పలావ్ దగ్గర నుంచి బిర్యానీ వంటి వంటకాలకు కావాల్సింది బాస్మతి రైస్. పండుగలకు, వేడుకలకు వంటకాల్లో వాడే రైస్ ఇది. ఈ రైస్ అంటే ప్రతి ఒక్క భారతీయుడికి అత్యంతి ఇష్టం. పైగా ఖరీదు కూడా ఎక్కువే. అలాంటి సుగంధభరితమైన బాస్మతి ప్రపంచంలోనే అత్యత్తమ బియ్యంగా టైటిల్‌ని దక్కించుకని జాబితాలో తొలిస్థానం దక్కించుకుంది. ఆ బాస్మతి బియ్యం భారత్‌కి ఎలా వచ్చింది?. దానికి ఆ పేరు ఎలా వచ్చింది? తదితర ఆసక్తికర విషయాల గురించి చూద్దామా!.
ప్రముఖ ఫుడ్ గ్రేడ్ అయిన అట్లాస్ 2023-24 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యుత్తమ బియంగా జాబితా విడుదల చేసింది. అందులో బాస్మతి బియ్యం అగ్ర స్థానంలో ఉంది. ఇటలీకి చెందిన ఆర్బోరియో రెండో స్థానంలో, పోర్చుగల్‌కు చెందిన కరోలినా రైస్ మూడో స్థానంలో ఉన్నాయి. బాస్మతి వాసన, రుచి, పెద్ద గింజరు ఉన్నప్పటికీ ఇది గ్లూటెన్ రహితంగా ఉంటుంది. భారతీయ బాస్మతిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. పులావ్ నుంచి బిర్యానీ వరకు భారతదేశంలోని ప్రతి వ్యక్తి మొదటి ఎంపిక బాస్మతి బియ్యం. దీన్ని భారతదేశంలోనే కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా పండిస్తుంటారు.
బాస్మతి బియ్యం అనేది భారత్‌కు పెట్టింది పేరు. ఒక్క భారత్‌లో 34 రకాల బాస్మతి బియ్యాన్ని పండిస్తారు. వీటిని విత్తనాల చట్టం కింద 1966లో నోటిఫై చేశారు. ఆ రకాల్లో బాస్మతి 217, బాస్మతి 370, టైప్ 3 (డెహ్రాడూని బాస్మతి) పంజాబ్, బాస్మతి 1 (బౌని బాస్మతి), పూసా బాస్మతి 1, కస్తూరి, హర్యానా బాస్మతి 1, మహి సుగంధ, తారావోరి బాస్మతి (HBC 19 / కర్నాల్ లోకల్), రణబీర్ బాస్మతి, బాస్మతి 386 తదితరలు ఉన్నాయి. అంతేగాదు సౌదీ అరబ్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, యెమెన్ రిపబ్లిక్ వంటి దేశాలకు భారతదేశం బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసే ప్రధాన సంస్థ అని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) పేర్కొంది.
బాస్మతి చరిత్ర..
బాస్మతి రైస్‌ను హిమాలయాల దిగువ ప్రాంతంలోని ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు. పురాతన కాలంలో కూడా బాస్మతిని పండించినట్లు చరిత్ర చెబుతోంది. ఆహారంపై రాసిన ఆరోమాటిక్ రైసెస్ అనే పుస్తకంలో హరప్పా, మొహెంజోదారో తవ్వకాల్లో కూడా దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయని చెబుతుంది. పర్షియన్ వ్యాపారులు భారత దేశానికి వచ్చినప్పుడు తమ వెంట అనేకరకాల సుగంధ బియ్యం తెచ్చుకున్నారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. పెర్షియన్ వ్యాపారులు వ్యాపారం కోసం భారతదేశానికి చేరుకున్నప్పుడు, వారు తమతో పాటు అనేక రకాల సుగంధ బియ్యాన్ని తీసుకువచ్చారని చరిత్ర చెబుతుంది.
ఈ రైస్‌ని సువాసనల రాణి అని కూడా..
సంస్కృత పదాలు వాస్, మయాప్ నుంచి బాస్మతి పేరు వచ్చింది. వాస్ అంటే సువాసన. మయాప్ అంటే లోతు. అయితే ఇందులో వాడిన మతి అనే పదానికి రాణి అనే అర్థం కూడా ఉంది. అందుకే దీనిని సువాసనల రాణిగా పిలుస్తారు.
ఎలా గుర్తిస్తారంటే..
బాస్మతి ఎక్స్‌పోర్టు డెవలప్‌మెంట్ ఫౌండేషన్ బాస్మతి బియ్యం అసలైందో కాదో నిర్ణయిస్తుంది. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీప్రకారం 6.61 మి.మీ పొడవు. 2 మి.మీ మందంగా ఉండే బియ్యాన్ని బాస్మతిగా గుర్తించింది.
(చదవండి: భారత్‌లో 5% మేర పేదరికం తగ్గుతోంది!)
Comments
Please login to add a commentAdd a comment