ఆదేశాలుగా స్వీకరిస్తూ, మాట్లాడుతూ పనిచేస్తుందది. అంతేకాదు. హీరో డిజైన్ చేస్తున్న శక్తిమంతమైన సూట్ తాలూకూ వివరాలన్నింటినీ హీరో ఉన్న చోటే గాల్లో ప్రదర్శిస్తూంటుంది. హీరో గాల్లో చేతులు ఊపుతూ, కదుపుతూ ఆ డిజైన్‌లో మార్పులు చేర్పులు చేస్తూంటాడు. మైక్రోసాఫ్ట్ తన లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘విండోస్ 10’లోకి చేర్చిన హాలోలెన్స్ కూడా దాదాపుగా ఇదేమాదిరిగా పనిచేస్తుంది. కాకపోతే ఐరన్మ్యాన్లో హీరో కళ్లజోడు లాంటిది పెట్టుకోడు. హాలోలెన్స్కు హైటెక్ గ్లాస్ లాంటి పరికరం అవసరమవుతుంది. అంతే! ఊహూ... ఇది గూగుల్ గ్లాస్ మాదిరిగా కళ్లజోడులోని అద్దంపై కంప్యూటర్ స్క్రీన్‌ను ప్రొజెక్ట్ చేయదు. హాలోగ్రామ్ల ఆధారంగా పనిచేసే తొలి కంప్యూటర్ ఇదని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. మన కంటికి కనిపించే వస్తువులు ఎలాగైతే పదార్థాలతో తయారవుతాయో అలాగే హాలోగ్రామ్లో కనిపించే వస్తువులు అచ్చంగా కాంతితో తయారవుతాయి. హాలోలెన్స్ కోసం మైక్రోసాఫ్ట్ ప్రత్యేకంగా ఓ హాలోగ్రామ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సిద్ధం చేసింది. కళ్లజోడు లాంటి ఈ పరికరాన్ని తగిలించుకుని నచ్చిన ఫీచర్లను మీ గదిలోని రకరకాల వస్తువులపై ఉంచవచ్చు. వాటితో ఆడుకోవచ్చు. ఉదాహరణకు మీ పీసీలో వీడియో ప్లేయర్‌ను తీసుకుందాం. దీన్ని మీ గది గోడపై ‘పిన్’ చేయవచ్చు. అలాగే ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఫైళ్లు ఉన్న ఫోల్డర్‌ను బీరువా ముందుభాగంలో... ఫొటోలు, ఆడియోఫైళ్లను కాఫీటేబుల్పై.. అలా అన్నమాట. ఈ పనులన్నీ చక్కబెట్టేందుకు హెచ్‌పీయూలో ప్రత్యేకమైన సెన్సర్లు, హైడెఫినిషన్ లెన్స్‌లు ఉంటాయి. అయితే ఏంటి? ఎన్ని హైటెక్ హంగులున్నా ఇది కూడా ఓ పీసీనే కదా? నాకు కలిగే అదనపు ప్రయోజనమేమిటి అనుకుంటున్నారా? చాలానే ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ మాటల్లో చెప్పాలంటే... ‘‘మీరు ప్రపంచాన్ని చూసే దృష్టి మారినప్పుడు ప్రపంచమూ మారిపోతుంది’’ అని. హాలోలెన్స్ టెక్నాలజీతో మీరు పీసీని కీబోర్డు, మౌస్‌లతో వాడరు. నేరుగా మీ చేతులనే ఉపయోగించుకుంటూ ఫైళ్లను నియంత్రిస్తూంటారు. ఒక దగ్గర స్థిరంగా కూర్చోవాల్సిన పని అంతకంటే లేదు. ఎంచక్కా అటు ఇటూ నడుస్తూనే పీసీతో చేసే అన్ని పనులు చేసుకోవచ్చు. 2డీలో ఉన్న ఫైళ్లను త్రీడీలో చూసుకోగలగడం, అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోగలగడం దీంట్లోని మరో ప్రత్యేకత. ఒకవైపు మీ ఫైళ్లు చూస్తూనే... ఇతర వస్తువులను కూడా మామూలుగా చూడగలిగేలా హాలోలెన్స్ వస్తువులన్నీ పారదర్శకంగా ఉంటాయి. గూగుల్ గ్లాస్‌తోపాటు అకలస్ రిఫ్ట్ వంటి వర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్సెట్లు కొన్ని ఇప్పటికే మార్కెట్లో ఉన్నప్పటికీ వాటికంటే మైక్రోసాఫ్ట్ హాలోలెన్స్ భిన్నమైందని నిపుణుల అంచనా. వీఆర్ సెట్స్ గేమింగ్ ఏరియాను పరిమితం చేస్తే హాలోలెన్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తుంది. మైక్రోసాఫ్ట్ ఇతర ఉత్పత్తులు ఎక్స్‌బాక్స్, కైనిక్ట్లతో కలిసి పనిచేయగల సామర్థ్యం ఉంటే హాలోలెన్స్ కంప్యూటర్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లేనని అంటున్నారు. చూద్దాం... ఏమవుతుందో? -
టీవీక్షణం: వెండితెర వయా బుల్లితెర!
టీవీ ఆర్టిస్టులు సినిమాల్లో సక్సెస్ కావడం కష్టం... చాలా తేలికగా అనేస్తారీ మాటని. కానీ అలా అనేముందు గుర్తు తెచ్చుకోవాల్సిన వాళ్లు కొందరున్నారు. వారు తమ కెరీర్‌కి పునాదిని బుల్లితెర మీదే వేసుకున్నారు. అక్కడ పని చేస్తూనే వెండితెర మీద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆటుపోట్లకు తట్టుకుని నిలబడ్డారు. ఈరోజు స్టార్‌సగా వెలుగొందుతున్నారు. షారుఖ్ ఖాన్... బాలీవుడ్ బాద్షా అని పిలుచుకునే ఈ సూపర్‌స్టార్ తన తొలి అడుగు టెలివిజన్ రంగుంలోనే వేశాడు. ఫౌజీ, దిల్ దరియా వంటి సీరియల్స్‌లో నటించాడు. ‘సర్కస్’ సీరియల్ అతడిని అందరి దృష్టిలో పడేలా చేసింది. సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కట్‌చేస్తే... బాలీవుడ్లో తిరుగులేని నటుడయ్యారు షారుఖ్. జాతీయ అవార్డునందుకున్న నటి విద్యాబాలన్ కూడా టీవీలోనే ఓనమాలు దిద్దుకుంది. ‘హమ్ పాంచ్’ సీరియల్లో నటించిన విద్య ప్రతిభ ఆమెను సినిమాల్లోకి లాక్కెళ్లింది. తొలి సినిమా ‘పరిణీత’ సూపర్ హిట్. ‘లగేరహో మున్నాభాయ్’ డూపర్ హిట్. ‘డర్టీ పిక్చర్’ బంపర్ హిట్. ‘కహానీ’ సెన్సేషనల్ హిట్. ఆమె కోసం ఇప్పుడు ప్రత్యేకంగా కథలు రాస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు... ఆమె రేంజ్ ఏమిటో! హిందీ సీరియల్స్ నుంచి సినిమాల దాకా ప్రయాణించిన మరో నటి హన్సిక. చిన్నతనంలో ‘షకలక బూమ్‌బూమ్’ అనే కార్యక్రమంలో తొలిసారి తెరమీద మెరిసిన హన్సిక, ఆ తర్వాత ‘దేశ్‌మే నిక్లా హోగా చాంద్’ సీరియల్లో నటించింది. మరి ఇప్పుడు ఆమె ఏ స్థాయి నటి అయ్యిందో చూస్తున్నాం కదా! ఇప్పుడిప్పుడే హీరోయిన్గా ఎదుగుతున్న ప్రాచీ దేశాయ్ కూడా టీవీ నటే. సినిమాలను వద్దనుకుని, క్రికెట్ కామెంటేటర్‌గా సెన్సేషన్ సృష్టించిన మందిరాబేడీ కూడా సీరియల్ నటే. ఇక మన ప్రకాశ్‌రాజ్. ఆయన తెలుగువారు కాదు. అయినా ఆ విషయాన్ని మనం నమ్మం. అంతగా టాలీవుడ్లో పాతుకుపోయారు. ఆయన కూడా మొదట్లో సీరియల్ నటుడే. ‘గుప్పెడు మనసు’ సీరియల్ గుర్తుంది కదా! బాలచందర్ దర్శకత్వం వహించి, గీత లీడ్ రోల్ చేసిన ఈ సీరియల్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అందులో ప్రకాశ్‌రాజ్‌ను చూసి చాలామంది అమ్మాయిలు అలాంటి భర్త కావాలని కోరుకున్నారు. అతడే ఆ తర్వాత విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో ప్రత్యక్షమవుతాడని, తిరుగులేని నటుడవుతారని ఎవరూ ఊహించలేదు. ఇక స్వాతి గురించి చెప్పాల్సిన పని లేదు. ‘కలర్స్’ ప్రోగాములో ఆమె యాంకరింగుకు అందరూ ఫిదా అయిపోయారు. యువకులు అయితే ఆమె కోసమే ఆ కార్యక్రమాన్ని చూశారు. ఇప్పుడామె సినిమాల్లో బిజీ అయిపోయింది. వీళ్లే కాదు. టెలివిజన్ తెర మీద మెరిసి, ఆ తర్వాత వెండితెరపై వెలిగిన నటీనటులు ఎందరో ఉన్నారు. మహా సముద్రం లాంటి సినీ పరిశ్రమ వైపు నడిపించే నావ టెలివిజన్. అందుకే నటనను లక్ష్యంగా ఎంచుకున్నవారి ప్రయాణం ఆ నావలోనే మొదలవు తోంది. కచ్చితంగా ఏదో ఒక తీరానికి చేరుస్తుందని, మధ్యలో మాత్రం ముంచేయదని దాని మీద అందరికీ అంత నమ్మకం మరి!