udtha punjab
-
ఉడ్తా పంజాబ్ కానివ్వం
బొమ్మనహళ్లి: రాష్ట్రంలో చాపకింద నీరులా సాగుతున్న డ్రగ్స్ దందా అసెంబ్లీలో ప్రతిధ్వనించింది. బెంగళూరుతో పాటు రాష్ట్రంలో కఠిన చట్టాలను అమలు చేయడం ద్వారా మత్తు పదార్థాల రవాణా, అమ్మకాలకు అడ్డుకట్ట వేస్తామని, రాజధాని నగరంగా ఉన్న బెంగళూరును ‘ఉడ్తా పంజాబ్’ మాదిరి డ్రగ్స్‌కు అవకాశమివ్వబోమని ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర్ అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగామంగళవారం విధాన పరిషత్‌లో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు డ్రగ్స్ బెడదపై గళమెత్తారు. దీనికి డీసీఎం సమాధానమిస్తూ.. గంజాయి, హఫిమ్ లాంటి మత్తు పదార్థాలు ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు సాగుతున్నాయి. బెంగళూరులోని పాఠశాలలు, కళాశాలలతో పాటు జనం రద్దీగా ఉన్నచోట మత్తు పదార్థాల విక్రయాలు కొనసాగుతున్నాయని కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా కరావళి ప్రాంతల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని అన్నారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలను అడ్డుకోవడం కోసం హోంశాఖ ఆధ్వ ర్యంలో కఠిన చర్యలను చేపట్టడం ద్వారా అడ్డుకట్ట వేస్తున్నామని తెలిపారు. బెంగళూరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉడ్తా పంజాబ్ కావడానికి అవకాశమివ్వమన్నారు. బెంగళూరులో డ్రగ్స్ చాక్లెట్ల అమ్మకాలు బెంగళూరులోని విజయనగరలో ఓ ప్రవేట్ పాఠశాల వద్ద విద్యార్థులకు చాక్లెట్లలో మత్తు పదార్థాలను ఉంచి అందజేస్తున్నట్లు కేసులు నమోదైనట్లు పరమేశ్వర్ తెలిపారు. ఇక్కడ విద్యార్థులకు మొదటి మూడు నాలుగు రోజుల పాటు రుచికరమైన చాక్లెట్లను ఇచ్చిన తరువాత, మత్తు పదార్థాలను కలిపిన చాక్లెట్లను అందిస్తున్నారని తెలిసిందని చెప్పారు. ఇలాంటి కేసులను మఫ్టీలో ఉన్న పోలీసులు ఛేదించడం జరిగిందని అన్నారు. మత్తు పదార్థాలను విక్రయిస్తున్న వారి పైన సుమారు 55 కేసులు నమోదు చేసినట్లు, గంజాయి, చర‹స్, ఓపిఎం అమ్మకాలకు సంబంధించి సుమారు 5 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మెడికల్ షాపుల్లో మత్తుగా బెంగళూరుతో పాటు ఇతర నగరాల్లో కొంతమంది మెడికల్ షాపుల్లో మత్తు పదార్థాలను, డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్లు తెలిసిందని అన్నారు. ఇలాంటివి సుమారు 182 కేసులు నమోదు కాగా అందులో 142 కేసుల్లో శిక్ష పడటం జరిగిందన్నారు. 40 కేసులను కొట్టివేసినట్లు. మిగిలిన కేసులు విచారణ దశలో ఉన్నాయని తెలిపారు. -
పెళ్లి కన్నా ఆస్కార్ ముఖ్యం: ఆలియా
స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన క్యూట్ బ్యూటీ ఆలియా భట్. సోషల్ మీడియాలో ఆమె జనరల్ నాలెడ్జి మీద వచ్చే జోకులు అన్నీ ఇన్నీ కావు. ఆ విషయంలో బుర్ర శుద్ధ శూన్యమే అయినా మాటలు మాత్రం బాగానే చెబుతుంది. ప్రస్తుతం రిలీజ్‌కు రెడీగా ఉన్న ఉడ్తా పంజాబ్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది ఈ భామ. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాక్యలు చేసింది అలియా. 'కొంతమంది అమ్మాయిలకు జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం పెళ్లి.. నాకు మాత్రం అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఆస్కార్ సాధిచటం' అంటోంది ఆలియా. ఉడ్తా పంజాబ్ సినిమాలో బీహారీ వలస కూలీగా నటించిన ఆలియా.. తన పాత్రకు మంచి ప్రశంసలు దక్కుతాయన్న నమ్మకంతో ఉంది. ఆలియాతో పాటు షాహిద్ కపూర్. కరీనా కపూర్లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈసినిమాకు అభిషేక్ చౌబే దర్శకుడు. -
'త్వరలో అన్ని విషయాలు తెలుస్తాయి'
షాహిద్ కపూర్, కరీనా కపూర్, అలియా భట్ ప్రధానపాత్రల్లో కనిపించనున్న థ్రిల్లర్ మూవీ ఉడ్తా పంజాబ్. ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ సమస్యలు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. అభిషేక్ చౌబే దర్శకత్వం వహించిన ఈ మూవీని ఎవరూ బాన్ చేయలేదని, కేవలం సెన్సార్ బోర్డు సభ్యులు తమకు క్లియరెన్స్ సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వడానికి నిరాకరించారని వదంతులపై ఉత్తా పంజాబ్ నిర్మాతలలో ఒకరైన అనురాగ్ కశ్యప్ ఇప్పటికే స్పందించారు. సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వస్తుందని, అంతా మంచి జరగుతుందని అలియా భట్ ఆశాభావం వ్యక్తం చేసింది. చివరికి అంతా ఒకే అవుతుంది, సినిమా యూనిట్ సంతోషంగా ఉండబోతుందని పేర్కొంది. మూవీలో 40 సీన్లకు కత్తెర పడనుందా అన్న ప్రశ్నపై ఆమె స్పందించింది. ఇందులో ఏ తప్పులేదని, వాస్తవంగా జరుగుతున్న విషయాలే మా మూవీలో సీన్లుగా మారాయని చెప్పింది. అందరూ చూసి నవ్వుతున్నారు.. అందుకే ప్రస్తుతం తాను నవ్వాల్సి వస్తోందని, అయితే త్వరలోనే మీ అందరి ప్రశ్నలకు 'ఉడ్తా పంజాబ్' సమాధానమిస్తుందని అభిప్రాయపడుతోంది. పంజాబ్‌లో జరుగుతున్న డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. షాహిద్ కపూర్ డ్రగ్ అడిక్ట్ అయిన పాప్ సింగర్‌గా నటించాడు. ఇప్పటికీ సెన్సార్ పూర్తి కాకపోయినా జూన్ 17న సినిమా రిలీజ్ అంటూ చిత్ర యూనిట్ ప్రకటించేసింది. -
'మా సినిమాను బ్యాన్ చేయలేదు'
షాహిద్ కపూర్, కరీనా కపూర్, అలియా భట్ లు లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లేటెస్ట్ బాలీవుడ్ థ్రిల్లర్ మూవీ ఉడ్తా పంజాబ్. పంజాబ్‌లో జరుగుతున్న డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. సెన్సార్ బోర్డ్ సినిమాను సర్టిఫై చేయడానికి అంగీకరించటం లేదని, అసలు పూర్తిగా సినిమాను బ్యాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర సహనిర్మాత అనురాగ్ కశ్యప్, నిర్మాణ సంస్థ బాలాజీ మోషన్ పిక్చర్స్ క్లారిటీ ఇచ్చాయి. తమ సినిమాను బ్యాన్ చేయలేదని, ఎగ్జామినింగ్ కమిటీలో సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వాలన్న విషయంలో అభిప్రాయాభేదాలు వచ్చాయని, ప్రస్తుతం సినిమా రివైజింగ్ కమిటీ ముందు ఉందని, త్వరలోనే సినిమాపై ప్రకటన వస్తుందని తెలిపారు. అభిషేక్ చౌబే దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో షాహిద్ కపూర్ పాత్ర అసభ్యకర డైలాగ్‌లు ఉన్నాయన్న కారణంతో సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదు. -
'ప్లీజ్.. మూవీపై అలా ప్రచారం చేయవద్దు'
షాహిద్ కపూర్, కరీనా కపూర్ ఒకేతెరపై కనిపించనున్న థ్రిల్లర్ మూవీ ఉడ్తా పంజాబ్. అలియా భట్ మరో ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ సమస్యలు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. అభిషేక్ చౌబే దర్శకత్వం వహించిన ఈ మూవీపై నిషేధం విధించారని వస్తున్న వదంతులపై ఉత్తా పంజాబ్ నిర్మాతలలో ఒకరైన అనురాగ్ కశ్యప్ స్పందించారు. ఆ మూవీపై ఎవరూ బాన్ చేయలేదని, కేవలం సెన్సార్ బోర్డు సభ్యులు తమకు క్లియరెన్స్ సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వడానికి నిరాకరించారని ట్వీట్ చేశారు. షూటింగ్ పూర్తిచేసుకుని చాలా రోజులు అయిన ఈ సినిమాకు సర్టిఫికేట్ కోసం అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు. దయచేసి ఈ సినిమాపై నిషేదం విధించారని వదంతులను మాత్రం ప్రచారం చేయవద్దని అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు. సినిమాలో డైలాగుల్లో ఎక్కువగా అసభ్యపదాలు ఉన్నాయని సెన్సార్ బోర్డ్ భావించిందని, ఆ సీన్లను కొంతవరకు కట్ చేస్తే సర్టిఫికేట్ ఇచ్చేందుకు వారు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. చిత్ర యూనిట్ మాత్రం ఏ సర్టిఫికెట్ ఇచ్చినా పర్వాలేదు. డైలాగ్స్ మాత్రం కట్ చేసే ఉద్దేశమే లేనట్లు కనిపిస్తోంది.. పంజాబ్‌లో జరుగుతున్న డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. షాహిద్ కపూర్ డ్రగ్ అడిక్ట్ అయిన పాప్ సింగర్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు సెన్సార్ పూర్తి కాకపోయినా జూన్ 17న సినిమా రిలీజ్ అంటూ చిత్ర యూనిట్ ప్రకటించేసింది. For the record ,"Udta Punjab" is not banned. The examining committe has deferred the decision to Revising and due process is on. — Anurag Kashyap (@anuragkashyap72) 28 May 2016 A film is banned only when examining, revising and FCAT all three refuse certificate . And then you fight it out in Supreme Court — Anurag Kashyap (@anuragkashyap72) 28 May 2016 -
షాహిద్ సినిమాకు సెన్సార్ కష్టాలు
ఒకప్పటి బాలీవుడ్ హాట్ పెయిర్ షాహిద్ కపూర్, కరీనా కపూర్ జంటగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ఉడ్తా పంజాబ్. అలియా భట్ మరో ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ సమస్యలు ఎదుర్కొంటోంది. షూటింగ్ పూర్తిచేసుకొని చాలా రోజులు అయిన ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ సభ్యులు అంగీకరించటం లేదు. సినిమాలో డైలాగుల్లో ఎక్కువగా అసభ్యపదాలు ఉన్నాయన్న సెన్సార్ బోర్డ్, వాటిని కొంతవరకు కట్ చేస్తే సర్టిఫికేట్ ఇచ్చేందుకు సిద్ధం అంటున్నారు. చిత్రయూనిట్ మాత్రం ఏ సర్టిఫికెట్ ఇచ్చినా పర్వాలేదు. డైలాగ్స్ మాత్రం కట్ చేయమంటున్నారు. పంజాబ్‌లో జరుగుతున్న డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. షాహిద్ కపూర్ డ్రగ్ అడిక్ట్ అయిన పాప్ సింగర్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ చౌబే దర్శకుడు. ఇప్పటి వరకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి కాకపోయినా జూన్ 17న సినిమా రిలీజ్ అంటూ ప్రకటించేశారు చిత్రయూనిట్.