Pariniti Chopra
-
క్రికెటర్‌గా స్టార్ హీరోయిన్ భర్త.. బౌలింగ్‌లో అదుర్స్.. ఎవరో గుర్తుపట్టారా?
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుగ గ్రాండ్‌గా జరిగింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ ఉన్న వీరిద్దరు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు. అయితే హీరోయిన్ భర్త కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే. క్రికెట్లో మంచి బౌలర్ కూడా. తాజాగా ఆయన ఓ దేశవాళీ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనురాగ్ ఠాకూర్ బ్యాటింగ్ చేస్తుండగా తన స్పిన్ బౌలింగ్‌తో అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశాడు. కాగా.. ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ వర్సెస్ రాజ్యసభ ఛైర్మన్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.మాల్దీవుస్‌లో వెడ్డింగ్ డే..గతంలోనే ఈ జంట మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు ఈ జంట. తన భర్త రాఘవ్‌తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీరిద్దరూ మాల్దీవుస్‌లో తమ మొదటి పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. -
నన్ను పెళ్లి చేసుకుంటారా? స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్
గత మూడేళ్లుగా బాలీవుడ్ బ్యూటీలంతా వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కత్రీనా కైఫ్, ఆలియా భట్, కియారా అద్వానీ ఇలా పెళ్లి పీటలు ఎక్కి బ్యాచ్‌లర్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పారు. వారంతా పెళ్లి బాట పట్టడంతో తనకు కూడా వివాహం చేసుకోవాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది మరో బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ పరిణితి చోప్రా. ప్రియాంక చోప్రా సోదరిగా బి-టౌన్లో అడుగు పెట్టిన ఈ పంజాబీ భామ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. చదవండి: అంతర్జాతీయ వేదికపై ఆసక్తికర సంఘటన, స్టేజ్‌పైనే చరణ్‌కు క్షమాపణలు చెప్పిన నటి ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన ఆమెకు తన రిలేషన్‌పై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నేను ఇంకా సింగిల్‌గానే ఉన్నాను. త్వరలోనే మింగిల్ అవ్వాలని ఆసక్తిగా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్లో జరుగుతున్న పెళ్లిళ్లు, వారి ఫొటోలు చూస్తుంటే నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది. ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన ఆలియా భట్, కియారా అద్వానీ, అతియా శెట్టిలంతా నా స్నేహితులే. చదవండి: అంబర్ పేట్ ఘటన: రష్మీని కుక్కతో పోల్చిన నెటిజన్, ఆమె రియాక్షన్ చూశారా? వారిని చూస్తుంటే నాకూ కూడా తొందరగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలనిపిస్తోంది. కానీ, అందుకు వరుడు కావాలి కదా. ప్రస్తుతం నేను ఏ రిలేషన్లో లేను. ఇంతకాలం ప్రేమించాకే పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. కానీ, ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా’ అని చెప్పుకొచ్చిది. అనంతరం ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ ‘నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చూడండి’ అంటూ సరదగా ఓపెన్ కామెంట్స్ చేసింది ఆమె. -
పాన్ ఇండియాగా రామ్ మూవీ.. హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ !
Ram Pothineni In Boyapati Srinu Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ 'అఖండ' చిత్రంతో మాసివ్ హిట్ కొట్టాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ జోష్‌తో మరో మాస్ యాక్షన్ సినిమాను తెరకెక్కించనున్నాడు బోయపాటి. ఉస్తాద్ హీరో రామ్‌తో కలిసి తన 10వ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. అలాగే రామ్ కెరీర్లో 20వ సినిమాగా ఈ చిత్రం రూపొందడం విశేషం. ఈ సినిమాను శ్రీనివాస్ చుట్టూరి నిర్మించగా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. రామ్ సినీ కెరీర్లో పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ మూవీ కోసం బోయపాటి భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ కోసం బాలీవుడ్ భామను తీసుకోనున్నారట. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హిందీ హీరోయిన్ అయితే మార్కెట్ కూడా కలిసివస్తుందని మేకర్స్ అంచనా. అందుకే ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రాను తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే బోయపాటి పరిణితీ చోప్రాను సంప్రదించాడని, ఆమె పాజిటివ్‌గా స్పందించినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే సౌత్ నుంచి కూడా మరో ఇద్దరు నటులను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. -
పాత్రలా మారిపోవాలని
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నైహ్వాల్ బయోపిక్ సిద్ధం అవుతోంది. సైనా పాత్రలో పరిణీతీ చోప్రా నటించనున్నారు. సైనా పాత్ర కోసం రోజుకి రెండుగంటల పాటు బ్యాడ్మింటన్ సాధన చేస్తున్నారు పరిణీతి. సైనాను కలసి ఆమె ఆలోచనలు, హావభావాలను తెలుసుకుంటున్నారు. ఇప్పుడు సైనా నెహ్వాల్ ఇంటిని సందర్శించనున్నారు పరిణీతి. ‘‘ఈ సినిమా కోసం సైనా పాత్రను కేవలం పోషించడం కాదు పూర్తిగా సైనాలా మారిపోవాలనుకుంటున్నాను. వాళ్ల ఇంటికి వెళ్లి తన రోజువారీ జీవితం ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. నేనొస్తున్నానని ప్రత్యేకంగా ఏం వంటలు తయారు చేయొద్దని, రోజూ వాళ్లు తినే భోజనాన్ని నాకు వడ్డించమని సైనా ఫ్యామిలీని కోరాను’’ అని పరిణీతి తెలిపారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి అమోల్ గుప్తా దర్శకత్వం వహించనున్నారు. -
ఆ ఒత్తిడి వల్లే తగ్గా!
‘బొద్దుగా లడ్డూలా ఉన్నావ్.. ఏం తింటున్నావో ఏంటో.. తినడమే పనిగా పెట్టుకున్నావా ఏంటి?’ అని పరిణీతి చోప్రాను మొహం మీదే అడిగినవాళ్లు చాలామందే ఉన్నారు. ఆ రేంజ్లో ఉండేవారామె. తొలి చిత్రం ‘ఇషక్‌జాదె’లో కూడా బొద్దుగానే కనిపించారు. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాల్లో కూడా పాత తరం నాయికలా నిండైన బుగ్గలతో పుష్టిగా ఉండేవారు. దాంతో విమర్శలపాలయ్యారు. ఇక లాభం లేదనుకుని, పరిణీతి తగ్గారు. ఇప్పుడీ స్లిమ్ బ్యూటీకి ప్రశంసలే ప్రశంసలు. అవునూ.. అసలెందుకు తగ్గాలనిపించింది? అనే ప్రశ్న పరిణీతి ముందుంచితే - ‘‘హీరోయిన్ కాకపోయి ఉంటే ఎప్పటికీ తగ్గేదాన్ని కాదేమో. ‘లావుగా ఉన్నావ్.. సన్నబడకపోతే సినిమాలు రావు’ అని అందరూ ఒత్తిడి చేయడంవల్ల తగ్గాను. నేనిప్పుడింత స్లిమ్‌గా ఉన్నానంటే ఆ ఘనత హిందీ పరిశ్రమకే దక్కుతుంది’’ అని చెప్పారు. తగ్గాక చాలామంది తనను ఆదర్శంగా తీసుకుంటున్నారని పరిణీతి చెబుతూ - ‘‘ఈ మధ్య షాపింగ్ మాల్స్‌లో, ఎయిర్‌పోర్ట్‌లో నేను కనిపిస్తే చాలు అమ్మాయిలు చుట్టుముట్టేస్తున్నారు. ముఖ్యంగా లావుగా ఉన్న అమ్మాయిలు ‘భలే తగ్గారే. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మేమూ తగ్గుతాం’ అంటుంటే వినడానికి ఆనందంగా ఉంది’’ అన్నారు. -
అంతగా నచ్చింది మరి!
‘సల్మాన్‌ఖాన్ బ్యానర్లో నటించే అవకాశం మిస్ అయిందట కదా... ఏడ్వక ఏంచేస్తుంది!’ అనుకోవద్దు. పరిణీతి చోప్రా ఏడ్చింది నిజంగా అందుకు కాదు. అంతకుముందే ఆమె ‘మసాన్’ సినిమా చూసింది. సినిమా చూస్తున్నప్పుడు భావోద్వేగానికి లోనై గట్టిగా ఏడ్చేసింది. పక్క సీటు వాళ్లు సినిమా చూడడం మాని, పరిణీతిని ఊరడించడానికే తమ సమయాన్ని కేటాయించారట. కొందరైతే ‘ఇదెక్కడి గోలరా బాబు’ అని వెనక సీట్లోకి పారిపోయారట. ‘‘ఎవరినీ డిస్టర్బ్ చేయడానికి నేను ఏడవలేదు. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను... ఆ సినిమా చూసి ఏడవకుండా ఎవరూ ఉండలేరు’’ అని చెప్పింది పరిణీతి. అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను అందుకున్న ‘మసాన్’ సినిమా పరిణీతిని ఎంతో ఆకట్టుకుందట. అందుకే ‘‘ఈ సినిమాను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూడాలి’’ అని అందరితోనూ చెబుతోంది. మ్యాటర్ అక్కడితో ఆగిపోలేదు... తాజా విషయం ఏమిటంటే ఈ సినిమా దర్శకుడు నీరజ్ గైవాన్ను పరిణీతి పొగడ్తలతో ముంచెత్తిందట. అంతేకాదు... ‘‘మీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో నాకు అవకాశం ఇవ్వండి. ఎంత చిన్న పాత్ర అయినా చేస్తాను’’ అని నోరు విప్పి అడిగిందట. అటు నుంచి ఎలాంటి రిప్లై వచ్చిందనేది తరువాత విషయంగానీ... భావోద్వేగంలో పూర్తిగా మునిగిపోవడం వల్లే పరిణీతి ఆ మాట అన్నదని, నిజానికి పాత్ర, పారితోషికం విషయంలో ఎలాంటి రాజీ పడదని ఆమె గురించి తెలిసినవాళ్లు చాటుమాటుగా అంటున్నారు. వింటున్నారా నీరజ్! -
అందరిలోకీ నేనే హాట్!
‘‘ఎంత మంది కథానాయికలు నాకు పోటీగా రానీయండి. నేను భయపడను. ఎందుకంటే... వారందరిలోకీ నేనే హాట్’’ అంటూ కరీనాకపూర్ ఆత్మవిశ్వాసం వెలిబుచ్చారు. ప్రముఖ పాప్ గాయకుడు యోయో హనీసింగ్ రూపొందించిన ‘అటా మజా సటక్లీ’ అనే ప్రొమోషనల్ సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆ పాటకు కరీనా హాట్ స్టెప్పులతో అదరహో అనిపించి ఆ కార్యక్రమానికి కొత్త శోభ తెచ్చిపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో... ‘దీపిక, కత్రినాకైఫ్ - వీరిద్దరే ఇప్పటిదాకా మీకు పోటీ అనుకున్నారు. కానీ అలియా భట్, శ్రద్ధాకపూర్, పరిణీతి చోప్రా... ఇలా కొత్త అందాలు వచ్చేశాయి. మీకు భయంగా లేదా?’ అని అడిగితే, ‘‘ఎందుకు భయం.. నాకు పెళ్లయ్యింది. 33 ఏళ్లు వచ్చేశాయి. అయినా సరే నేను భయపడను, ఫీల్ అవ్వను. ఎందుకంటే... ఎన్ని కొత్త అందాలు వచ్చినా... వారందరిలో నేనే హాట్. ఇది మితిమీరిన విశ్వాసంతో చెబుతున్న మాట కాదు. ఆత్మ విశ్వాసంతో చెబుతున్న మాట. మీకేమైనా సందేహం ఉంటే... ఈ నెల 15న విడుదలవుతున్న ‘సింగమ్ రిటర్న్స్’ పాటలు చూడండి. నా మాటలో నిజం ఎంత ఉందో మీకే తెలుస్తుంది’’ అని కరీనా చెప్పారు.