కర్ణాటక అసెంబ్లీలో మతమార్పిడి నిరోధక బిల్లు | Karnataka Government Introduce Anti Conversion Bill in Assembly | Sakshi
Sakshi News home page

కర్ణాటక అసెంబ్లీలో మతమార్పిడి నిరోధక బిల్లు

Published Tue, Dec 21 2021 5:39 PM | Last Updated on Tue, Dec 21 2021 6:00 PM

Karnataka Government Introduce Anti Conversion Bill in Assembly - Sakshi

బెంగళూరు: మతమార్పిడి నిరోధక ముసాయిదా బిల్లును కర్ణాటక ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర.. కర్ణాటక మత స్వేచ్ఛ పరిరక్షణ హక్కు 2021 బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై రేపు(బుధవారం) చర్చ జరుగుతుందని స్పీకర్‌ ప్రకటించారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేసింది. కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్.. బిల్లు ప్రతులను సభలోనే చించేసి నిరసన తెలిపారు. (చదవండి: నాకు జీవం లేదు.. 4 రోజుల క్రితమే చనిపోయాను)

కాగా, ఈ బిల్లుకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని మంత్రిమండలి సోమవారం ఆమోదం తెలిపింది.  సామూహిక మత మార్పిడికి పాల్పడే వారికి 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించే నిబంధన ఇందులో ఉంది.  షెడ్యూల్డ్ కులం నుంచి మైనారిటీగా మారితే.. గతంలో అనుభవించిన రిజర్వేషన్‌లతో సహా ప్రభుత్వ ప్రయోజనాలను కోల్పోతారు. ‘లవ్‌ జిహాద్‌’ను అడ్డుకునేందుకే బీజేపీ సర్కారు ఈ బిల్లు తెచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఆమోదం పొందకుండా బిల్లును అడ్డుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. (చదవండి: కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement