
షాహిద్ కపూర్–పూజా హెగ్డే జోడీ ఒక సినిమాకి సెట్ అయ్యిందన్నది బాలీవుడ్ తాజా ఖబర్. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రా నికి ‘కోయీ షాక్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెలలోనే ఆరంభం కావాల్సింది. అయితే ముందుగా ప్రారంభోత్సవం జరిపి, ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని షూటింగ్ ప్లాన్ చేస్తారట.
ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించనున్నారు. కాగా, ఇటీవల పూజా హెగ్డే ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా హిందీలో ఆమె మూడు చిత్రాలు సైన్ చేశారని, వాటిలో ‘కోయీ షాక్’ ఒకటని సవచారం.
Comments
Please login to add a commentAdd a comment