Manchu Mohan Babu Home Tour Video : మంచు లక్ష్మీ.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో యూట్యూబర్‌గా అవతారం ఎత్తిన మంచు లక్ష్మీ క్రియేటివ్ వీడియాలతో ఆకట్టుకుంటుంది. లక్ష్మీ మంచు పేరుతో ఉన్న ఆమె యూట్యూబ్ ఛానల్‌కి ఇప్పటికే లక్షా 60వేలకు పైగా సబ్‌స్రైబర్స్ ఉన్నారు. తన ఛానెల్ ద్వారా బ్యూటీ, ఫ్యాషన్, ఫోటో షూట్ లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు రూపొందించిన లక్ష్మీ తాజాగా తన నాన్న, నటుడు మంచు మోహన్ బాబు ఇంటిని నెటిజన్లకు పరిచయం చేసింది.
ఇది తన తండ్రి 6వ ఇల్లని పేర్కొంది. ఇక కిచెన్, ఆఫీస్, హోం థియేటర్ సహా ఇల్లు మొత్తాన్ని వివరించే ప్రయత్నం చేస్తుండగా మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఏంటి ఇల్లు మొత్తం చూపిస్తున్నావా అని అడగ్గా..ఆల్రెడీ వాళ్లు చూశారు కదా నాన్న అని లక్ష్మీ ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఫోటోలు తీయకూడదు..ఇల్లు చూపించకూడదు అంటూ మంచు లక్ష్మీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకోబోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక సకల సౌకర్యాలతో ఇంద్ర భవనంలా మెరిసిపోతున్న మోహన్ బాబు ఇంటిని మీరు కూడా చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment