
సినిమా పేరు చెప్పండి.. లక్ష రూపాయలు మీకే. ఏంటి మూవీ పేరు లక్ష రూపాయలిస్తారా?అని అనుకుంటున్నారా? అవునండి మీరు విన్నది నిజమే.. మీ మెదడుకు పదునుపెట్టి టైటిల్ ఏంటో పట్టేయండి.. లక్ష రూపాయలు మీ సొంతం చేసుకోండి. ఇంతకీ ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.
త్రినాధ్ కటారి స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ఐఎంవై అనే టైటిల్తో రూపొందిస్తున్నారు.ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఓం గమ్ గణపతయే నమహా అంటూ సాగే భక్తి పాటను కూడా విడుదల చేశారు. ఈ పాట ఆడియన్స్కు విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడగా.. ఆర్.పి. పట్నాయక్ సంగీతం అందించారు.
అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ క్యాష్ ప్రైజ్ కాంటెస్ట్‌ను మేకర్స్ ప్రారంభించారు. ఐఎంవై మూవీకి తెలుగులో టైటిల్ పేరు కరెక్ట్గా చెప్పినవాళ్లకు లక్ష రూపాయల బహుమతి అందించనున్నారు. అంతేకాకుండా టాప్-10 క్రియేటివ్ టైటిల్స్ పంపినవారికి సైతం రూ.5 వేల రూపాయలు అందిస్తామని ప్రకటించారు. ఈ లక్ష రూపాయలు నగదు గెలుచుకోవాలనుకుంటే ఈనెల 13వ తేదీలోగా మీ సమాధానాన్ని 7569933855 నంబర్‌కు వాట్సాప్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం.. మీ క్రియేటివిటీతో లక్ష రూపాయలు సొంతం చేసుకోండి.
కాగా.. ఈ చిత్రాన్ని సంజీవని ప్రొడక్షన్ బ్యానర్లో కె శంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో సాహితీ అవంచ, దేవి శ్రీప్రసాద్, గోపరాజు రమణ, తనికెళ్ల భరణి, మధుమణి, సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతమందిస్తున్నారు.