‘‘కొన్ని దశాబ్దాల కిందటి సంచలన నవల ‘అంపశయ్య’కు తెరరూపమిచ్చే ప్రక్రియ దాదాపుగా పూర్తి కావచ్చింది’’ అని దర్శకులు ప్రభాకర్ జైని చెప్పారు. ‘అమ్మా నీకు వందనం’, ‘ప్రణయ వీధుల్లో’ చిత్రాల తర్వాత ఆయన చేస్తున్న చిత్రం ‘అంపశయ్య’. జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిత్రవిశేషాలను ప్రభాకర్ జైని చెబుతూ - ‘‘నా గత రెండు చిత్రాలూ పలు పురస్కారాలు దక్కించుకున్నాయి.
ఆ చిత్రాలతో పోలిస్తే మరింత వ్యయ ప్రయాసలతో ‘అంపశయ్య’ను రూపొందిస్తున్నాను. ఇది బహు భాషా చిత్రం. జాతీయ అవార్డుని లక్ష్యంగా చేసుకుని ఈ చిత్రం చేస్తున్నా. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నవీన్‌కు ఇంటిపేరుగా మారిపోయిన అంపశయ్య ఒక యువకుని మనసులో చెలరేగే రకరకాల కల్లోలాలకు ప్రతిరూపం. కథానుగుణంగా 1970నాటి పరిస్థితులను అత్యంత సహజంగా చూపిస్తున్నాం.
ఈ పీరియడ్ ఫిలింలో హీరోగా శ్యాంకుమార్, హీరోయిన్‌గా తెలుగమ్మాయి పావని బాగా నటించారు. నర్సాపూర్ అడవులు, వరంగల్ రామప్ప టెంపుల్, ఉస్మానియా యూనివర్సిటీ... తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం’’ అని చెప్పారు.
వెండితెరకు అంపశయ్య
Published Mon, Dec 7 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM
Advertisement
Advertisement