నేను దిగితే మిగిలేదుండదు! | Ram Pothineni Boyapati Sreenu movie titled Skanda | Sakshi
Sakshi News home page

నేను దిగితే మిగిలేదుండదు!

Published Tue, Jul 4 2023 3:54 AM | Last Updated on Tue, Jul 4 2023 3:54 AM

Ram Pothineni Boyapati Sreenu movie titled Skanda - Sakshi

రామ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘స్కంద’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ‘ది ఎటాకర్‌’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో రామ్‌ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. సోమవారం ‘స్కంద’ టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్‌.

‘మీరు (సినిమాలో రౌడీలను ఉద్దేశిస్తూ..) దిగితే ఊడేదుండదు... నేను దిగితే మిగిలేదుండదు..’ అంటూ రామ్‌ చెప్పే డైలాగ్‌తో ఈ గ్లింప్స్‌ విడుదలైంది. జీ స్టూడియోస్, పవన్  కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సెప్టెంబర్‌ 15న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: తమన్ , కెమెరా: సంతోష్‌ డిటాకే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement