ఎక్స్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గానికి చెందిన ప్రజలూ సంతృప్తికరంగా లేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు, వ్యాపారులు ఎవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సంతృప్తికరంగా లేరన్నమాట వాస్తవం. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ లేదు.
యువతకు ఇస్తామన్న రూ.4వేల నిరుద్యోగ భృతి లేదు, ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలు లేదు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల ఇస్తామన్న రూ.2,500 ఆర్థిక సహాయం రాలేదు. రైతులకు చేస్తామన్న రుణమాఫీ పూర్తి చేయరు, రైతు భరోసా కూడా అరకొరే. ఆటో డ్రైవర్లు మొదలుకొని గీత కార్మికుల వరకూ కార్మికులకు ఇస్తామన్న భరోసా దొరకదు. దళితులకు ఇస్తామన్న రూ.12 లక్షలు మరిచిపోయారు. బెదిరింపులతో వ్యాపారాలకు అనువైన వాతావరణాన్ని దెబ్బ తీశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలకు అంతేలేదు. సామాన్య ప్రజలు మొదలుకొని తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనలో అసంతృప్తితో ఉన్నారు..’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment