శౌర్యంగపర్వం ఎప్పుడు మొదలౌతుంది అంటే.. | Salaar Part 2: Shouryanga Parvam Shooting Update | Sakshi
Sakshi News home page

శౌర్యంగపర్వం ఎప్పుడు మొదలౌతుంది అంటే..

Published Thu, Jul 4 2024 9:13 AM | Last Updated on Thu, Jul 4 2024 10:44 AM

Salaar Part 2: Shouryanga Parvam Shooting Update

ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఎక్కడ చూసిన కల్కి ట్రెండ్‌ కొనసాగుతుంది. ఇప్పటికే రూ. 700 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టిన కల్కి లాంగ్‌ రన్‌లో రూ. 1000 కోట్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్‌ మార్కెట్‌ మరింత పెరిగింది. దీంతో ఆయన నుంచి రాబోయే సినిమాలకు మంచి మార్కెట్‌ ఉండబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

గతేడాదిలో విడుదలైన సలార్‌ సినిమాకు సంబంధించి ఇప్పుడు సీక్వెల్‌ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రభాస్‌- ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ. 600 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘శౌర్యంగపర్వం’ రానుంది. దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సుమారు 20 శాతం షూటింగ్‌ పూర్తిచేశారని తెలుస్తోంది. 

ఆగష్టు 10 నుంచి సలార్‌ సీక్వెల్‌ చిత్రీకరణ ప్రారంభం కాట్లు సమాచరం. ఇదే సమయంలో డైరెక్టర్‌ మారుతి- ప్రభాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'రాజాసాబ్‌'. ఈ సినిమా షూటింగ్‌ చివరిదశకు చేరడంతో ఇప్పుడు శౌర్యంగపర్వం వైపు ప్రభాస్‌ అడుగులు వేస్తున్నారట. ప్రశాంత్ నీల్ - జూ ఎన్టీఆర్‌ కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎలాంటి క్లాష్‌ రాకుండా శౌర్యంగపర్వం చిత్రాన్ని తెరకెక్కిస్తానని మైత్రి మూవీస్‌ సంస్థకు ప్రశాంత్ మాట ఇచ్చారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement