గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ 8 లక్షల యాప్‌లపై నిషేధం విధించాయి. పిక్సలేట్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘హెచ్1 2021 డీలిస్టెడ్ మొబైల్ యాప్స్ రిపోర్ట్’ పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ 2021 మొదటి అర్ధభాగంలో 8,13,000కు పైగా యాప్‌లపై నిషేధం విధించినట్లు ఈ నివేదిక పేర్కొంది. వీటిలో 86 శాతం యాప్‌లు పిల్లలే లక్ష్యంగా సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు గుర్తించామని నివేదికలో పిక్సలేట్ తెలిపింది. ఈ యాప్స్ తొలగింపునకు ప్రధాన కారణం గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నియమాలు ఉల్లఘించడమే కాకుండా ఇతర కారణాలు ఉన్నాయి.
పిక్సాలేట్ విడుదల చేసిన "హెచ్1 2021 డీలిస్టెడ్ మొబైల్ యాప్స్ రిపోర్ట్" కొన్ని కీలక డేటా పాయింట్లను పంచుకుంది. ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లో 5 మిలియన్లకు పైగా మొబైల్ యాప్‌లను ఈ కంపెనీ విశ్లేషించింది. అంతేగాక, ఈ యాప్స్ డీలిస్టింగ్ కు ఈ యాప్‌లకు సుమారు 21 మిలియన్ యూజర్ రివ్యూలు ఉన్నట్లు వెల్లడించింది. అందువల్ల, ఇంకా లక్షలాది యాప్ వినియోగదారులు వీటిని వినియోగించే అవకాశం ఉన్నట్లు నివేదిక తెలిపింది.
మీరు ఏమి చేయాలి?
గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ వాటిని స్టోర్ల నుంచి నిషేధించి ఉండవచ్చు, కానీ ఈ యాప్స్ బహుశా మీ ఫోన్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి, మీరు ఇప్పుడు వాటిని కనుగొని వెంటనే డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్స్ స్టోర్ పాలసీ ఉల్లంఘన కారణంగా తొలగిస్తే వినియోగదారుల గోప్యత, భద్రతకు, అదేవిధంగా ప్రకటనదారులకు బ్రాండ్ భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే మీ మొబైల్స్ లో ఉన్న అన్నీ యాప్స్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేల ఆ యాప్స్ ప్లే స్టోర్/యాప్ స్టోర్ లేకపోతే వెంటనే మీ మొబైల్ నుంచి వెంటనే తొలగించాలి నిపుణులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment