
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నైహ్వాల్ బయోపిక్ సిద్ధం అవుతోంది. సైనా పాత్రలో పరిణీతీ చోప్రా నటించనున్నారు. సైనా పాత్ర కోసం రోజుకి రెండుగంటల పాటు బ్యాడ్మింటన్ సాధన చేస్తున్నారు పరిణీతి. సైనాను కలసి ఆమె ఆలోచనలు, హావభావాలను తెలుసుకుంటున్నారు. ఇప్పుడు సైనా నెహ్వాల్ ఇంటిని సందర్శించనున్నారు పరిణీతి. ‘‘ఈ సినిమా కోసం సైనా పాత్రను కేవలం పోషించడం కాదు పూర్తిగా సైనాలా మారిపోవాలనుకుంటున్నాను. వాళ్ల ఇంటికి వెళ్లి తన రోజువారీ జీవితం ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. నేనొస్తున్నానని ప్రత్యేకంగా ఏం వంటలు తయారు చేయొద్దని, రోజూ వాళ్లు తినే భోజనాన్ని నాకు వడ్డించమని సైనా ఫ్యామిలీని కోరాను’’ అని పరిణీతి తెలిపారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి అమోల్ గుప్తా దర్శకత్వం వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment