
Ram Pothineni In Boyapati Srinu Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ 'అఖండ' చిత్రంతో మాసివ్ హిట్ కొట్టాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ జోష్‌తో మరో మాస్ యాక్షన్ సినిమాను తెరకెక్కించనున్నాడు బోయపాటి. ఉస్తాద్ హీరో రామ్‌తో కలిసి తన 10వ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. అలాగే రామ్ కెరీర్లో 20వ సినిమాగా ఈ చిత్రం రూపొందడం విశేషం. ఈ సినిమాను శ్రీనివాస్ చుట్టూరి నిర్మించగా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. రామ్ సినీ కెరీర్లో పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ మూవీ కోసం బోయపాటి భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
ఇందులో హీరోయిన్ కోసం బాలీవుడ్ భామను తీసుకోనున్నారట. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హిందీ హీరోయిన్ అయితే మార్కెట్ కూడా కలిసివస్తుందని మేకర్స్ అంచనా. అందుకే ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రాను తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే బోయపాటి పరిణితీ చోప్రాను సంప్రదించాడని, ఆమె పాజిటివ్‌గా స్పందించినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే సౌత్ నుంచి కూడా మరో ఇద్దరు నటులను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
Comments
Please login to add a commentAdd a comment