
పూజా హెగ్డే
పుట్టినరోజు (అక్టోబర్ 13) సందర్భంగా పూజా హెగ్డే తన తాజా చిత్రం గురించి థ్రిల్లింగ్ న్యూస్ ఒకటి చెప్పారు. షాహిద్ కపూర్ సరసన తొలిసారి ఆమె కథానాయికగా నటించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు రోషన్ ఆండ్రూస్ తెరకెక్కించనున్నారు. ఇలా బర్త్ డేకి ఓ థ్రిల్లర్ మూవీకి సైన్ చేయడం పట్ల పూజా హెగ్డే ఆనందంగా ఉన్నారు. ‘‘ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా.
ఎందుకంటే కథాంశం కొత్తగా ఉంది. అలాగే నాది చాలా విభిన్నమైన పాత్ర. షాహిద్ కపూర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుండటం హ్యాపీగా ఉంది. తను మంచి నటుడు. అందుకే ఈ సినిమా ప్రయాణాన్ని ఆరంభించడానికి ఆసక్తిగా ఉన్నాను’’ అని పేర్కొన్నారు పూజా హెగ్డే. ఇక పుట్టినరోజుని ఎలా జరుపుకున్నారంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీ మాల్దీవుల్లో ఉన్నారు. ‘కరెంట్లీ అన్ అవైలబుల్’ (ప్రస్తుతం అందుబాటులో లేను) అంటూ మాల్దీవుల్లో సేద తీరుతున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు పూజా హెగ్డే.
Comments
Please login to add a commentAdd a comment