షాహిద్ సినిమాకు సెన్సార్ కష్టాలు | censor problems to shahids udtha punjab | Sakshi
Sakshi News home page

షాహిద్ సినిమాకు సెన్సార్ కష్టాలు

Published Fri, May 27 2016 3:45 PM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM

షాహిద్ సినిమాకు సెన్సార్ కష్టాలు

షాహిద్ సినిమాకు సెన్సార్ కష్టాలు

ఒకప్పటి బాలీవుడ్ హాట్ పెయిర్ షాహిద్ కపూర్, కరీనా కపూర్ జంటగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ఉడ్తా పంజాబ్. అలియా భట్ మరో ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ సమస్యలు ఎదుర్కొంటోంది.  షూటింగ్ పూర్తిచేసుకొని చాలా రోజులు అయిన ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ సభ్యులు అంగీకరించటం లేదు.

సినిమాలో డైలాగుల్లో ఎక్కువగా అసభ్యపదాలు ఉన్నాయన్న సెన్సార్ బోర్డ్, వాటిని కొంతవరకు కట్ చేస్తే సర్టిఫికేట్ ఇచ్చేందుకు సిద్ధం అంటున్నారు. చిత్రయూనిట్ మాత్రం ఏ సర్టిఫికెట్ ఇచ్చినా పర్వాలేదు. డైలాగ్స్ మాత్రం కట్ చేయమంటున్నారు. పంజాబ్లో జరుగుతున్న డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

షాహిద్ కపూర్ డ్రగ్ అడిక్ట్ అయిన పాప్ సింగర్గా నటిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ చౌబే దర్శకుడు. ఇప్పటి వరకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి కాకపోయినా జూన్ 17న సినిమా రిలీజ్ అంటూ ప్రకటించేశారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement