ఓటీటీ కంటెంట్ యాప్‌లు ఎన్ని మార్కెట్‌లోకి వచ్చినా ఇప్పటికీ వీడియోస్ చూడాలంటూ మొదటగా గుర్తొచ్చేది యూట్యూబ్‌నే. సవాలక్ష టాపిల్‌లపై ఇక్కడ సమాచారం దొరుకుతుంది. కానీ వాటిని ప్రశాంతంగా చూడనీయకుండా మధ్యలో వచ్చే యాడ్స్ సతాయిస్తుంటాయి.
యాడ్స్ లేకుండా యూట్యూబ్ ప్రీమియం పేరిట పెయిడ్ సర్వీసులు కూడా అందిస్తోంది. అయితే ఎటువంటి సొమ్ము చెల్లించకుండా పెయిడ్ సర్వీస్ ఝంజాటం లేకుండా యాడ్స్ ఫ్రీగా యూట్యూబ్ చూసే అవకాశం వాన్సెడ్ యాప్‌తో ఉండేంది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై లభించి ఈ యాప్‌ను ఉపయోగించి యాడ్ ఫ్రీగా యూట్యూబ్ వీడియోలు చూసేవాళ్లు.
అయితే యాడ్ ఫ్రీగా కంటెంట్ చూపిస్తున్న వాన్సెడ్‌కు ఇటీవల చిక్కులు ఎదురయ్యాయి. తమ కంటెంట్‌పై వాన్సెడ్ పెత్తనం ఏంటంటూ లీగల్ కొర్రీలు పడ్డాయి. దీంతో వాన్సెడ్ యాప్ సృష్టికర్త అయిన వెర్జ్ వెనక్కి తగ్గింది. దీంతో వాన్సెడ్ యాప్‌ని వెనక్కి తీసుకుంది. అంతేకాదు ఇప్పటికే డౌన్‌లోడ్ అయిన యాప్‌లు సైతం త్వరలోనే బంద్ అవుతాయంటూ వెర్జ్ చెబుతోంది.
వాన్సెడ్ యాప్ రద్దు కావడంతో ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్‌పై యాడ్ ఫ్రీగా వీడియోలు చూస్తున్న చాలా మందికి ఇక నిరాశే మిగలనుంది. గతంలో యూట్యూబ్ నుంచి వీడియోలు, ఆడియోలు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కలిగించిన ట్యూబ్‌మేట్ యాప్ విషయంలోనే ఇలానే జరిగింది.
చదవండి: యూట్యూబ్ చేస్తున్న అద్భుతం, ఇండియన్ ఎకానమీ సూపరో సూపరు!
Comments
Please login to add a commentAdd a comment