
జై లవ కుశ సినిమా తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడి సరికొత్త లుక్‌లోకి మారిపోయాడు. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస‍్తోంది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘అసామాన్యుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. త్రివిక్రమ్ టైటిల్ ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. గతంలో అజ్ఞాతవాసి సినిమా విషయంలో ఎన్నో వార్తల తరువాత ఫైనల్ గా టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. మరి ఎన్టీఆర్ సినిమా విషయంలో అయినా త్వరగా టైటిల్‌పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.