స్మార్ట్ ఫోన్ చిక్కులకు చిట్కాలివిగో... | Smart phone picked up tips | Sakshi
Sakshi News home page

స్మార్ట్ ఫోన్ చిక్కులకు చిట్కాలివిగో...

Published Tue, Apr 7 2015 11:03 PM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM

స్మార్ట్ ఫోన్ చిక్కులకు  చిట్కాలివిగో... - Sakshi

స్మార్ట్ ఫోన్ చిక్కులకు చిట్కాలివిగో...

ఆండ్రాయిడ్ ఫోన్ అప్పుడప్పుడైనా సతాయిస్తోందా? స్క్రీన్ జామై... లేదంటే కొన్ని అప్లికేషన్లు సరిగా పనిచేయకుండా  మొరాయిస్తోందా?
 స్మార్ట్‌ఫోన్‌తో చిక్కులు  అందరికీ కామనే.  అయితే చాలా వరకూ సమస్యలను  మనమే సరిచేసుకోవచ్చు.   సాధారణంగా స్మార్ట్‌ఫోన్లతో
 వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి?  వాటిని ఎలా పరిష్కరించుకోవాలి?  అన్నది చూద్దామా...
 
పదే పదే గూగుల్ ప్లే స్టోర్ క్రాష్ అవుతూంటే...


స్మార్ట్‌ఫోన్‌లతోపాటు ఇన్‌బిల్ట్‌గా వచ్చే గూగుల్ ప్లే స్టోర్ తరచూ క్రాష్ అవడం మనందరికి అనుభవమైన సమస్య. దీనికి వైరస్, మాల్, యాడ్‌వేర్‌లతో సంబంధం లేదు. క్యాష్ మెమరీలో తేడాలు రావడం వల్ల ఇలా జరుగుతూంటుంది. క్యాష్ మెమరీని తుడిచేస్తే ప్రాబ్లెమ్ పోయినట్లే. ఈ పనిచేసేందుకు ఏం చేయాలంటే...
 
ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆప్స్‌ను సెలెక్ట్ చేసుకోండి.  కుడివైపునకు స్వాప్ చేస్తూ వెళితే ‘ఆల్’ అన్న ట్యాబ్ కనిపిస్తుంది.  దాంట్లో గూగుల్ ప్లే స్టోర్‌ను గుర్తించి డేటా, క్యాష్‌లను తుడిచేయండి.   ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి.   అప్పటికీ సమస్య తీరకపోతే గూగుల్ ప్లే సర్వీసెస్, గూగుల్ సర్వీసెస్ ఫ్రేమ్‌వర్క్‌లలోని డేటా, క్యాష్‌లను కూడా తుడిచేసి చూడండి.
 
 సిస్టమ్ యూజర్ ఇంటర్ఫేస్ జామ్ అయిపోతే...

 స్మార్ట్‌ఫోన్ స్క్రీన్  ఉన్నట్టుండి ఫ్రీజ్ అయిపోవడం... రీస్టార్ట్ చేయడంతో మళ్లీ పనిచేయడం మనం చూసే ఉంటాం. ఒకవేళ రీస్టార్ట్ చేసిన తరువాత కూడా స్క్రీన్‌లోని యూజర్ ఇంటర్ఫేస్ పనిచేయలేదనుకోండి. దీనికి సంబంధించి క్యాష్ మెమరీని తొలగించుకోవడం ద్వారా కొంత ఫలితముంటుంది. క్యాష్ వైప్ చేసుకునేందుకు మొదట్లో చెప్పినట్లుగా సెట్టింగ్స్‌లోని ఆప్ ట్యాబ్‌కు, అందులోని ఆల్ సెక్షన్‌కు వెళ్లి యూజర్ ఇంటర్ఫేస్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
 
వైఫై నెట్‌వర్క్‌కు  కనెక్ట్ కాకపోతే....

ఇలాంటి సమస్యకు ఎక్కువగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని రూటర్ లోపం కారణమవుతూంటుంది. రూటర్‌తోపాటు ఫోన్‌ను ఒకసారి రీస్టార్ట్ చేయడం ద్వారా వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావవచ్చు.
 
ప్లే స్టోర్‌తో అప్లికేషన్లు డౌన్‌లోడ్ కాకపోతే...

కొన్ని సార్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్లు డౌన్‌లోడ్ కాకుండా ఇబ్బంది పెడుతూంటాయి. దీనికి రెండు రకాల పరిష్కారాలున్నాయి. గూగుల్ ప్లే స్టోర్ క్యాష్ మెమరీని వైప్ చేయడం ఒకటైతే... గూగుల్ ప్లే హిస్టరీని ఇరేజ్ చేయడం రెండో పద్ధతి. క్యాష్‌ను వైప్ చేయడమెలాగో ఇప్పటికే చూశాం. హిస్టరీని తొలగించాలంటే ప్లే స్టోర్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌ను ఓపెన్ చేయండి. అందులో క్లియర్ హిస్టరీని సెలెక్ట్ చేసుకుంటే సరి.
 
వీడియో ప్లే కాకపోతే...


వీఎల్‌సీ, లేదా ఎంఎక్స్ ప్లేయన్లను ఉపయోగించి చూడండి. వీటితోనూ వీడియో ప్లే కాకపోతే దాంట్లోని ఫార్మాట్ సపోర్ట్ చేయడం లేదని అర్థం. మామూలుగా వీఎల్‌సీ, ఎంఎక్స్ ప్లేయర్లు చాలావరకూ ఫార్మాట్లను సపోర్ట్ చేస్తాయి. ప్రొప్రైటరీ ఫార్మాట్లకు మాత్రం ఆయా వీడియోలు సూచించే ప్లేయర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.
 
గూగుల్ ప్లే స్టోర్‌ను  రీ ఇన్‌స్టాల్  చేయాలంటే...
 
మీ స్మార్ట్‌ఫోన్ ఆప్స్ ఫోల్డర్‌లో గూగుల్ ప్లే స్టోర్ కనిపించడం లేదా? అయితే మీరు పొరబాటున దాన్ని అన్ ఇన్‌స్టాల్ చేశారన్నమాట. రూట్ యాక్సెస్ లేకుండా ప్లే స్టోర్‌ను తొలగించలేము కాబట్టి అన్‌ఇన్‌స్టాల్ మాత్రమే చేయగలం. దీని తిరిగి ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే సెట్టింగ్స్‌లోని ఆప్స్‌లోకి వెళ్లండి. కుడివైపునకు స్వాప్ చేసుకుంటూ వెళితే... డిసేబుల్డ్ అన్న ట్యాబ్ కనిపిస్తుంది. అందులో గూగుల్ ప్లే స్టోర్‌ను గుర్తించి క్లిక్ చేస్తే తిరిగి ఎనేబుల్ చేయవచ్చు. కొన్ని ట్యాబ్లెట్లలో గూగుల్ ప్లే స్టోర్ అస్సలు ఉండదు. అటువంటి సందర్భాల్లో ధర్డ్‌పార్టీ నుంచి ఏపీకేను డౌన్‌లోడ్ చేసుకుని గూగుల్ ప్లే స్టోర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీని కోసం సెట్టింగ్స్‌లోని సెక్యూరిటీ ట్యాబ్‌లోకి వెళ్లి అక్కడున్న అన్‌నోన్ సోర్సెస్‌ను టిక్ చేయండి. అప్పుడు థర్డ్‌పార్టీ నుంచి ప్లే స్టోర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
 
 మెమరీ  తక్కువగా ఉన్నప్పుడు...

రకరకాల పనుల కోసం అప్లికేషన్లు డౌన్‌లోడ్ చేసుకుని... కొంత కాలం తరువాత స్పేస్ లేదని చిరాకు పడుతూంటాం. స్మార్ట్‌ఫోన్‌లో మెమరీని సద్వినియోగం చేసుకునేందుకు మార్కెట్‌లో అనేక అప్లికేషన్లు ఉన్నాయి. వీటితో కొంత మెమరీని సేవ్ చేసుకోవచ్చు. అలాకాకుండా అప్లికేషన్లను అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా కూడా మెమరీని ఆదా చేయవచ్చు. అయితే స్పాటిఫై వంటి మ్యూజిక్ ఆప్స్ అన్ ఇన్‌స్టాల్ చేసేందుకు అవి ఎక్కడున్నాయో తెలియాలి. అటువంటి సందర్భాల్లో సీసీ క్లీనర్ వంటి అప్లికేషన్లు వాడటం మంచిది. డిస్క్ యూసేజ్ వంటి వాటితో ఏ అప్లికేషన్ ఎంత మెమరీ తీసుకుంటోందో చూసుకోవచ్చు. తదనుగుణంగా చర్యలు తీసుకోవచ్చు
 
ఆన్ అవుతూనే ఫోన్  క్రాష్ అవుతూంటే..

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బూట్ కాకుండా సతాయిస్తూంటే... పదే పదే క్రాష్ అవుతూంటే.. దాన్ని సేఫ్ మోడ్‌లో ఆన్ చేయడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. అయితే సేఫ్‌మోడ్‌లో ఎలా ఆన్ చేయడం అన్నది ఒక ప్రశ్న. దీనికి కూడా ఒక సింపుల్ పద్ధతి ఉంది. ఫోన్ పవర్‌బటన్‌ను కొద్దిసేపు నొక్కి పట్టుకుంటే... పవర్ ఆఫ్ అన్న ఆప్షన్ వస్తుంది. పవర్ ఆఫ్ ఆప్షన్‌ను కూడా కొద్దిసేపు నొక్కి పట్టి ఉంచితే... ఫోన్‌ను సేఫ్ మోడ్‌లో రీబూట్ చేయాలా? అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరి. ఒకసారి మీరు సేఫ్‌మోడ్‌లో స్మార్ట్‌ఫోన్‌ను ఆన్ చేసిన తరువాత అనవసరమైన, తేడాగా ఉన్న అప్లికేషన్లను తొలగించి రీస్టార్ట్ చేస్తే బూటింగ్ సమస్య పోతుంది.
 
స్కానింగ్ కోసం ఆఫీస్ లెన్స్..

అకస్మాత్తుగా మీ పాస్‌పోర్ట్ కాపీ లేదంటే ఇంకో రసీదు స్కాన్ చేయాలి?
ఏం చేస్తారు? దగ్గర్లో ఉన్న డీటీపీ సెంటర్‌కు వెళ్లడం చాలామంది చేసే పని. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే ఒక చిన్న అప్లికేషన్ ద్వారా ఈ పని మీరు ఎక్కడుంటే అక్కడే చేసేయవచ్చు. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా ఆండ్రాయిడ్‌తోపాటు ఐఫోన్ కోసం కూడా ఆఫీస్ లెన్స్ పేరుతో ఇలాంటి ఓ అప్లికేషన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. మీరు స్కాన్ చేయాలనుకుంటున్న రసీదు లేదా కాగితాన్ని ఫొటో తీసి అప్లికేషన్‌ను రన్ చేస్తే చాలు. మీకు నచ్చిన ఫార్మాట్ (పీడీఎఫ్, డాక్స్, పీపీటీఎక్స్, జేపీజీ)లోకి మార్చేసి ఇస్తుంది. వన్‌నోట్‌తో కలిసి ఈ అప్లికేషన్ బిజినెస్‌కార్డులు, రసీదులు తదితర డాక్యుమెంట్లను స్కాన్ చేయగలదు. స్కాన్‌వన్, వన్‌నోట్‌లు బిజినెస్ కార్డులను స్కాన్ చేయడంతోపాటు వాటిల్లోని ఫోన్ నెంబర్లను నేరుగా ఫోన్‌లోకి ఫీడ్ చేసుకునేందుకు వీలుకల్పిస్తాయన్నది తెలిసిందే.
 
మొబీ ఎన్షూర్...


స్మార్ట్‌ఫోన్ ఎక్కడైనా మరచిపోయినా, ఎవరైనా ఎత్తుకెళ్లినా చాలా ఇబ్బంది. మన నెంబర్‌కు పదేపదే కాల్ చేయడం అవతలివారు లిఫ్ట్ చేయకపోవడం పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినా పెద్దగా ఫలితం లేకపోవడం మనలో చాలామందికి అనుభవం. ఈ సమస్యలన్నింటినీ ఒక్క ఎస్‌ఎంఎస్‌తో సరిచేయవచ్చునంటోంది మొబీ ఎన్షూర్ టెక్నాలజీస్. ఈ సంస్థ అభివృద్ధి చేసిన మొబీ ట్రాకర్ అప్లికేషన్  మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే దాని పోగొట్టుకున్నా తిరిగి వెతుక్కోవడం చాలా సులువు. ఎందుకంటే... పోగొట్టుకుపోయిన తరువాత ఈ అప్లికేషన్ ఎప్పటికప్పుడు తాను ఉండే ప్రాంతం వివరాలు మీరు సూచించే మరో నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో పంపుతూ ఉంటుంది. అంతేకాదు.... అవతలివాళ్లు సిమ్ మార్చినా సరే... కొత్త సిమ్ నెంబర్‌ను కనిపెట్టి మీ ఇతర నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేస్తుంది. దాంతోపాటు అవతలి వ్యక్తి కొత్త నెంబర్‌తో ఏఏ నెంబర్లకు ఫోన్ చేశారన్న వివరాలు కూడా మెయిల్ ఐడీకి పంపుతుంది. చిన్న మెసేజీతో మీ ఫోన్‌ను లాక్ చేయడంతోపాటు ఆఫ్ బటన్ తాత్కాలికంగా పనిచేయకుండా చేసేయవచ్చు. దీనివల్ల ఫోన్ ఎత్తుకెళ్లిన వారు ఫోన్ అస్సలు ఆఫ్ చేయలేరు. ఇన్ని  వివరాలు దొరికిన తరువాత మీ ఫోన్ మళ్లీ మీకు దొరకడం చాలా సులువే కదా!
 
మెదడుకు ఇంగ్లీష్ మేత...

స్మార్ట్‌ఫోన్‌లోని గేమ్స్‌తో మీరు టైమ్‌పాస్ చేస్తూనే ఉంటారు కదూ... కాలం గడిపేందుకు మాత్రమే కాకుండా మీ మెదడుకు మేతగానూ ఈ గేమ్స్ ఉపయోగపడితే? అదికూడా ఇంగ్లీషు భాషలో మీ పరిజ్ఞానాన్ని పెంచేదైతే? భలే ఉంటుంది. లెటర్‌క్రాఫ్ట్ అచ్చంగా ఇదే పనిచేస్తుంది. క్రాస్‌వర్డ్ పజిల్ మాదిరిగా గళ్లుగళ్లుగా ఉండే ఈ గేమ్‌లో పదాలను వెతికి సరిచేయాల్సి ఉంటుంది. లెవల్స్ పెరిగేకొద్దీ పదాల సంక్లిష్టత పెరుగుతుందన్నమాట. నిర్ణీత సమయంలో వీలైనన్ని ఎక్కువ పదాలను గుర్తించాల్సి ఉంటుంది. పదం పొడవునుబట్టి మీకు పాయింట్లు వస్తాయి. లెటర్‌క్రాఫ్ట్ ప్రస్తుతానికి ఐఫోన్ వినియోగదారుల కోసం మాత్రమే అందుబాటులో ఉంది. గేమ్ ఉచితంగానే లభిస్తున్నప్పటికీ కొంచెం డబ్బు చెల్లించడం ద్వారా మీరు గుర్తించిన పదాల జాబితా, మీ ప్రోగ్రెస్ వంటి అదనపు వివరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement