రచయిత–దర్శకుడు డా. ప్రభాకర్ జైనీ
రచయిత–దర్శకుడు డా. ప్రభాకర్ జైనీ ‘తెలంగాణా సినీ స్వర్ణ కమలం’ అవార్డు అందుకున్నారు. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి గానూ, ముఖ్యంగా ‘అంప శయ్య’ వంటి సంచలనాత్మక సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించినందుకు ఈ అవార్డు ప్రదానం చేశారు. హైదరాబాదులో బీజేపీ సినిమా సెల్ ఆధ్వర్యంలో ప్రముఖ నటుడు సీవీయల్ నర్సింహారావు అధ్యక్షతన ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు, ఎమ్మెల్యే జి. కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ యన్. రామచంద్రరావు అతిథులుగా పాల్గొన్నారు. రెండు సార్లు ‘భరతముని సినీ ఆర్ట్స్ అకాడమీ’ అవార్డులు, నంది అవార్డు పొందిన ప్రభాకర్ జైనీని ‘తెలంగాణా సినీ స్వర్ణ కమలం’ అవార్డుతో సత్కరించడం సముచితంగా ఉందని వక్తలు పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లుగా ‘సింహ’ అవార్డులు ప్రకటించకపోవడంతో కళాకారులు నిరాశలో ఉన్నారని, అందుకే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికే ఈ అవార్డులు ఇచ్చామన్నారు. నెలరోజుల్లోనే ‘కాకతీయ’ ఫిల్మ్ అవార్డులు ప్రకటిస్తామన్నారు. గాయని మధుప్రియ, టీవీ, సినీ నటుడు అశోక్ కుమార్, సినీ క్రిటిక్ హెచ్. రమేశ్ బాబు, కాంతారావు కుమారుడు టీయల్ రాజా, నటి ఆయేషా జలీల్, డెక్కన్ సినిమా ఆర్కే మామా మొదలైన వారికి కూడా అవార్డులు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment