photo studio
-
బాలికల హాస్టల్లో కీచకపర్వం
ఏలూరు టౌన్: పేద బాలికల కోసం ఏర్పాటు చేసిన సేవాశ్రమంలో ఓ కామాంధుడు కొంతకాలంగా చెలరేగిపోతున్నాడు. వార్డెన్ భర్తగా ఎంటరైన సుమారు 55 ఏళ్ల వయసున్న ఆ కీచకుడు బాలికలను చెరబట్టడమే పనిగా పెట్టుకున్నాడు. తన కోరికను కాదంటే బాలికలను దారుణంగా కొడతాడు. చాలా కాలంగా అతని దుర్మార్గాలను తట్టుకున్న ఆ బాలికలకు ఓపిక నశించింది. సేవాశ్రమంలోని వారంతా మంగళవారం సాయంత్రం ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ అధికారులను వేడుకున్నారు. ఆ కామాంధుడి లీలలు వెలుగులోకి రావడంతో ఏలూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ ఘోరకలికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఏలూరు అమీనాపేటలో శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం ఆధ్వర్యంలో బాలికల వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్‌ను నిర్వహకులు సేవాభావంతో ఏర్పాటు చేయగా.. గత కొంతకాలంగా హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్న మణిశ్రీ భర్త శశికుమార్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ అత్యంత దారుణంగా వేధిస్తున్నాడు. శశికుమార్ ఏలూరు ఎన్ఆర్పేటలో మణి ఫొటో స్టూడియో నడుపుతూ, మరోవైపు ఏలూరు జిల్లా యర్రగుంటపల్లి బీసీ హాస్టల్లో కూడా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉన్న తన పలుకుబడితో కొంతకాలం క్రితం తన రెండో భార్య మణిశ్రీని సేవాశ్రమంలో వార్డెన్‌గా చేర్చాడని సమాచారం. బాలికలపై లైంగిక దాడులుఆ బాలికల సేవాశ్రమంలో పేద వర్గాలకు చెందిన విద్యార్థినులు వసతి సదుపాయం పొందుతున్నారు. వీరు స్థానికంగా పలు పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. కామాంధుడైన శశికుమార్ ఆ బాలికలపై కన్నేసి సేవాశ్రమంలోకి వార్డెన్ భర్తగా ఎంటరయ్యాడు. పదుల సంఖ్యలో బాలికలను లైంగికంగా వేధించినట్టు బాధిత బాలికలు చెబుతున్నారు. ఆదివారం ఒక బాలికను బాపట్లకు ఫొటో షూట్ కోసమని తీసుకువెళ్లిన శశికుమార్.. సోమవారం రాత్రి తిరిగి తీసుకువచ్చాడు. రాత్రివేళ ఆ బాలిక తన దుస్తులను ఉతుక్కుంటూ ఏడుస్తూ ఉండగా సహచర బాలికలు ప్రశ్నించారు. జరిగిన దారుణాన్ని ఆమె చెప్పింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన శశికుమార్ జరిగిందంతా ఆ బాలిక సహచరులకు చెప్పిందనే అక్కసుతో అక్కడ ఉన్న బాలికలను అందరినీ మోకాళ్లపై కూర్చోబెట్టి దారుణంగా కొట్టాడు. రాత్రి బాలికల ఏడుపులు వినిపించాయని స్థానికులు కూడా చెప్పారు. శశికుమార్ దారుణాలను ఇక భరిస్తూ ఉండకూడదనే ఉద్దేశంతో బాలికలు మంగళవారం ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. బాధిత బాలికల బంధువులు, తల్లిదండ్రులు కూడా పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాలికలను భయపెట్టి నీరుగార్చే ప్రయత్నంసేవాశ్రమంలో జరిగిన దారుణాలపై పూర్తిస్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తారా... అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేసే ముందే బాలికలు మీడియాకు జరిగినదంతా వివరించారు. అయినా పోలీసులు మాత్రం బాలికలను భయపెట్టి ఈ దారుణ సంఘటనను నీరుగార్చే ప్రయత్నం చేసు్తన్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.వార్డెన్ మణిశ్రీకి ఏలూరులోని ఓ ప్రజాప్రతినిధి వత్తాçÜు పలికినట్లు, అలాగే స్థానిక ఎంపీ కార్యాలయానికి చెందిన వ్యక్తులు సైతం రంగంలోకి దిగి పోలీస్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఫిర్యాదులో కేవలం వేధింపులకు గురిచేసినట్టుగానే బాలికలతో పోలీసులు రాయించినట్లు తెలుస్తోంది. ఏలూరు డీఎస్పీ దర్యాప్తుఏలూరు అమీనాపేటలోని బాలికల వసతి గృహంలో జరిగిన ఘటనపై ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ వెంటనే స్పందించారు. సేవాశ్రమం వద్దకు చేరుకుని ఆరా తీశారు. ఏలూరు మహిళా స్టేషన్ సీఐ ఎం. సుబ్బారావు, ఏలూరు టూటౌన్ సీఐ వైవీ రమణ, బాలల సంరక్షణ అధికారి సూర్యచక్రవేణి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏలూరు డీఎస్పీ మాట్లాడుతూ.. ముగ్గురు బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామని తెలిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, నిందితులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. బాలికలపై లైంగిక దాడి జరిగినట్టు ఫిర్యాదు చేశారని, వీటిపై విచారణ చేస్తామని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు.ఫొటో షూట్లంటూ.. ఫొటో షూట్ల కోసమని శశికుమార్ ఒక్కొక్క బాలికను దూరప్రాంతాలకు తీసుకువెళతాడనీ, అక్కడ కాళ్లూచేతులూ కట్టేసి అఘాయిత్యానికి పాల్పడతాడని, కాదంటే ఇష్టారాజ్యంగా కొడతాడని బాధిత బాలికలు కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు. మీకు బాయ్‌ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి వాళ్ల దగ్గరకు మిమ్మల్ని పంపుతాను, రూమ్‌లు ఏర్పాటు చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తాడని చెప్పుకొచ్చారు. బయటకు తీసుకెళ్లి టీ, కాఫీ ఇప్పించి సగం తాగిన అనంతరం కప్పు తీసుకుని తాగుతూ వక్రంగా మాట్లాడుతూ పైశాచికత్వాన్ని చూపిస్తాడని వివరించారు. ఇక స్థానికంగా ఇతర ప్రభుత్వ హాస్టళ్లకు వచ్చే బాలికలను ఈ సేవాశ్రమానికి పంపాలంటూ శశికుమార్ ఆయా హాస్టళ్ల వార్డెన్లను కోరతాడని, అతని కోరిక మేరకు ఆ హాస్టళ్ల వార్డెన్లు బాలికలను ఇక్కడకు పంపుతారని తెలిసింది. -
ఫోటోలు కడిగించాలంటే స్టూడియోకి వెళ్లే పనిలేదు..చేతిలో ఈ గాడ్జెట్ ఉంటే చాలు
స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ఫొటోగ్రఫీ తేలికైంది. అయితే, స్మార్ట్‌ఫోన్‌లో ముచ్చటగా తీసుకున్న ఫొటోలను ముద్రించుకోవాలంటే మాత్రం స్టూడియోలు, కలర్ ల్యాబ్‌లకు వెళ్లాల్సిందే! అంత శ్రమ లేకుండా సత్వరమే ఫొటోలు ముద్రించగల ఫొటో ప్రింటర్‌ను కంప్యూటర్ల తయారీ సంస్థ హ్యూలెట్ పాకార్డ్ ‘హెచ్‌పీ’ అందుబాటులోకి తెచ్చింది. ఇది స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. ‘హెచ్‌పీ స్ప్రాకెట్ స్టూడియో ప్లస్’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఫొటో ప్రింటర్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్ల ద్వారా తేలికగా ఉపయోగించవచ్చు. వాటిలో డౌన్లోడ్ చేసుకున్న యాప్ ద్వారా క్షణాల్లోనే కోరుకున్న ఫొటోలను ముద్రించుకోవచ్చు. ఇందులో 6 “ 4 అంగుళాల సైజులో మాత్రమే ఫొటోలను ముద్రించుకునే అవకాశం ఉంది. దీని ధర 149.99 డాలర్లు (రూ.12,374) మాత్రమే! -
Ketaki Sheth: ఫొటోస్టూడియో ఆటోబయోగ్రఫీ
ఒకసారి కళ్లు మూసుకొని స్మార్ట్‌ఫోన్ కెమెరాలు లేని ఫొటోస్టూడియోల కాలంలోకి వెళ్లండి. దీపావళి పండగరోజు అక్కయ్య, అన్నయ్యలతో కలిసి దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో గుర్తుందా? ‘రెడీ... అనగానే అలా కళ్లు మూయవద్దు తల్లీ’ అని సుతిమెత్తగా మందలించిన మీ ఊరిలోని ఫొటోగ్రాఫర్ గుర్తున్నాడా? ఫిల్టర్లు, మొబైల్ ఫోన్ అప్లికేషన్లు లేని ఆ కాలంలో స్టూడియోలలోని అద్భుతమైన బ్యాక్‌డ్రాప్ పెయింటింగ్స్ గుర్తుకొస్తున్నాయా? కేతకి సేథ్ తన ‘ఫొటోస్టూడియో’ ప్రాజెక్ట్‌తో ఆ కాలంలోకి తీసుకువెళుతుంది. పదండి ఒకసారి... సెల్‌ఫోన్ కెమెరాలు వచ్చిన తరువాత ‘ఫొటో స్టూడియో’లు తగ్గిపోయాయి. ఉన్నవి ఆనాటి వెలుగును కోల్పోయాయి. ఎన్నో కుటుంబాలతో అనుబంధాలు పెనవేసుకున్న అలనాటి ఫొటోస్టూడియోల గత వైభవాన్ని ‘ఫొటోస్టూడియో’ ప్రాజెక్ట్‌తో మన కళ్ల ముందుకు తీసుకువస్తుంది ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ కేతకి సేథ్. 2014లో నార్త్ ముంబైలోని ‘జగదీష్ ఫొటోస్టూడియో’లోకి కేతకి అడుగుపెట్టినప్పుడు అది ఫొటో స్టూడియోలా లేదు. గతకాల వైభవంలోకి వెళ్లినట్లుగా అనిపించింది. ఇక అది మొదలు 2018 వరకు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న 67 పాత ఫొటోస్టూడియోలను సందర్శించింది. ఆ జ్ఞాపకాలను రికార్డ్ చేసింది. దిల్లీలోని ‘ఫొటోఇంక్’ గ్యాలరీలో తొలిసారిగా ‘ఫొటోస్టూడియో’ పేరుతో ఫొటోఎగ్జిబిషన్ నిర్వహించింది. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. కేతకి ప్రాజెక్ట్‌పై ‘ఫొటోస్టూడియో’ పేరుతో నాణ్యమైన పుస్తకం కూడా వచ్చింది. తాజాగా... పాతతరానికి సంబంధించిన కొత్త ఫొటోలతో ముంబైలో చెమౌల్డ్ ప్రిస్కాట్ రోడ్లో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది కేతకి. ఈ ఫొటోలలో వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఫొటోస్టూడియోలు ఉండడం విశేషం. అప్పట్లో ఇమేజ్–క్రేజ్ బాగా ఉండేది. స్క్రీన్‌కి అవతలి ప్రపంచాన్ని ఊహించేవారు కాదు. అందమైన ప్రకృతి దృశ్యాల నుంచి అభిమాన తారల వరకు ఎన్నో బ్యాక్‌డ్రాప్ పెయింటింగ్స్ స్టూడియోలలో కనిపించేవి. ఆ దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు ఈ ఎగ్జిబిషన్లో కనిపించి కనువిందు చేస్తాయి. కేతకి తన ప్రయాణంలో నాటి ఫొటోగ్రాఫర్లతో మాత్రమే కాదు, ఫొటోస్టూడియోలలో బ్యాక్‌గ్రౌండ్ పెయింటింగ్స్ గీసే ఆర్టిస్ట్‌లతో కూడా మాట్లాడింది. అలనాటి ఫొటోస్టూడియో యజమానులతో మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడుతున్నట్లుగా అనిపించలేదు. ఫొటోస్టూడియోలు తమ ఆటోబయోగ్రఫీని చెప్పుకుంటున్నట్లుగా ఉంది! ‘గతంలో ఎన్నో ఫొటో ఎగ్జిబిషన్లకు వెళ్లాను. కాని వాటన్నిటికంటే ఈ ఎగ్జిబిషన్ నాకు బాగా దగ్గరైంది. నా కాలంలోకి, సొంత ఇంట్లోకి అడుగుపెట్టినట్లుగా ఉంది. ఒక్కో ఫొటో చూస్తూ వెళుతున్నప్పుడు ఎన్నో జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి. గ్యాలరీ నుంచి బయటికి వచ్చినా ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రావడానికి మాత్రం చాలా సమయం పట్టింది’ అంటుంది ఫొటో ఎగ్జిబిషన్‌కు వెళ్లివచ్చిన అరవై అయిదు సంవత్సరాల పూర్ణ. ‘ఫొటోస్టూడియో’ ప్రాజెక్ట్ సూపర్‌హిట్ అయిందని చెప్పడానికి ఇంతకుమించి ఉదాహరణ ఏముంటుంది! -
మద్యం మత్తులో మిత్రుల వివాదం.. గాజుసీసా ముక్కతో..
కాకినాడ సిటీ: మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఓ చిన్న వివాదం ఒకరి దారుణ హత్యకు దారి తీసింది. పోలీసుల కథనం ప్రకారం.. పాలెపు కాసుబాబు (26), రవి కాసు, విఘ్నేష్, సతీష్‌లది కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామం. ఈ నలుగురూ ఫొటోగ్రఫీ కోర్సు చేశారు. కాకినాడ శాంతినగర్‌లోని మదర్ థెరిసా విగ్రహం సమీపాన ఆరు నెలల క్రితం ‘స్టోరీస్’ అనే పేరుతో స్టూడియో పెట్టారు. జగన్నాథపురం మహిళా కళాశాల సమీపాన రూము తీసుకొని నలుగురూ అద్దెకు ఉంటున్నారు. నలుగురూ కలిసి మద్యం తాగేందుకు విఘ్నేష్ స్థానిక ఎస్ఆర్ గ్రాండ్ హోటల్లో 306 నంబర్ రూమును బుధవారం రాత్రి బుక్ చేశాడు. అక్కడ కాసుబాబు, రవి కాసు, విఘ్నేష్, సతీష్‌తో పాటు రామకృష్ణ, బిర్లా అనే మరో ఇద్దరు కలిసి రాత్రి మద్యం తాగారు. మద్యం తాగుతున్న సమయంలో రవి కాసు చెంపపై కాసుబాబు సరదాగా కొట్టాడు. ఆ తరువాత సరదాగా కొట్టానని క్షమాపణ చెప్పాడు. అయితే కాసుబాబు తనను కొట్టిన విషయాన్ని రవి కాసు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా పోస్టు చేశాడు. విషయాన్ని అక్కడితో వదిలేసినట్లు నటించి, మద్యం తాగిన అనంతరం రామకృష్ణ, బిర్లాను తీసుకొని రాత్రి 12 గంటల సమయంలో రవి కాసు బయటకు వెళ్లిపోయాడు. కాసుబాబు, సతీష్ హోటల్ రూములోనే ఉండిపోయారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో రవి కాసు తిరిగి హోటల్ రూముకు వచ్చాడు. తనను కొట్టి అవమానించినట్టు భావించిన అతడు రూముకు వచ్చిన వెంటనే బీరు బాటిల్‌తో కాసుబాబు తలపై బలంగా కొట్టాడు. అనంతరం పగిలిన గాజుసీసా ముక్కతో కాసుబాబు కంఠంలో పొడిచాడు. చదవండి: (ఘోరాన్ని ముందే ఊహించి.. తల్లిదండ్రులు నన్ను చంపేస్తారంటూ..) ఈ హడావుడితో సతీష్ నిద్ర లేచాడు. అడ్డం వస్తే అతడిని కూడా చంపేస్తామని రవి కాసు బెదిరించాడు. దీంతో అతడు ప్రాణభయంతో పారిపోయాడు. రవి కాసు చేసిన దాడిలో కాసుబాబు అక్కడికక్కడే చనిపోయాడు. హత్య అనంతరం రవి కాసు పోలీసులకు లొంగిపోయినట్టు తెలుస్తోంది. హతుడు కాసుబాబు సోదరుడు ధనవర్మ ఫిర్యాదు మేరకు ఈ సంఘటనపై టూటౌన్ సీఐ రామచంద్రరావు పర్యవేక్షణలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాసుబాబు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉలిక్కిపడిన పల్లం కాట్రేనికోన: కాసుబాబు హత్యతో అతడి స్వస్థలం పల్లం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామానికి చెందిన పాలెపు ధర్మారావు దంపతులకు హతుడు కాసుబాబుతో పాటు కుమార్తె, మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్లు కావడంలో స్నేహితుడు కాసుబాబు, మల్లాడి రవి కలిసి కాకినాడలో స్టూడియో నిర్వహిస్తున్నారు. కాసుబాబు ప్రేమించిన అమ్మాయితో రవి వాట్సాప్ చాటింగ్ చేస్తుండటంతోనే వారి మధ్య వివాదం తలెత్తి, ఈ హత్యకు దారి తీసిందని పలువురు అంటున్నారు. కాసుబాబు మృతదేహాన్ని చూసేందుకు పల్లం రామాలయం సెంటర్‌కు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. -
ఇక్కడ అన్నీ మార్చబడును
‘‘నా ఫొటో తియ్యాలి’’ అన్నాడు వీరయ్య స్టూడియోలో అడుగు పెడుతూ. వీరయ్య తన ఫొటో తీయించుకోవాలని చాలా రోజుల నుండి ఉబలాటపడ్డాడు కాని ఎప్పుడూ వీలుపడలేదు. ఎంతో ఉత్సాహంగా వెళ్లాడు అవాళ ఆ సాయంత్రానికి కొట్టును గుమస్తాకు నమ్మి. ‘‘సరే’’ నన్నాడు జర్మనీకి వెళ్లి ప్రత్యేకంగా ఈ ఆర్టులో ప్రవీణుడై వచ్చిన ఫొటోగ్రాఫరు. కళ్లకు అద్దాలు, ఫుల్సూటు మీద ఉన్నాడు మనిషి. అతని ఫొటోగ్రఫీ సైన్సు అంతా సిగరెట్టు పొగలో ఉబ్బిన అరమోడ్పు కళ్లల్లో వ్యక్తమౌతోంది. ‘‘కూర్చోండి. ఇప్పుడే పిలుస్తాను మిమ్మల్ని’’ అని లోపలికి వెళ్లాడు. ‘‘మంచిది’’ అంటూ చిరునవ్వుతో బొజ్జ నిమురుకుంటూ సోఫాలో కూర్చున్నాడు వీరయ్య. అరగంట అయింది. అతను లోపలి తలుపులోని మఖమలు పరదాను కొద్దిగా తీసి ముఖం ఇవతలికి పెట్టి ‘‘రండి’’ అన్నాడు. వెళ్లాడు లోపలికి వీరయ్య. అంతా చీకటిగా ఉంది. కొద్దిగా వెలుతురు అద్దాల తలుపులోంచి వస్తోంది మనిషి కనబడే మాత్రం. ఒక మెత్తని కుర్చీ, దాని పక్క ఎత్తయిన స్టూలు మీద ఫ్లవర్వేస్, దాని నిండా అందమయిన రకరకాల కాగితాల పువ్వులు అమర్చి ఉన్నాయి. కింద కూడా అంతా పూలదుప్పటి పరచినట్టు ఉన్నది. లోపలికి వెళ్లాక కుర్చీమీద కూర్చోమన్నాడు వీరయ్యని. వీరయ్య కూర్చున్నాక ఫొటోగ్రాఫరు ఒకటి మెషీను పెట్టెలాంటిది మూడు కాళ్ల మీద నిలబెట్టి ఆ కాళ్లలో నుండి వెనక్కు దూరాడు. దాన్ని వెనక్కు ముందుకు నెట్టి సరిగా నిలబెట్టాడు. మళ్లీ ఒకమాటు దానిలో దూరి నల్లటిగుడ్డను కప్పుకున్నాడు. వీరయ్యకు ఇదంతా ఏమిటో గారడీ విద్యలాగా అనిపించింది. గారడీవాళ్లు మొదలు ఉత్తగిన్నె చూపించి దానిలోంచి మామిడి మొలకను చూపించినట్టు చూపిస్తాడు గామాలు తన ఫొటో అనుకున్నాడు. ఫొటోగ్రాఫరు ఇవతలికి వచ్చి ‘‘నీ ముఖమే సరిగాలేదు’’ అన్నాడు కనుబొమ్మలు ముడివేసి పెదిమలు చప్పరిస్తూ. ‘‘చిత్తం. అది నాక్కూడా తెలుసు. కాని ఎట్లాగయినా’’ వీరయ్య చేతులు నలుముకుంటూ ప్రాధేయపడ్డాడు. ఒక నిట్టూర్పు విడిచాడు ఫొటోగ్రాఫరు. ‘‘సరే. అయితే త్రీ క్వార్టర్స్ ఫుల్ (ముఖంలో మూడు వంతులు కనపడేటట్టు) ఉండేలాగా చేస్తాను’’ అని అతని దగ్గరికి వచ్చి, తన చేతుల్తో అతని ముఖాన్ని పట్టుకుని ఎడమవేపు తిప్పాడు. అట్లాగే ఉండాలేమో ననుకున్నాడు వీరయ్య. ఫొటోగ్రాఫరు మళ్లా ఎడమవేపు నుండి కుడివేపు తిప్పగలిగినంత వరకు తిప్పాడు ముఖాన్ని. ఆ మెషీను వంక ముఖం వంక పరీక్షగా చూచి ‘‘అబ్బే– అస్సలు కుదరటం లేదు. ఈ తల ఏమీ బాగాలేదు. ‘‘కొంచెం నోరు తెరవండి’’ తెరవబోతుంటే, ఆ... ఆ... చాలు. మూసుకోండి కొంచెం అని ‘డైరెక్టు’ చేశాడు. ‘‘ఏదీ కొంచెం ముఖం అట్లాగే ఉంచి ఒళ్లు తిప్పండి ఇటువేపు’’. ఏమిటిరా భగవంతుడా ఈ అవస్థ అంతా అనుకుంటూ ఎంతో ప్రయత్నం మీద కిందికి బరువును తిప్పగలిగాడు. ‘‘అయ్యయ్యో! పోస్చర్ అంతా చెడగొట్టేశారు!!’’ అని గోలపెట్టాడు ఫొటోగ్రాఫరు. మళ్లీ కాసేపటిదాకా ఇటు తిప్పి సరిగా పెట్టాడు ముఖాన్ని. ‘‘సరే. ఇటు చూడండి దీనివేపు. కొంచెం తల పైకెత్తండి. ఆ... ఆ... చాలు. చేతులు మోకాళ్ల మీద పెట్టుకోండి. తల వొంచకుండా నడుము ముడతలు పడకుండా సరిగా నిలబెట్టండి.’’ వీరయ్య షావుకారికి అరికాలిమంట నెత్తికెక్కింది. ఫొటో లేకుంటే పీడ పోయింది! ఈ వెధవ అవస్థంతా అనుకున్నాడు. కాని ఇహ ఇంత కష్టపడి ఒక్క నిమిషం ఓపిక పడితే మంచిదని అతను చెప్పినట్టల్లా అమలు పెట్టాడు. ‘‘ఆ, సరే, బాగుంది’’ అని మళ్లీ దగ్గరికొచ్చి సరిచేశాడు. ‘‘ఇహ కదలకండి’’. ధోవతి అంచు నుండి చూసి ఇవతలికి వచ్చి ‘‘అయిపోయింది. అయినా సంతృప్తికరంగా కుదరలేదు. మీ ముఖం అంత ప్రపోర్షనేటుగా లేదు’’ అన్నాడు. వీరయ్యకు కోపం వచ్చింది కూడా. ‘‘వచ్చినప్పటి నుండి ముఖం బాగాలేదు, ముక్కు బాగాలేదనటమే. మెడ నొప్పి పుట్టేటట్టు వంకరటింకరగా ఈ ఇష్టం వచ్చినట్టు తిప్పటమే గాని ఫొటో లేదు పాడు లేదు. మంచో చెడ్డో ఇక్కడికి నలభయి ఏళ్లు గడిచిపోయాయి. నా ముఖంతో తగాదా నీకే వచ్చింది. నీ ముఖం నీ మెషీనులో పట్టకపోతే’’ అంటూ లేచాడు. ఒక్క వెలుగు వెలిగింది. కళ్లు మిరుమిట్లు గొలిపేటట్లు ఫొటోగ్రాఫరు చిరునవ్వు నవ్వి, ‘‘మంచి పట్టులో తీశాను’’ అన్నాడు. ‘‘ఏమిటీ ఇట్లాగేనా?’’ అని నోరు తెరిచాడు సెట్టి. ‘‘ఏదీ చూడనియ్యి నన్ను.’’ ‘‘ఇప్పుడే ఎక్కడా? నెగెటివు చేశాక కాని రాదు. శుక్రవారం రండి’’ అన్నాడు. ∙∙ శుక్రవారం వెళ్లాడు వీరయ్య. లోపలికి పిలిచాడు ఫొటోగ్రాఫరు. చాలా సీరియస్‌గా కాగితం మడత విప్పి లోపలి ప్రూఫ్‌ను చూపెట్టాడు. ‘‘నేనేనా?’’ అన్నాడు షావుకారు. ‘‘అవును’’ అన్నాడు ఫొటోగ్రాఫరు సాలోచనగా. వీరయ్య పరీక్షగా చూస్తో ‘‘ఈ కళ్లు నావిలా లేవేం?’’ ‘‘అవా? నేను రీటచ్ చేశాను. బాగా రాలే?’’ ‘‘ఆహా? నా కనుబొమలు ఇట్లా లేవు.’’ ‘‘అవును లేవు. కళ్ల కనుగుణ్యంగా ఉండాలని కనుబొమ్మలను కూడా కాస్త మార్చాను. కళ్ల మీద అన్ని వెంట్రుకలంటే ఏం బాగుంటాయని? యూరపులో సన్న కనుబొమ్మలే ఫ్యాషను.’’ ‘‘అట్లాగా?’’ అన్నాడు వీరయ్య. ‘‘అందుకని– మా దగ్గర సైన్సులో సల్ఫైడు ద్వారా కొత్త కనుబొమలను వేసే విధానం ఉంది. దానితో ఆ వెంట్రుకలన్నీ ఊడదీసి ఎన్ని ఉంటే బాగుంటుందో అన్నే ఉంచాను’’ అన్నాడు ఫొటోగ్రాఫరు. ‘‘ఈ నోరేవిటి?’’ అన్నాడు వీరయ్య తననంతా మార్చేశాడన్న కోపంతో. ‘‘ఇది నాది కాదా?’’ ‘‘నీ నోరు మరీ కిందికి ఉందని కొంచెం ఎత్తు లేపాను.’’ ‘‘ఈ చెవులు మట్టుకు నావిలాగా ఉన్నాయి.’’ ‘‘అవును. కాని అది కూడా సరిచెయ్యాలి. సల్ఫైడు అని ఉంది. దానితో పూర్తిగా చెవులు తీసేయటానికి వీలుంది. చూసి చెప్తాను.’’ షావుకారుకి కళ్లనీళ్ల పర్యంతం అయింది. ఇహ ఆగలేకపోయాడు. ‘‘ఏడిశావు. నీ మొహం! నా ఫొటో తియ్యమని నీ దగ్గరకు వస్తే కండ్లు పీకేసి, కనుబొమ్మలు నరికేసి, పండ్లూడదీసి నా రూపమే లేకుండా చేశావు. నేను చస్తే నావాళ్ల దగ్గర నా ఫొటో ఉండాలనుకుంటే ఈ మారురూపు తీసికెళ్లి ఏం చేసుకోను! దీన్ని సల్ఫేడులోనో డల్ఫేడులోనో ముంచుకొని నీ స్నేహితులకు చూపెట్టుకో’’ అని స్టూడియోలోంచి వెళ్లిపోయాడు వీరయ్య. తెలంగాణ తొలితరం రచయిత్రి నందగిరి ఇందిరాదేవి కథ ‘వీరయ్య గారి ఫొటో’ పూర్తిపాఠం ఇది. తొలి ప్రచురణ: 1941. హన్మకొండలో పుట్టి హైదరాబాద్‌లో స్థిరపడిన ఇందిరాదేవి తెలంగాణ తొలితరం రచయిత్రి. ఆమె జీవితకాలం: 22 సెప్టెంబర్ 1919 – 22 జనవరి 2007. ఆమె కథల్ని గతేడాది తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురించింది. నందగిరి ఇందిరాదేవి -
బీసీ సంఘం నాయకుడి స్టూడియో ధ్వంసం
-
ఫొటో స్టూడియోలో చోరీ
ముదిగుబ్బ : ముదిగుబ్బలోని సిండికేట్ బ్యాంక్ ఎదుట గల మంజు అనే వ్యక్తికి చెందిన ఫొటో స్టూడియోలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. స్టూడియో తలుపులు పగులగొట్టిన దుండగులు లోనికి ప్రవేశించి రూ.60 వేలు విలువ చేసే పెద్ద కెమెరా సహా మరో చిన్న కెమెరా, హార్డ్ డిస్క్, రూ.3,500 నగదు ఎత్తుకెళ్లారు. వాటి విలువ మొత్తం రూ.80 వేలు ఉంటుంది. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. -
తెర పై నేను ఎలా ఉంటాను?
‘వారెవ్వా ఏమి ఫేసు? అచ్చు హీరోలా ఉంది బాసూ... వచ్చింది సినిమా ఛాన్సు...’ అంటూ పొగడ్తలతో ముంచెత్తే వాళ్లుంటారు.. ‘నువ్వా...సినిమాల్లోనా? ఫేసెప్పుడైనా అద్దంలో చూసుకున్నావా?’ అంటూ తీసిపారేసేవాళ్లూ ఉంటారు. దీంతో అసలు తాను సినిమాలకి నప్పుతానా? హీరో/ హీరోరుున్‌గా బాగుంటానా? కమెడియన్‌గా సూట్ అవుతానా? క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఓకే అనిపిస్తానా? ఇలాంటి సందేహాలు ఎప్పటికీ తీరవు. మరి వాటిని తీర్చుకోవాలంటే... స్క్రీన్ టెస్ట్ చేయాలి. ఏ డెరైక్టరో మనల్ని చూసి పిలిచి మరీ ఆ టెస్ట్ చేయాలి. అది జరగడం అంత ఈజీ కాదు. మరెలా? సిటీలోని కొన్ని ఫొటో స్టూడియోల దగ్గర దీనికి సమాధానం ఉంది. - చైతన్య వంపుగాని సినిమాల్లో నటించాలనే కోరిక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిలో ఉంటుంది. అరుుతే స్క్రీన్‌పై తన ముఖం, మొత్తంగా లుక్ ఎలా ఉంటుంది? ఎలాంటి మేకప్ అవసరమవుతుంది? ఇలాంటి సందేహాలతో సతమతమవుతుంటారు. ఇలాంటి వారికి స్పష్టత ఇచ్చేందుకు సిటీలోని ఫొటో స్టూడియోలు వివిధ రకాల సేవలందిస్తున్నారుు. రేపటి తారల కోసం... సినిమాల్లో నటించాలనే కోరిక ఉంటే తొలి అడుగు పోర్ట్‌ఫోలియో. దీనిని రూపొందించే ముందు మనిషి ఎత్తు, రంగు, ఫిజిక్ చూస్తారు. తర్వాత విభిన్న రకాల కాస్ట్యూమ్స్‌లో ఫొటోషూట్ చేస్తారు. ఈ షూట్లో ఫొటోగ్రాఫర్, మేకప్ ఆర్టిస్ట్, స్టైలిస్ట్లుంటారు. ఈ సందర్భంలోనే ఏ డ్రెస్‌లో ఎలా ఉన్నారు? ఏ యాంగిల్లో లుక్ బాగాలేదు? బాగా ఉంది? ఏ పార్ట్‌ను ఎలా హైలెట్ చేసుకోవాలి? బాగాలేదనిపిస్తున్న పార్ట్‌ని ఎలా దాచిపెట్టాలి? తదితర అంశాలపై సదరు వ్యక్తికి తర్ఫీదు ఇస్తారు. అనంతరం విభిన్న రకాల గెటప్స్‌తో రూపుదిద్దుకున్న పోర్ట్ ఫోలియోను దగ్గర ఉంచుకొని సినిమా ప్రయత్నాలు పూర్తి స్థారుులో మొదలుపెట్టేందుకు వీలవుతుంది. అందుకనే సినిమా రంగానికి వెళ్లాలనుకునేవారు వేయాల్సిన తొలి అడుగుకు తోడయ్యే ఫొటో స్టూడియోలకు సిటీలో ఇప్పుడు మంచి డిమాండ్. మా దగ్గర సినీ కలలు సాకారం.. ‘హీరో శర్వానంద్, ప్రముఖ యాంకర్ సుమలు ఏ మేకప్‌లో ఉంటే ప్రేక్షకులను ఆకట్టుకుంటారో దానికి అనుగుణంగా వారికి మేకప్ పరమైన అభ్యాసం చేరుుంచాను’ అంటూ గుర్తు చేసుకున్నారు నారాయణగూడలోని భట్ స్టూడియో యజమాని నటరాజ్ భట్. ఇప్పుడాయన తన స్టూడియో ద్వారా తారలై తెర మీద వెలగాలనుకునే వారికి పలు మార్గాల్లో సేవలందిస్తున్నారు. ఇటీవలే సుమ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ ఫొటో స్టూడియోలో మేకప్ కోర్సును కూడా నేర్పిస్తుండడం విశేషం. ఇందులో టీవీ, సినిమా, స్టేట్ ఆర్టిస్ట్, బ్రైడల్ మేకప్ కోర్సులను నేర్పిస్తారు. నటి అర్చన, బాబా సెహగల్‌తో పాటు మరికొంత మంది బాలీవుడ్ స్టార్స్ ఫీల్డ్‌లోకి రాకముందు తన దగ్గర మేకప్, స్క్రీన్ ప్రెజెంటేషన్ చేరుుంచుకున్నవారేనని చెప్పారు నటరాజ్. -
షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదాలు
నారాయణఖేడ్/ మెదక్ రూరల్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు పాక్షికంగా దగ్ధం కాగా, టెంట్ హాస్, మీసేవ కేంద్రంతోపాటు ఫొటో స్టూడియో పూర్తిగా తగలబడి పోయింది. వివరాలు ఇలా ఉన్నాయి.. నారాయణ ఖేడ్ పట్టణంలోని మార్వాడిగల్లిలోని ఓ ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమై పాక్షికంగా నష్టం జరిగింది. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మా ర్వాడిగల్లిలో నివాసం ఉంటున్న అవుసలి రవి కుటుంబ సభ్యులతో సోమవారం రాత్రి దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గల్లీలోని దేవీ మండపం వద్ద పూజలు చేసేందుకు వెళ్లారు. కాగా రవి ఇంట్లోని టీవీకి ఉన్న విద్యుత్ తీగల వద్ద షార్ట్‌సర్క్యూట్ జరిగి విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు సంఘటనను రవి కుటుంబీకులకు సమాచారం అందిం చారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఫైరింజన్‌ను తరలించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ టీవీ, ఇంట్లోని ఇతర వస్తువులు కాలిపోయాయి. విద్యుత్ షార్ట సర్క్యూట్ కారణంగా మెదక్ జిల్లా మండల పరిధిలోని భూర్గుపల్లి గ్రామంలో సోమవారం రాత్రి రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన సం తోష్ ఓ గదిలో టెంట్ హౌస్‌తో పాటు ఫొటో స్టూడియో, మీ సేవ కేంద్రాన్ని నడుపు తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు లాగే రాత్రి 9 గంటల ప్రాంతంలో షాపులను మూసివేసి అదే గ్రామంలో నివాస గృహానికి వెళ్లాడు. ఈ క్రమంలో సుమారు పది గంటల ప్రాంతంలో షాపు ల నుంచి పొగలు వస్తుండడంతో గ్రామస్తులు షాపు యజమాని సంతోష్‌కు చె ప్పారు. దీంతో అతను గ్రామస్తుల సహకారంతో షాపును తెరవగా అందులో ఉన్న టెంట్ బట్టలు, ఫొటో స్టూడియోకు సంబంధించిన మూడు కెమెరాలు, మీ సేవకు సంబంధించిన కంప్యూటర్, 3 ప్రింటర్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యా యి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బం ది వచ్చి మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో రూ. 4 లక్షల ఆస్తి నష్టం జరగ్గా రెండు గదులు సైతం పూర్తిగా కాలి నెర్రెలు బారాయి. ఈ ప్ర మాదంలో మొత్తం రూ. 7.40 లక్షల భా రీ ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితు లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆర్ఐ ప్రసాద్, వీఆర్ఓ ఆనందంలు ఘ టనా స్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కాగా తనను ప్రభుత్వం ఆ దుకోకుంటే ఆత్మహత్య తప్ప మరోమార్గం లేదని బాధితుడు తెలిపాడు.