Actress Parineeti Chopra Shares Her Relationship Status - Sakshi
Sakshi News home page

Actress Parineeti Chopra: నన్ను పెళ్లి చేసుకుంటారా? స్టార్‌ హీరోయిన్‌ ఓపెన్‌ కామెంట్స్‌

Published Sat, Feb 25 2023 2:35 PM | Last Updated on Sat, Feb 25 2023 3:20 PM

Actress Parineeti Chopra About Her Relationship Status and Marriage - Sakshi

గత మూడేళ్లుగా బాలీవుడ్‌ బ్యూటీలంతా వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కత్రీనా కైఫ్‌, ఆలియా భట్‌, కియారా అద్వానీ ఇలా పెళ్లి పీటలు ఎక్కి బ్యాచ్‌లర్‌ లైఫ్‌కి గుడ్‌బై చెప్పారు. వారంతా పెళ్లి బాట పట్టడంతో తనకు కూడా వివాహం చేసుకోవాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది మరో బాలీవుడ్‌ బ్యూటీ, స్టార్‌ హీరోయిన్‌ పరిణితి చోప్రా. ప్రియాంక చోప్రా సోదరిగా బి-టౌన్‌లో అడుగు పెట్టిన ఈ పంజాబీ భామ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది.

చదవండి: అంతర్జాతీయ వేదికపై ఆసక్తికర సంఘటన, స్టేజ్‌పైనే చరణ్‌కు క్షమాపణలు చెప్పిన నటి

ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించిన ఆమెకు తన రిలేషన్‌పై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నేను ఇంకా సింగిల్‌గానే ఉన్నాను. త్వరలోనే మింగిల్‌ అవ్వాలని ఆసక్తిగా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో జరుగుతున్న పెళ్లిళ్లు, వారి ఫొటోలు చూస్తుంటే నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది. ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన ఆలియా భట్‌, కియారా అద్వానీ, అతియా శెట్టిలంతా నా స్నేహితులే.

చదవండి: అంబర్‌ పేట్‌ ఘటన: రష్మీని కుక్కతో పోల్చిన నెటిజన్‌, ఆమె రియాక్షన్‌ చూశారా?

వారిని చూస్తుంటే నాకూ కూడా తొందరగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలనిపిస్తోంది. కానీ, అందుకు వరుడు కావాలి కదా. ప్రస్తుతం నేను ఏ రిలేషన్‌లో లేను. ఇంతకాలం ప్రేమించాకే పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. కానీ, ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా’ అని చెప్పుకొచ్చిది. అనంతరం ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ ‘నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చూడండి’ అంటూ సరదగా ఓపెన్‌ కామెంట్స్‌ చేసింది ఆమె.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement