అందరిలోకీ నేనే హాట్! | Kareena Kapoor in ata maja satakli | Sakshi
Sakshi News home page

అందరిలోకీ నేనే హాట్!

Aug 13 2014 10:27 PM | Updated on Sep 2 2017 11:50 AM

అందరిలోకీ నేనే హాట్!

అందరిలోకీ నేనే హాట్!

ఎంత మంది కథానాయికలు నాకు పోటీగా రానీయండి. నేను భయపడను. ఎందుకంటే... వారందరిలోకీ నేనే హాట్’’ అంటూ కరీనాకపూర్ ఆత్మవిశ్వాసం వెలిబుచ్చారు.

 ‘‘ఎంత మంది కథానాయికలు నాకు పోటీగా రానీయండి. నేను భయపడను. ఎందుకంటే... వారందరిలోకీ నేనే హాట్’’ అంటూ కరీనాకపూర్ ఆత్మవిశ్వాసం వెలిబుచ్చారు. ప్రముఖ పాప్ గాయకుడు యోయో హనీసింగ్ రూపొందించిన ‘అటా మజా సటక్‌లీ’ అనే ప్రొమోషనల్ సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆ పాటకు కరీనా హాట్ స్టెప్పులతో అదరహో అనిపించి ఆ కార్యక్రమానికి కొత్త శోభ తెచ్చిపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో... ‘దీపిక, కత్రినాకైఫ్ - వీరిద్దరే ఇప్పటిదాకా మీకు పోటీ అనుకున్నారు.
 
  కానీ అలియా భట్, శ్రద్ధాకపూర్, పరిణీతి చోప్రా... ఇలా కొత్త అందాలు వచ్చేశాయి. మీకు భయంగా లేదా?’ అని అడిగితే, ‘‘ఎందుకు భయం.. నాకు పెళ్లయ్యింది. 33 ఏళ్లు వచ్చేశాయి. అయినా సరే నేను భయపడను, ఫీల్ అవ్వను. ఎందుకంటే... ఎన్ని కొత్త అందాలు వచ్చినా... వారందరిలో నేనే హాట్. ఇది మితిమీరిన విశ్వాసంతో చెబుతున్న మాట కాదు. ఆత్మ విశ్వాసంతో చెబుతున్న మాట. మీకేమైనా సందేహం ఉంటే... ఈ నెల 15న విడుదలవుతున్న ‘సింగమ్ రిటర్న్స్’ పాటలు చూడండి. నా మాటలో నిజం ఎంత ఉందో మీకే తెలుస్తుంది’’ అని కరీనా చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement