ఇంట్రో రెడీ | Kamal Haasan's Indian 2 Intro Will Be Release On November 3 - Sakshi
Sakshi News home page

ఇంట్రో రెడీ

Published Mon, Oct 30 2023 1:10 AM | Last Updated on Mon, Oct 30 2023 10:38 AM

Kamal Haasan Indian 2 intro release set for November 3 2023 - Sakshi

కమల్‌హాసన్‌

కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూ΄పొందుతున్న తాజా చిత్రం ‘ఇండియన్‌ 2’. 1996లో కమల్, శంకర్‌ కాంబినేషన్‌లోనే వచ్చిన ‘ఇండియన్‌’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా మేజర్‌ షూట్‌ పూర్తయింది.

తాజాగా ‘ఇండియన్‌ 2’ సినిమాకు సంబంధించిన వీడియోను ‘ఇండియన్‌ 2 యాన్‌ ఇంట్రో’ టైటిల్‌తో నవంబరు 3న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుద్‌ రవిచంద్రన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement