ప్రభాస్‌ ‘సలార్’‌ టైటిల్‌ అర్థం ఏంటంటే.. | The Real Meaning Behind Prabhas Salaar Movie Title | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ ‘సలార్’‌ టైటిల్‌ అర్థం ఏంటేంటే..

Published Fri, Dec 4 2020 1:35 PM | Last Updated on Fri, Dec 4 2020 2:12 PM

The Real Meaning Behind Prabhas Salaar Movie Title - Sakshi

హీరో ప్రభాస్‌, 'కేజీఎఫ్‌' ఫేమ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌  కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కతుందని ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి  ‘సలార్‌’ అనే టైటిల్‌ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇక అప్పటినుంచి ప్రభాస్‌ ‌ ఫ్యాన్‌తో పాటు సినీ అభిమానుల్లోనూ అసలు సలార్‌ అంటే అర్థం ఏంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కేజీఎఫ్‌, ఉగ్రం సినిమాలతో హిట్‌ అందుకున్న ప్రశాంత్‌.. కన్నడ హీరోలను కూడా ప్రభాస్‌ను ఎందుకు తీసుకున్నాడు అన్న సందేహాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ వీటన్నింటికి వివరణ ఇచ్చాడు. (కేజీఎఫ్‌ కాంబినేషన్‌లో ప్రభాస్‌ ‘సలార్‌’)

సలార్‌ అనేది ఉర్దూ పదం కాగా, దీని అర్థం సమర్థవంతుడైన నాయకుడని, రాజుకు కుడిభుజంగా ఉంటూ, అత్యంత నమ్మదగిన వ్యక్తి అని తెలిపాడు. ఈ పాత్రకి ప్రభాస్ సరిగ్గా సరిపోతారని పేర్కొన్నారు. ‌ ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో ప్యాన్‌ ఇండియా స్టార్‌గా  పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పటికే  ‘రాధే శ్యామ్‌’,  ‘ఆదిపురుష్‌' చిత్రల్లో నటిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో  ఓ చిత్రంతో పాటు సలార్ సినిమా వరకు అన్ని ప్యాన్‌ఇండియా సినిమాలు ప్రభాస్‌ చేతిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని విజయ్‌ కిరగందూర్‌ (కేజీఎఫ్‌ మూవీ ప్రొడ్యూసర్‌) నిర్మించనున్నారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌బోయే సలార్‌ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది జవవరిలో ప్రారంభం కానుంది.  (ప్రభాస్‌ లీడర్‌ )
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement