తెర పై నేను ఎలా ఉంటాను?
‘వారెవ్వా ఏమి ఫేసు? అచ్చు హీరోలా ఉంది బాసూ...
వచ్చింది సినిమా ఛాన్సు...’ అంటూ పొగడ్తలతో ముంచెత్తే వాళ్లుంటారు.. ‘నువ్వా...సినిమాల్లోనా? ఫేసెప్పుడైనా అద్దంలో చూసుకున్నావా?’ అంటూ తీసిపారేసేవాళ్లూ ఉంటారు. దీంతో అసలు తాను సినిమాలకి నప్పుతానా? హీరో/
హీరోరుున్‌గా బాగుంటానా?
కమెడియన్‌గా సూట్ అవుతానా? క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఓకే అనిపిస్తానా? ఇలాంటి సందేహాలు ఎప్పటికీ తీరవు. మరి వాటిని తీర్చుకోవాలంటే... స్క్రీన్ టెస్ట్ చేయాలి. ఏ డెరైక్టరో మనల్ని చూసి పిలిచి మరీ ఆ టెస్ట్ చేయాలి. అది జరగడం అంత ఈజీ కాదు. మరెలా? సిటీలోని కొన్ని ఫొటో స్టూడియోల దగ్గర దీనికి సమాధానం ఉంది. - చైతన్య వంపుగాని
సినిమాల్లో నటించాలనే కోరిక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిలో ఉంటుంది. అరుుతే స్క్రీన్‌పై తన ముఖం, మొత్తంగా లుక్ ఎలా ఉంటుంది? ఎలాంటి మేకప్ అవసరమవుతుంది? ఇలాంటి సందేహాలతో సతమతమవుతుంటారు. ఇలాంటి వారికి స్పష్టత ఇచ్చేందుకు సిటీలోని ఫొటో స్టూడియోలు వివిధ రకాల సేవలందిస్తున్నారుు.
రేపటి తారల కోసం...
సినిమాల్లో నటించాలనే కోరిక ఉంటే తొలి అడుగు పోర్ట్‌ఫోలియో. దీనిని రూపొందించే ముందు మనిషి ఎత్తు, రంగు, ఫిజిక్ చూస్తారు. తర్వాత విభిన్న రకాల కాస్ట్యూమ్స్‌లో ఫొటోషూట్ చేస్తారు. ఈ షూట్‌లో ఫొటోగ్రాఫర్, మేకప్ ఆర్టిస్ట్, స్టైలిస్ట్‌లుంటారు. ఈ సందర్భంలోనే ఏ డ్రెస్‌లో ఎలా ఉన్నారు? ఏ యాంగిల్‌లో లుక్ బాగాలేదు? బాగా ఉంది? ఏ పార్ట్‌ను ఎలా హైలెట్ చేసుకోవాలి?
బాగాలేదనిపిస్తున్న పార్ట్‌ని ఎలా దాచిపెట్టాలి? తదితర అంశాలపై సదరు వ్యక్తికి తర్ఫీదు ఇస్తారు. అనంతరం విభిన్న రకాల గెటప్స్‌తో రూపుదిద్దుకున్న పోర్ట్ ఫోలియోను దగ్గర ఉంచుకొని సినిమా ప్రయత్నాలు పూర్తి స్థారుులో మొదలుపెట్టేందుకు వీలవుతుంది. అందుకనే సినిమా రంగానికి వెళ్లాలనుకునేవారు వేయాల్సిన తొలి అడుగుకు తోడయ్యే ఫొటో స్టూడియోలకు సిటీలో ఇప్పుడు మంచి డిమాండ్.
మా దగ్గర సినీ కలలు సాకారం..
‘హీరో శర్వానంద్, ప్రముఖ యాంకర్ సుమలు ఏ మేకప్‌లో ఉంటే ప్రేక్షకులను ఆకట్టుకుంటారో దానికి అనుగుణంగా వారికి మేకప్ పరమైన అభ్యాసం చేరుుంచాను’ అంటూ గుర్తు చేసుకున్నారు నారాయణగూడలోని భట్ స్టూడియో యజమాని నటరాజ్ భట్. ఇప్పుడాయన తన స్టూడియో ద్వారా తారలై తెర మీద వెలగాలనుకునే వారికి పలు మార్గాల్లో సేవలందిస్తున్నారు. ఇటీవలే సుమ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ ఫొటో స్టూడియోలో మేకప్ కోర్సును కూడా నేర్పిస్తుండడం విశేషం. ఇందులో టీవీ, సినిమా, స్టేట్ ఆర్టిస్ట్, బ్రైడల్ మేకప్ కోర్సులను నేర్పిస్తారు. నటి అర్చన, బాబా సెహగల్‌తో పాటు మరికొంత మంది బాలీవుడ్ స్టార్స్ ఫీల్డ్‌లోకి రాకముందు తన దగ్గర మేకప్, స్క్రీన్ ప్రెజెంటేషన్ చేరుుంచుకున్నవారేనని చెప్పారు నటరాజ్.