'ప్లీజ్.. మూవీపై అలా ప్రచారం చేయవద్దు'
షాహిద్ కపూర్, కరీనా కపూర్ ఒకేతెరపై కనిపించనున్న థ్రిల్లర్ మూవీ ఉడ్తా పంజాబ్. అలియా భట్ మరో ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ సమస్యలు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. అభిషేక్ చౌబే దర్శకత్వం వహించిన ఈ మూవీపై నిషేధం విధించారని వస్తున్న వదంతులపై ఉత్తా పంజాబ్ నిర్మాతలలో ఒకరైన అనురాగ్ కశ్యప్ స్పందించారు. ఆ మూవీపై ఎవరూ బాన్ చేయలేదని, కేవలం సెన్సార్ బోర్డు సభ్యులు తమకు క్లియరెన్స్ సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వడానికి నిరాకరించారని ట్వీట్ చేశారు. షూటింగ్ పూర్తిచేసుకుని చాలా రోజులు అయిన ఈ సినిమాకు సర్టిఫికేట్ కోసం అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు.
దయచేసి ఈ సినిమాపై నిషేదం విధించారని వదంతులను మాత్రం ప్రచారం చేయవద్దని అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు. సినిమాలో డైలాగుల్లో ఎక్కువగా అసభ్యపదాలు ఉన్నాయని సెన్సార్ బోర్డ్ భావించిందని, ఆ సీన్లను కొంతవరకు కట్ చేస్తే సర్టిఫికేట్ ఇచ్చేందుకు వారు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. చిత్ర యూనిట్ మాత్రం ఏ సర్టిఫికెట్ ఇచ్చినా పర్వాలేదు. డైలాగ్స్ మాత్రం కట్ చేసే ఉద్దేశమే లేనట్లు కనిపిస్తోంది.. పంజాబ్లో జరుగుతున్న డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. షాహిద్ కపూర్ డ్రగ్ అడిక్ట్ అయిన పాప్ సింగర్గా నటిస్తున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు సెన్సార్ పూర్తి కాకపోయినా జూన్ 17న సినిమా రిలీజ్ అంటూ చిత్ర యూనిట్ ప్రకటించేసింది.
For the record ,"Udta Punjab" is not banned. The examining committe has deferred the decision to Revising and due process is on.
— Anurag Kashyap (@anuragkashyap72) 28 May 2016
A film is banned only when examining, revising and FCAT all three refuse certificate . And then you fight it out in Supreme Court
— Anurag Kashyap (@anuragkashyap72) 28 May 2016