పెళ్లి కన్నా ఆస్కార్ ముఖ్యం: ఆలియా | What Marriage is for Most Girls, An Oscar is For Me : Alia Bhatt | Sakshi
Sakshi News home page

పెళ్లి కన్నా ఆస్కార్ ముఖ్యం: ఆలియా

Published Sat, Jun 4 2016 11:16 AM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

పెళ్లి కన్నా ఆస్కార్ ముఖ్యం: ఆలియా

పెళ్లి కన్నా ఆస్కార్ ముఖ్యం: ఆలియా

స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన క్యూట్ బ్యూటీ ఆలియా భట్. సోషల్ మీడియాలో ఆమె జనరల్ నాలెడ్జి మీద వచ్చే జోకులు అన్నీ ఇన్నీ కావు. ఆ విషయంలో బుర్ర శుద్ధ శూన్యమే అయినా మాటలు మాత్రం బాగానే చెబుతుంది. ప్రస్తుతం రిలీజ్కు రెడీగా ఉన్న ఉడ్తా పంజాబ్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది ఈ భామ. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాక్యలు చేసింది అలియా.

'కొంతమంది అమ్మాయిలకు జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం పెళ్లి.. నాకు మాత్రం అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఆస్కార్ సాధిచటం' అంటోంది ఆలియా. ఉడ్తా పంజాబ్ సినిమాలో బీహారీ వలస కూలీగా నటించిన ఆలియా.. తన పాత్రకు మంచి ప్రశంసలు దక్కుతాయన్న నమ్మకంతో ఉంది. ఆలియాతో పాటు షాహిద్ కపూర్. కరీనా కపూర్లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈసినిమాకు అభిషేక్ చౌబే దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement