క్యాంపస్‌లో ఏం జరిగింది? | Ampasayya Romantic Telugu Movie | Sakshi
Sakshi News home page

క్యాంపస్‌లో ఏం జరిగింది?

Published Tue, May 17 2016 11:09 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

క్యాంపస్‌లో ఏం జరిగింది?

క్యాంపస్‌లో ఏం జరిగింది?

తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధ నవలల్లో ఒకటి ‘అంపశయ్య’. ఆ నవల పేరే రచయిత నవీన్ ఇంటి పేరైంది. ప్రస్తుతం ఈ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘క్యాంపస్... అంపశయ్య’. ప్రభాకర్ జైని దర్శకత్వంలో విజయలక్ష్మి జైని ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్యామ్ కుమార్, పావని హీరో హీరో యిన్లు. దర్శకుడు మాట్లాడుతూ, ‘‘ ‘అంపశయ్య’ నవలను తెరకెక్కించేందుకు మూడేళ్లు శ్రమించా.

మారుమూల గ్రామం నుంచి ఓ యువకుడు చదువుకునేందుకు ఉస్మానియా యూనివర్శిటీకి వస్తాడు. అతని జీవితంలో ఒకరోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఎదురయ్యే సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ఉస్మానియా క్యాంపస్‌లో షూటింగ్ జరుపుకొన్న మొదటి చిత్రమిది. 1970 నాటి కాలాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాం. చిత్రీకరణ పూర్తయింది. జూన్‌లో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. కెమేరా: రవికుమార్ నీర్ల, సంగీతం: సందీప్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement