భారతీయుడు 2 సెన్సార్‌ పూర్తి.. నిడివి ఎంతో తెలుసా..? | Indian 2 Movie Censor And Runtime Final | Sakshi
Sakshi News home page

భారతీయుడు 2 సెన్సార్‌ పూర్తి.. నిడివి ఎంతో తెలుసా..?

Published Fri, Jul 5 2024 11:48 AM | Last Updated on Fri, Jul 5 2024 1:12 PM

Indian 2 Movie Censor And Runtime Final

అవినీతిపై సమరశంఖాన్ని పూరించే కథతో 1996లో భారతీయుడు చిత్రం విడుదలైంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు 2 చిత్రం జూలై 12వ తేదీన రిలీజ్ కానుంది.  కమల్‌ హాసన్‌- శంకర్‌ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అవినీతిపరులపై, అన్యాయంపై యుద్ధం చేసే సేనాపతిగా కమల్‌ను మరోసారి వెండితెరపై శంకర్‌ చూపించనున్నాడు. అయితే తాజాగా భారతీయుడు 2 సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది.

భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన భారతీయుడు 2 చిత్రానికి U/A సర్టిఫికెట్‌ను సెన్సార్‌ బోర్డు జారీ చేసింది. అయితే, ఈ సినిమా రన్‌టైమ్‌ ఏకంగా 3.04 గంటల పాటు నిడివి ఉంది. ఈ చిత్రం నుంచి కొన్ని అభ్యంతకరమైన సీన్లును తొలగించినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ నిడివి ఉన్న సినిమాలే వస్తున్నాయి. ఇంత నిడివి ఉన్న సినిమాలు ప్రేక్షకులను మెప్పించాలంటే కథ ప్రధాన బలంగా ఉండాలి. ఈ విషయంలో శంకర్‌ విజయం సాధిస్తాడని ఆయన ఫ్యాన్స్‌ అంటున్నారు.

రంగస్థలం నుంచి ఈ మధ్య వచ్చిన యానిమల్‌, సలార్‌, కల్కి వంటి చిత్రాలు మూడు గంటల నిడివితో వచ్చినవే కావడం విశేషం. ఇప్పుడు తాజాగా భారతీయుడు 2 కూడా ఎక్కువ రన్‌టైమ్‌ ఉన్న లిస్ట్‌లో చేరిపోయింది. భారీ అంచనాలతో జులై 12న ఈ చిత్రం విడుదల కానుంది. విక్రమ్‌ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లతో దుమ్మురేపిన కమల్‌ ఇప్పుడు భారతీయుడు చిత్రంతో పలు రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తాడని ఫ్యాన్స్‌ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement