'త్వరలో అన్ని విషయాలు తెలుస్తాయి' | I am sure you will have a lot of questions answered soon, says Alia Bhatt | Sakshi
Sakshi News home page

'త్వరలో అన్ని విషయాలు తెలుస్తాయి'

Published Sun, May 29 2016 8:43 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

'త్వరలో అన్ని విషయాలు తెలుస్తాయి' - Sakshi

'త్వరలో అన్ని విషయాలు తెలుస్తాయి'

షాహిద్ కపూర్, కరీనా కపూర్, అలియా భట్ ప్రధానపాత్రల్లో కనిపించనున్న థ్రిల్లర్ మూవీ ఉడ్తా పంజాబ్. ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ సమస్యలు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. అభిషేక్ చౌబే దర్శకత్వం వహించిన ఈ మూవీని ఎవరూ బాన్ చేయలేదని, కేవలం సెన్సార్ బోర్డు సభ్యులు తమకు క్లియరెన్స్ సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వడానికి నిరాకరించారని వదంతులపై ఉత్తా పంజాబ్ నిర్మాతలలో ఒకరైన అనురాగ్ కశ్యప్ ఇప్పటికే స్పందించారు. సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వస్తుందని, అంతా మంచి జరగుతుందని అలియా భట్ ఆశాభావం వ్యక్తం చేసింది.

చివరికి అంతా ఒకే అవుతుంది, సినిమా యూనిట్ సంతోషంగా ఉండబోతుందని పేర్కొంది. మూవీలో 40 సీన్లకు కత్తెర పడనుందా అన్న ప్రశ్నపై ఆమె స్పందించింది. ఇందులో ఏ తప్పులేదని, వాస్తవంగా జరుగుతున్న విషయాలే మా మూవీలో సీన్లుగా మారాయని చెప్పింది. అందరూ చూసి నవ్వుతున్నారు.. అందుకే ప్రస్తుతం తాను నవ్వాల్సి వస్తోందని, అయితే త్వరలోనే మీ అందరి ప్రశ్నలకు 'ఉడ్తా పంజాబ్' సమాధానమిస్తుందని అభిప్రాయపడుతోంది. పంజాబ్లో జరుగుతున్న డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. షాహిద్ కపూర్ డ్రగ్ అడిక్ట్ అయిన పాప్ సింగర్గా నటించాడు. ఇప్పటికీ సెన్సార్ పూర్తి కాకపోయినా జూన్ 17న సినిమా రిలీజ్ అంటూ చిత్ర యూనిట్ ప్రకటించేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement