అందుకే ఆ టైటిల్‌!  | Kalki 2898 AD director Nag Ashwin shares his insights about the timeline of the film | Sakshi
Sakshi News home page

అందుకే ఆ టైటిల్‌! 

Published Tue, Feb 27 2024 12:53 AM | Last Updated on Tue, Feb 27 2024 12:53 AM

Kalki 2898 AD director Nag Ashwin shares his insights about the timeline of the film - Sakshi

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా పాన్‌ ఇండియన్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌. అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ మూవీ రూపొందుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైటిల్‌ని తొలుత ప్రాజెక్ట్‌ కె’ అని నిర్ణయించారు. ఆ తర్వాత ‘కల్కి 2898 ఏడీ’గా మార్చారు. కొత్త టైటిల్‌పై ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ, అటు ప్రేక్షకులు, ప్రభాస్‌ అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ  కార్యక్రమంలో పాల్గొన్న నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్‌ ఎందుకు పెట్టామనే విషయాన్ని వెల్లడించారు.

‘‘నేను మహాభారతం గురించి వింటూ, స్టార్‌ వార్స్‌ని చూస్తూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ ఆలోచన వచ్చింది. ఈ చిత్రకథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుంది. గతంతోప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్‌ పెట్టాం. ఈ మూవీలో ఆరు వేల సంవత్సరాల మధ్య జరిగే కథను చూపించనున్నాం. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం కూడా చేశాం. ఈ క్రమంలోనే ఓ ఊహా ప్రపంచాన్ని సృష్టించాం. సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ ఇండియన్‌ మైథాలజీ చుట్టే ఉంటాయి. గతంలో హాలీవుడ్‌లో విడుదలైన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘బ్లేడ్‌ రన్నర్‌’ మూవీ పోలికలు ‘కల్కి 2898 ఏడీ’లో ఎక్కడా కనిపించవు. ఓ రకంగా ఇది నాకు సవాల్‌’’ అన్నారు. సి. అశ్వినీదత్‌ నిర్మిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మే 9న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement