
జై లవ కుశ సినిమా తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఓ పేరు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
రాయలసీమ నేపథ్యంలో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘అరవింద సమేత రాఘవ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ సినిమాకు ‘అసామాన్యుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి.
అయితే తాజాగా తెరమీదకు వచ్చిన అరవింద సమేత రాఘవ టైటిల్‌పై అభిమానుల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి చిత్రయూనిట్ ఈ టైటిల్స్‌లోనే ఒకదాన్ని ప్రకటించనుందా..? లేక వేరే టైటిలా..? తెలియాలంటే ఈ రోజు సాయంత్రం 4 గంటల 50 నిమిషాల వరకు వెయిట్ చేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment