బొమ్మనహళ్లి: రాష్ట్రంలో చాపకింద నీరులా సాగుతున్న డ్రగ్స్ దందా అసెంబ్లీలో ప్రతిధ్వనించింది. బెంగళూరుతో పాటు రాష్ట్రంలో కఠిన చట్టాలను అమలు చేయడం ద్వారా మత్తు పదార్థాల రవాణా, అమ్మకాలకు అడ్డుకట్ట వేస్తామని, రాజధాని నగరంగా ఉన్న బెంగళూరును ‘ఉడ్తా పంజాబ్’ మాదిరి డ్రగ్స్‌కు అవకాశమివ్వబోమని ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర్ అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగామంగళవారం విధాన పరిషత్‌లో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు డ్రగ్స్ బెడదపై గళమెత్తారు.
దీనికి డీసీఎం సమాధానమిస్తూ.. గంజాయి, హఫిమ్ లాంటి మత్తు పదార్థాలు ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు సాగుతున్నాయి. బెంగళూరులోని పాఠశాలలు, కళాశాలలతో పాటు జనం రద్దీగా ఉన్నచోట మత్తు పదార్థాల విక్రయాలు కొనసాగుతున్నాయని కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా కరావళి ప్రాంతల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని అన్నారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలను అడ్డుకోవడం కోసం హోంశాఖ ఆధ్వ ర్యంలో కఠిన చర్యలను చేపట్టడం ద్వారా అడ్డుకట్ట వేస్తున్నామని తెలిపారు. బెంగళూరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉడ్తా పంజాబ్ కావడానికి అవకాశమివ్వమన్నారు.
బెంగళూరులో డ్రగ్స్ చాక్లెట్ల అమ్మకాలు
బెంగళూరులోని విజయనగరలో ఓ ప్రవేట్ పాఠశాల వద్ద విద్యార్థులకు చాక్లెట్లలో మత్తు పదార్థాలను ఉంచి అందజేస్తున్నట్లు కేసులు నమోదైనట్లు పరమేశ్వర్ తెలిపారు. ఇక్కడ విద్యార్థులకు మొదటి మూడు నాలుగు రోజుల పాటు రుచికరమైన చాక్లెట్లను ఇచ్చిన తరువాత, మత్తు పదార్థాలను కలిపిన చాక్లెట్లను అందిస్తున్నారని తెలిసిందని చెప్పారు. ఇలాంటి కేసులను మఫ్టీలో ఉన్న పోలీసులు ఛేదించడం జరిగిందని అన్నారు. మత్తు పదార్థాలను విక్రయిస్తున్న వారి పైన సుమారు 55 కేసులు నమోదు చేసినట్లు, గంజాయి, చర‹స్, ఓపిఎం అమ్మకాలకు సంబంధించి సుమారు 5 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
మెడికల్ షాపుల్లో మత్తుగా
బెంగళూరుతో పాటు ఇతర నగరాల్లో కొంతమంది మెడికల్ షాపుల్లో మత్తు పదార్థాలను, డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్లు తెలిసిందని అన్నారు. ఇలాంటివి సుమారు 182 కేసులు నమోదు కాగా అందులో 142 కేసుల్లో శిక్ష పడటం జరిగిందన్నారు. 40 కేసులను కొట్టివేసినట్లు. మిగిలిన కేసులు విచారణ దశలో ఉన్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment