
రామ్ పోతినేని తాజా చిత్రంపై క్రేజీ అప్‌డేట్ వచ్చింది. మాస్ డైరెక్టర్ బోయపాటి- రామ్ కాంబినేషన్‌లో రానున్న చిత్రానికి సంబంధించి దసరా కానుకగా అక్టోబర్ 5న అప్‌డేట్ ఇస్తున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. 'ఇక ఎదురుచూపులు ముగిశాయి. మాసివ్ ఎనర్జిటిక్ కాంబోతో దసరా వేడుకలు ప్రారంభిద్దాం. అక్టోబర్ 5న అప్ డేట్స్ రాబోతున్నాయి. వేచి ఉండండి’ అంటూ పోస్ట్ చేశారు.
(చదవండి: అర్జున్‌ను ఎవరూ ఆపలేరు.. అంచనాలు పెంచుతున్న 'హంట్' టీజర్)
అయితే వీరిద్దరి సినిమాపై చిత్రబృందం నుంచి ఇంతవరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని సమాచారం. ముఖ్యంగా రామ్ బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ అఖండ సినిమాతో బోయపాటి ఖాతాలో భారీ హిట్ వచ్చి చేరింది. ఆ తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment