వేసవిలో రామబాణం | Gopichand next movie title is Rama Banam | Sakshi
Sakshi News home page

వేసవిలో రామబాణం

Published Sun, Jan 15 2023 5:37 AM | Last Updated on Sun, Jan 15 2023 5:37 AM

Gopichand next movie title is Rama Banam - Sakshi

‘లక్ష్యం’ (2007), ‘లౌక్యం’ (2014) చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రానికి ‘రామబాణం’ టైటిల్‌ను ఖరారు చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను శనివారం ప్రకటించారు. డింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, ఖుçష్బూ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులో గోపీచంద్‌కు అన్నా వదిన పాత్రల్లో జగపతిబాబు, ఖుష్బూ కనిపిస్తారు.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీచంద్‌ కెరీర్‌లో 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ తుది దశలో ఉంది. ‘‘బాలకృష్ణగారు మా సినిమా టైటిల్‌ను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమై ఉన్న బలమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్‌ చేసేలా సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు కథ: భూపతి రాజా, కెమెరా: వెట్రి పళనీస్వామి, సంగీతం: మిక్కీ జే మేయర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement