
కమల్‌హాసన్
‘‘హలో... ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను. భారతీయుడుకి చావే లేదు’ అంటూ ‘ఇండియన్’ (‘భారతీయుడు’) చిత్రం చివర్లో కమల్‌హాసన్ చెప్పే డైలాగ్‌తో ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’) ఇంట్రో గ్లింప్స్ మొదలవుతుంది. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపోందిన ‘ఇండియన్’ (1993)కి సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది.
కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రధారులు. సుభాస్కరన్, ఉదయ నిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ‘ఇండియన్ 2’ ఇంట్రో గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘భారతీయుడు ఈజ్ బ్యాక్’ అంటూ ‘ఇండియన్ 2’ తెలుగు వెర్షన్ గ్లింప్స్‌ను దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి షేర్ చేశారు. ఈ వీడియోలో ‘నమస్తే ఇండియా.. భారతీయుడు ఈజ్ బ్యాక్’ అంటూ కమల్‌హాసన్ చెప్పిన డైలాగ్ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment