Ampasayya
-
క్యాంపస్‌లో ఏం జరిగింది?
తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధ నవలల్లో ఒకటి ‘అంపశయ్య’. ఆ నవల పేరే రచయిత నవీన్ ఇంటి పేరైంది. ప్రస్తుతం ఈ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘క్యాంపస్... అంపశయ్య’. ప్రభాకర్ జైని దర్శకత్వంలో విజయలక్ష్మి జైని ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్యామ్ కుమార్, పావని హీరో హీరో యిన్లు. దర్శకుడు మాట్లాడుతూ, ‘‘ ‘అంపశయ్య’ నవలను తెరకెక్కించేందుకు మూడేళ్లు శ్రమించా. మారుమూల గ్రామం నుంచి ఓ యువకుడు చదువుకునేందుకు ఉస్మానియా యూనివర్శిటీకి వస్తాడు. అతని జీవితంలో ఒకరోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఎదురయ్యే సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ఉస్మానియా క్యాంపస్‌లో షూటింగ్ జరుపుకొన్న మొదటి చిత్రమిది. 1970 నాటి కాలాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాం. చిత్రీకరణ పూర్తయింది. జూన్‌లో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. కెమేరా: రవికుమార్ నీర్ల, సంగీతం: సందీప్. -
‘అంపశయ్య’ కథతో...
ఓ యువకుడు ఉదయం నుంచి రాత్రి వరకూ ఎదుర్కొన్న సంఘటనల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘అంపశయ్య’. ప్రముఖ రచయిత నవీన్ రచించిన ‘అంపశయ్య’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్యామ్‌కుమార్, పావని జంటగా జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రభాకర్ జైని దర్శకుడు. ‘‘1960, 70 ప్రాంతాల్లో సాగే చిత్రం ఇది. నిర్మాణానంతర కార్యక్రమాలు త్వరలో పూర్తవుతాయి’’ అని దర్శక-నిర్మాతలు తెలిపారు. -
వెండితెరకు అంపశయ్య
‘‘కొన్ని దశాబ్దాల కిందటి సంచలన నవల ‘అంపశయ్య’కు తెరరూపమిచ్చే ప్రక్రియ దాదాపుగా పూర్తి కావచ్చింది’’ అని దర్శకులు ప్రభాకర్ జైని చెప్పారు. ‘అమ్మా నీకు వందనం’, ‘ప్రణయ వీధుల్లో’ చిత్రాల తర్వాత ఆయన చేస్తున్న చిత్రం ‘అంపశయ్య’. జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిత్రవిశేషాలను ప్రభాకర్ జైని చెబుతూ - ‘‘నా గత రెండు చిత్రాలూ పలు పురస్కారాలు దక్కించుకున్నాయి. ఆ చిత్రాలతో పోలిస్తే మరింత వ్యయ ప్రయాసలతో ‘అంపశయ్య’ను రూపొందిస్తున్నాను. ఇది బహు భాషా చిత్రం. జాతీయ అవార్డుని లక్ష్యంగా చేసుకుని ఈ చిత్రం చేస్తున్నా. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నవీన్‌కు ఇంటిపేరుగా మారిపోయిన అంపశయ్య ఒక యువకుని మనసులో చెలరేగే రకరకాల కల్లోలాలకు ప్రతిరూపం. కథానుగుణంగా 1970నాటి పరిస్థితులను అత్యంత సహజంగా చూపిస్తున్నాం. ఈ పీరియడ్ ఫిలింలో హీరోగా శ్యాంకుమార్, హీరోయిన్గా తెలుగమ్మాయి పావని బాగా నటించారు. నర్సాపూర్ అడవులు, వరంగల్ రామప్ప టెంపుల్, ఉస్మానియా యూనివర్సిటీ... తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం’’ అని చెప్పారు.