బై బై ముంబై | Rajinikanth and Amitabh Bachchan wrap up Mumbai schedule of Thalaivar 170 | Sakshi
Sakshi News home page

బై బై ముంబై

Published Mon, Oct 30 2023 12:37 AM | Last Updated on Mon, Oct 30 2023 12:37 AM

Rajinikanth and Amitabh Bachchan wrap up Mumbai schedule of Thalaivar 170 - Sakshi

రజనీకాంత్, అమితాబ్‌ బచ్చన్‌

రజనీకాంత్‌ హీరోగా ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లైకా ప్రోడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్  నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల ముంబైలో ప్రారంభమైంది. రజనీకాంత్, అమితాబ్‌ బచ్చన్  పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ముంబై షెడ్యూల్‌ ముగిసిందని వెల్లడించి, ఓ వర్కింగ్‌ స్టిల్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు మేకర్స్‌.

ఇలా ముంబైకి బై బై చెప్పారు రజనీకాంత్‌. ఇక 1991లో విడుదలైన హిందీ చిత్రం ‘హమ్‌’ తర్వాత రజనీకాంత్, అమితాబ్‌ బచ్చన్  కలిసి 33 ఏళ్లకు స్క్రీన్  షేర్‌ చేసుకుంటున్న చిత్రం ఇది. రానా, ఫాహద్‌ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్  కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్‌ రవి చంద్రన్  సంగీతం అందిస్తున్నారు. ఓ సామాజిక అంశం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పోలీసాఫీసర్‌ పాత్రలో రజనీకాంత్‌ కనిపిస్తారని, వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుందనే టాక్‌ వినిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement