basmati rice
-
బియ్యం ధరలు పైపైకి.. వారంలోనే 15% పెరుగుదల
మార్కెట్లో బియ్యం ధరలు చూస్తే గుండె గుభిల్లుమంటోంది. రోజురోజుకీ సన్న బియ్యం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలులేని అన్ సీజన్లోనూ గతంలో ఎన్నడూ లేనివిధంగా బియ్యం ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కూరగాయలు, వంటనూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న పరిస్థితుల్లో బియ్యం ధరలు ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.కేవలం వారం రోజుల్లో దేశంలో బియ్యం ధరలు దాదాపు 10-15 శాతం వరకు పెరిగాయి. ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. బియ్యం ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. ప్రపంచ బియ్యం మార్కెట్లో భారత్ వాటా 45 శాతం వరకు ఉంటుంది. భారత్ నుంచి ప్రధానంగా ఇరాన్, సౌదీ అరేబియా, చైనా, యూఏఈ, ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతి అవుతుంది. అయితే, బాస్మతీయేతర బియ్యంపై ఎగుమతులపై సుంకాన్ని కేంద్రం మినహాయించడంతో పాటు పారాబాయిల్డ్ బియ్యంపై సుంకాన్ని 20 శాతానికి పెంచింది. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై ఆంక్షలను తొలగించడంతో పాటు పారాబాయిల్డ్ బియ్యంపై సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తూ సెప్టెంబర్ 28న కేంద్రం నిర్ణయం తీసుకుంది.కేంద్రం నిర్ణయంతో భారత్ నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతులు జోరందుకున్నాయి. దీంతో దేశంలో వారం వ్యవధిలోనే బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆఫ్రికాకు ఎక్కువగా ఎగుమతయ్యే స్వర్ణ రకం బియ్యం ఇంతకుముందు రూ.35 కిలో ఉండగా ఇప్పుడు రూ.41కి పెరిగింది. బాస్మతి బియ్యం మినహా మిగతా అన్ని రకాల బియ్యం ధరలు 10-15 శాతం పెరిగాయని బియ్యం ఎగుమతిదారులు చెప్తున్నారు. -
వాహ్.. బాస్మతి!
సాక్షి హైదరాబాద్: ఒక్కప్పుడు నవాబులు, ధనికుల ఇళ్లల్లో బాస్మతి బియ్యం వినియోగించేవారు. ఇప్పుడు ధరలు అందుబాటులోకి రావడంతో దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు బాస్మతిని వినియోగిస్తున్నారు. నాడు బిర్యానీకే పరిమితంకాగా, ఇప్పుడు అన్ని రకాల వంటకాల్లో వినియోగిస్తున్నారు. మొదటి రకం సాధారణ బియ్యం కిలో ధర దాదాపు రూ. 70–80 ఉంది. అదే బాస్మతి హోల్‌సేల్ ధర కూడా దాదాపు అంతే. దీంతో నగరంలో బాస్మతి బియ్యం వినియోగం ఎక్కువైంది. గతంలో బిర్యానీ కోసం బాస్మతిని తప్పక వాడేవారు. కానీ, నేడు బగారా, పల్వా, లెమన్, కిచిడి, జీరా రైస్‌తోపాటు అన్ని రకాల వంటకాల్లో బాస్మతిని వినియోగిస్తున్నారు. ఉత్తరాది పంటకు నగరంలో ఆదరణ ధరలు తగ్గడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల మార్కెట్లకు భారీ ఎత్తున బాస్మతి బియ్యం దిగుమతి అవుతోంది. బాస్మతి వరి పండే ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరానికి భారీగా దిగుమతులు పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు. బేగంబజార్, కిషన్‌గంజ్, ఉస్మాన్‌గంజ్ టోకు మార్కెట్లు ఈ బియ్యం అమ్మకాలకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. స్టార్ హోటళ్లు, ఇతర బిర్యానీ హోటళ్లన్నీ కూడా బాస్మతిని ఈ మార్కెట్ల నుంచే కొనుగోలు చేస్తుంటారని వ్యాపారులు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 60 వేల క్వింటాళ్ల సాధారణ బియ్యం వినియోగం అవుతుండగా, ఇందులో బాస్మతి బియ్యం దాదాపు 12 వేల క్వింటాళ్ల వరకూ ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈసారి బాస్మతి ఉత్పత్తి భారీగా ఉండడంతో నగరానికి సరఫరా పెరిగింది. రిటైల్ మార్కెట్లో స్టీమ్ కేజీ బాస్మతి బియ్యం రూ.50 నుంచి రూ.65 వరకు లభిస్తున్నాయి. అదే రా బాస్మతి బియ్యం మొదటి రకం రూ.80–110 వరకు ధర పలుకుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో పండే బాస్మతి వినియోగం ఢిల్లీ తప్ప ఇతర రాష్ట్రాల్లో తక్కువ. దక్షిణాది రాష్ట్రాలకు హైదరాబాద్ బాస్మతికి హబ్‌గా మారింది. దేశంలో ఢిల్లీ తరువాత గ్రేటర్‌లోనే ఎక్కువ వినయోగం ఉందని బేగంబజార్ వ్యాపారులు చెబుతున్నారు.సాధారణ బియ్యం ధరకే బాస్మతి బాస్మతి ఎక్కువగా పంజాబ్‌లో పండిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బియ్యం వినియోగం తక్కువ.. హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్. దీంతో హైదరాబాద్‌లో వినియోగం ఎక్కువ. మరోవైపు బాస్మతిని బిర్యానీలో తప్పక వినియోగిస్తారు. అయితే కోవిడ్ తరువాత బాస్మతి ఎగుమతులు అంతగా లేవు. దీంతో ధరలు చాలా కిందికి దిగి వచ్చాయి. సాధారణ బియ్యం ధరలకే బాస్మతి మార్కెట్లో లభిస్తోంది. – రాజ్‌కుమార్ ఠాండన్, కశ్మీర్‌హౌస్ నిర్వాహకుడు, బేగంబజార్ -
బియ్యం.. మరింత ప్రియం
సాక్షి, హైదరాబాద్: బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేతతో సన్నబియ్యం ధరలు మరింత ప్రియం కాబోతున్నాయి. ప్రస్తుతం అధికంగా వినియోగించే సన్న బియ్యం రకాలైన సోనా మసూరి, హెచ్ఎంటీ, జైశ్రీరాం, బీపీటీ రకాలు, తెలంగాణ సోనా వంటి మేలిమి బియ్యం ధరలు ఏకంగా కిలో రూ. 60 నుంచి రూ. 70కి చేరుకున్నాయి. బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తూ, కనీస ఎగుమతి ధరను విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) శుక్రవారమే నోటిఫికేషన్ విడుదల చేసింది.పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం), బ్రౌన్ రైస్‌పై ఎగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే సన్నరకాలు భారీ ఎత్తున విదేశాలకు ఎగుమతి అయ్యే అవకాశముంది. అమెరికాతో పాటు బంగ్లాదేశ్, యూరోప్ వంటి 140 దేశాలకు భారత్ నుంచి బియ్యం ఎగుమతులు పెరుగుతాయి. ఈ ప్రభావం దేశీయ బియ్యం మార్కెట్‌పై పడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది జూలైలో బియ్యంపై సర్కార్ ఆంక్షలు2022–23లో ధాన్యం ఉత్పత్తి కొంత తగ్గింది. అదే సమయంలో విదేశాల్లో బియ్యం డిమాండ్ పెరిగి, దేశీయంగా బియ్యం ధరలు భారీగా పెరిగే పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం గత సంవత్సరం జూలైలో బాస్మతీయేతర తెల్ల బియ్యం, నూకల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం), బ్రౌన్ రైస్‌లపై ఎగుమతి సుంకాన్ని 20 శాతం విధించింది. భారత్ నుంచి బియ్యం ఎగుమతి ఆగిపోవడంతో థాయ్‌లాండ్, వియత్నాం, పాకిస్తాన్ల నుంచి ఎగుమతులు పెరిగాయి. అయితే భారత్‌లో ఉత్పత్తి అయిన బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కేంద్రం నిర్ణయంతో ఒక్కసారిగా దేశీయ బియ్యం ఎగుమతులు పెరుగుతాయని భావిస్తున్నారు. -
ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యంగా మన బాస్మతి రైస్!
పలావ్ దగ్గర నుంచి బిర్యానీ వంటి వంటకాలకు కావాల్సింది బాస్మతి రైస్. పండుగలకు, వేడుకలకు వంటకాల్లో వాడే రైస్ ఇది. ఈ రైస్ అంటే ప్రతి ఒక్క భారతీయుడికి అత్యంతి ఇష్టం. పైగా ఖరీదు కూడా ఎక్కువే. అలాంటి సుగంధభరితమైన బాస్మతి ప్రపంచంలోనే అత్యత్తమ బియ్యంగా టైటిల్‌ని దక్కించుకని జాబితాలో తొలిస్థానం దక్కించుకుంది. ఆ బాస్మతి బియ్యం భారత్‌కి ఎలా వచ్చింది?. దానికి ఆ పేరు ఎలా వచ్చింది? తదితర ఆసక్తికర విషయాల గురించి చూద్దామా!. ప్రముఖ ఫుడ్ గ్రేడ్ అయిన అట్లాస్ 2023-24 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యుత్తమ బియంగా జాబితా విడుదల చేసింది. అందులో బాస్మతి బియ్యం అగ్ర స్థానంలో ఉంది. ఇటలీకి చెందిన ఆర్బోరియో రెండో స్థానంలో, పోర్చుగల్‌కు చెందిన కరోలినా రైస్ మూడో స్థానంలో ఉన్నాయి. బాస్మతి వాసన, రుచి, పెద్ద గింజరు ఉన్నప్పటికీ ఇది గ్లూటెన్ రహితంగా ఉంటుంది. భారతీయ బాస్మతిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. పులావ్ నుంచి బిర్యానీ వరకు భారతదేశంలోని ప్రతి వ్యక్తి మొదటి ఎంపిక బాస్మతి బియ్యం. దీన్ని భారతదేశంలోనే కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా పండిస్తుంటారు. బాస్మతి బియ్యం అనేది భారత్‌కు పెట్టింది పేరు. ఒక్క భారత్‌లో 34 రకాల బాస్మతి బియ్యాన్ని పండిస్తారు. వీటిని విత్తనాల చట్టం కింద 1966లో నోటిఫై చేశారు. ఆ రకాల్లో బాస్మతి 217, బాస్మతి 370, టైప్ 3 (డెహ్రాడూని బాస్మతి) పంజాబ్, బాస్మతి 1 (బౌని బాస్మతి), పూసా బాస్మతి 1, కస్తూరి, హర్యానా బాస్మతి 1, మహి సుగంధ, తారావోరి బాస్మతి (HBC 19 / కర్నాల్ లోకల్), రణబీర్ బాస్మతి, బాస్మతి 386 తదితరలు ఉన్నాయి. అంతేగాదు సౌదీ అరబ్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, యెమెన్ రిపబ్లిక్ వంటి దేశాలకు భారతదేశం బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసే ప్రధాన సంస్థ అని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) పేర్కొంది. బాస్మతి చరిత్ర.. బాస్మతి రైస్‌ను హిమాలయాల దిగువ ప్రాంతంలోని ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు. పురాతన కాలంలో కూడా బాస్మతిని పండించినట్లు చరిత్ర చెబుతోంది. ఆహారంపై రాసిన ఆరోమాటిక్ రైసెస్ అనే పుస్తకంలో హరప్పా, మొహెంజోదారో తవ్వకాల్లో కూడా దీనికి సంబంధించిన ఆధారాలు లభించాయని చెబుతుంది. పర్షియన్ వ్యాపారులు భారత దేశానికి వచ్చినప్పుడు తమ వెంట అనేకరకాల సుగంధ బియ్యం తెచ్చుకున్నారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. పెర్షియన్ వ్యాపారులు వ్యాపారం కోసం భారతదేశానికి చేరుకున్నప్పుడు, వారు తమతో పాటు అనేక రకాల సుగంధ బియ్యాన్ని తీసుకువచ్చారని చరిత్ర చెబుతుంది. ఈ రైస్‌ని సువాసనల రాణి అని కూడా.. సంస్కృత పదాలు వాస్, మయాప్ నుంచి బాస్మతి పేరు వచ్చింది. వాస్ అంటే సువాసన. మయాప్ అంటే లోతు. అయితే ఇందులో వాడిన మతి అనే పదానికి రాణి అనే అర్థం కూడా ఉంది. అందుకే దీనిని సువాసనల రాణిగా పిలుస్తారు. ఎలా గుర్తిస్తారంటే.. బాస్మతి ఎక్స్‌పోర్టు డెవలప్మెంట్ ఫౌండేషన్ బాస్మతి బియ్యం అసలైందో కాదో నిర్ణయిస్తుంది. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీప్రకారం 6.61 మి.మీ పొడవు. 2 మి.మీ మందంగా ఉండే బియ్యాన్ని బాస్మతిగా గుర్తించింది. (చదవండి: భారత్‌లో 5% మేర పేదరికం తగ్గుతోంది!) -
ఇండియన్ ఫుడ్‌కు భారీ డిమాండ్.. భారత్‌ను వేడుకుంటున్న దేశాలు
భారతీయ ఆహార ఉత్పత్తులకు బయటి దేశాల్లో భారీ డిమాండ్ ఉంటోంది. అందుకు అనుగుణంగా దిగుమతులకు వీలు కల్పించాలని ఆయా దేశాలు భారత్‌ను వేడుకుంటున్నాయి. భారత్ నుంచి చికెన్, డైరీ, బాస్మతి రైస్, ఆక్వా, గోధుమ ఉత్పత్తులకు మధ్యప్రాచ్య దేశాలలో భారీ డిమాండ్ ఉందని యుఏఈ ఆహార పరిశ్రమ తెలిపింది. వీటి దిగుమతుల కోసం భారత ప్రభుత్వ మద్దతును కోరుతోంది. అగ్రికల్చరల్ & ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA) సమన్వయంతో ధ్రువీకరణ ప్రక్రియలు సజావుగా జరిగేలా సహకరించాలని యూఏఈ ఆహార పరిశ్రమ భారత్‌ను కోరింది. బహ్రెయిన్, కువైట్, సుల్తానేట్ ఆఫ్ ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) వంటి దేశాలలో ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి భారత ఉత్పత్తుల అధిక నాణ్యత ప్యాకేజింగ్ సహాయపడుతుందని పేర్కొంటోంది. ఇటీవల యూఏఈలో పర్యటించిన భారత వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అక్కడి దిగుమతిదారులతో వివరణాత్మక చర్చలు జరిపారు. భారత్ నుంచి ఎగుమతులను పెంచే మార్గాలపై చర్చించారు. ఈ దేశాలలో ఫ్రోజెన్ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి భారతదేశానికి భారీ అవకాశాలు ఉన్నాయని గ్లోబల్ ఫుడ్ ఇండస్ట్రీస్ LLC సేల్స్ UAE హెడ్ నిస్సార్ తలంగర అన్నారు. బాస్మతి బియ్యానికి డిమాండ్ భారతీయ బాస్మతి బియ్యానికి డిమాండ్ ఉందని, ఈ బియ్యంపై కనీస ఎగుమతి ధర (MEP) తగ్గింపు భారత్ ఎగుమతులను పెంచడంలో సహాయపడుతుందని ఒమన్‌కు చెందిన ఖిమ్జీ రాందాస్ గ్రూప్ ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం టన్నుకు 1,200 డాలర్లుగా ఉన్న MEPని 850 డాలర్లకు తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాల నుంచి మరొక దిగుమతిదారు హలాల్ సర్టిఫికేషన్ సమస్యను లేవనెత్తారు. భారత్‌లో అత్యంత మెరుగైన హలాల్ మాంసం ధ్రువీకరణ వ్యవస్థ ఉంది. అల్లానాసన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫౌజాన్ అలవి మాట్లాడుతూ భారత్, యూఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మాంసం ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడంలో సహాయపడుతుందన్నారు. చోయిత్రమ్స్ హెడ్ (రిటైల్ ప్రొక్యూర్మెంట్) కీర్తి మేఘనాని కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఉత్పత్తుల ప్యాకేజింగ్‌పై దృష్టి పెట్టడం వల్ల యూఏఈ, ఇతర గల్ఫ్ ప్రాంత దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవడానికి భారతీయ ఎగుమతిదారులు సహాయపడతారన్నారు. యాప్‌కార్ప్ హోల్డింగ్ చైర్మన్ నితేష్ వేద్ మాట్లాడుతూ ఇక్కడ ఏపీఈడీఏ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల ఆహార పరిశ్రమకు దోహదపడుతుందని సూచించారు. GCC గ్రూప్‌కు చెందిన మరో దిగుమతిదారు మాట్లాడుతూ భారతీయ కుటీర పరిశ్రమలు తయారు చేసే ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, దీని కోసం భారతదేశం ప్రమాణాలు, ప్యాకేజింగ్, లేబులింగ్‌కు సంబంధించిన సమస్యలను చూడాల్సి ఉందని చెప్పారు. భారత్-యూఏఈ వాణిజ్య ఒప్పందం గతేడాది మేలో అమల్లోకి వచ్చింది. దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021-22లో 72.9 బిలియన్ డాలర్ల నుంచి 2022-23లో 84.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. -
బాస్మతి బియ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు..
India additional safeguards on basmati rice: బాస్మతి ముసుగులో నిషేధిత సాధారణ బియ్యం ఎగుమతులు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించి వీటి కట్టడికి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నిషేధిత కేటగిరీ కింద ఉన్న బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను నిరోధించడానికి బాస్మతి బియ్యం ఎగుమతులపై అదనపు భద్రతా నిబంధనలను ప్రవేశపెట్టింది. బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని తప్పుగా వర్గీకరించి అక్రమ ఎగుమతి చేస్తున్నట్లు విశ్వసనీయ క్షేత్ర నివేదికలు అందినట్లు ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. బాస్మతియేతర తెల్ల బియ్యాన్ని హెచ్ఎస్ కోడ్స్ ఆఫ్ పార్బాయిల్డ్ రైస్, బాస్మతి రైస్ కింద ఎగుమతి చేస్తున్న విషయాన్ని గుర్తించినట్లు పేర్కొంది. దేశీయంగా ధరలను కట్టడి చేయడానికి, ఆహార భద్రత కోసం గత జులై 20 నుంచి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని ప్రభుత్వం నిషేధించింది. కొన్ని రకాల బియ్యం ఎగుమతులపై పరిమితులు విధించినప్పటికీ, ప్రస్తుత సంవత్సరంలో బియ్యం ఎగుమతులు ఎక్కువగా ఉండటాన్ని ప్రభుత్వం గమనించింది. బాస్మతీ బియ్యం ముసుగులో బాస్మతీయేతర బియ్యం అక్రమంగా ఎగుమతి కాకుండా నిరోధించడానికి అదనపు రక్షణలను ప్రవేశపెట్టాలని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను నియంత్రించే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA)కి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టన్నుకు 1200 డాలర్లు, ఆపైన విలువ కలిగిన బాస్మతి బియ్యం ఎగుమతుల కాంట్రాక్టులకు మాత్రమే రిజిస్ట్రేషన్ కమ్ అల్లోకేషన్ సర్టిఫికేట్ (RCAC) జారీకి నమోదు చేయాలని ఏపీఈడీఏకి ప్రభుత్వం సూచించింది. ఇక టన్నుకు 1200 డాలర్ల కంటే తక్కువ విలువ కలిగిన కాంట్రాక్ట్రులను నిలిపేయవచ్చని, అలాగే వాటి పరిశీలనకు ఏపీఈడీఏ చైర్మన్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయవచ్చని సూచనలు చేసింది. ఇదీ చదవండి: రేట్లు పెంచాల్సి ఉంటుంది.. ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు -
ఆస్ట్రేలియాలో బియ్యం కొసం క్యూ కడుతున్న భారతీయులు
-
స‘లక్ష’ణంగా త్రివర్ణ శోభితం!
ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 5 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా రంగులు అద్ది ఔరా అనిపిస్తున్నాడు. పొడవైన బాసుమతి రకం బియ్యాన్ని ఎంచుకుని వాటికి రంగులు దిద్ది.. వాటిని చార్టులపై అంటించాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పురోహితుడు పెద్దింటి రామచంద్రశ్రీహరి(రామం). గతంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెలా 15 రోజుల్లో 3 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా రంగులను అద్ది రికార్డు సృష్టించాడు. తాజాగా సుమారు రెండు నెలల్లో 5 లక్షల బియ్యం గింజలపై రంగులు అద్దడం ద్వారా తన రికార్డును తానే బ్రేక్ చేసినట్టు చెబుతున్నాడు. ఇప్పటికే ఈ అంశం పలు రికార్డు సంస్థల దృష్టికి వెళ్లినట్టు తెలిపాడు. -
బాస్మతీ బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: విరిగిన బియ్యంసహా ఆర్గానిక్ నాన్-బాస్మతీ బియ్యం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం మంగళవారం ఎత్తివేసింది. ఈ ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహానికి దోహదపడే చర్య ఇది. దేశీయంగా లభ్యత పెంపు లక్ష్యంగా సెప్టెంబర్ తొలి రోజుల్లో బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. రిటైల్ మార్కెట్లలో ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయ సరఫరాలను మెరుగుపరచే లక్ష్యంతో బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకాన్ని కూడా విధించింది. ఆర్గానిక్ నాన్-బాస్మతీ రైస్, ఆర్గానిక్ నాన్-బాస్మతీ బ్రోకెన్ రైస్ ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఒక ప్రకటనలో తెలిపింది. వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య బియ్యం ఎగుమతుల విలువ 5.5 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 9.7 బిలియన్ డాలర్లు. సరైన చర్య... ‘‘భారత్ ఏటా 10,000-15000 టన్నుల సేంద్రీయ బియ్యాన్ని (బాస్మతి, బాస్మతీయేతర) ఎగుమతి చేస్తుంది. గత 4–5 ఏళ్లలో ఆర్గానిక్ బాస్మతి, నాన్ బాస్మతి బియ్యం ఎగుమతులు వేగంగా వృద్ధి చెందాయి. నిషేధం ఎత్తివేస్తూ, ప్రభుత్వం సరైన చర్య తీసుకుంది’’ అని ప్రభుత్వ ప్రకటనపై ఆల్ ఇండియా రైస్ ఎగుమతిదారుల సంఘం మాజీ అధ్యక్షుడు విజయ్ సెటియా వ్యాఖ్యానించారు. -
Recipes: బాస్మతి బియ్యంతో ఘీ రైస్.. కార్న్‌ఫ్లోర్‌తో పనీర్ జిలేబీ! తయారీ ఇలా
Ghee Rice, Paneer Jalebi Recipes In Telugu: ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారికి వివిధ రకాల వంటకాలను నైవేద్యాలుగా పెడుతుంటాము. ఈ దసరాకు ఏటా పెట్టే వాటితోపాటు ఎంతో రుచికరమైన ఈ కింది నైవేద్యాలను కూడా అమ్మవారికి సమర్పించి మరింత ప్రసన్నం చేసుకుందాం.. ఘీ రైస్ కావలసినవి: ►బాస్మతి బియ్యం – కప్పు ►నెయ్యి – రెండున్నర టేబుల్ స్పూన్లు ►బిర్యానీ ఆకు – ఒకటి ►యాలకులు – రెండు ►లవంగాలు – రెండు ►దాల్చిన చెక్క – అంగుళం ముక్క ►అనాస పువ్వు – ఒకటి ►మరాటి మొగ్గ – ఒకటి ►జీలకర్ర – టీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా ►జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూను ►పచ్చిబఠాణీ – అరకప్పు ►స్వీట్ కార్న్ – అరకప్పు ►పచ్చిమిర్చి – మూడు (సన్నగా తరగాలి). తయారీ: ►స్వీట్‌కార్న్, పచ్చిబఠాణీలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద బాణలి పెట్టి టేబుల్ స్పూను నెయ్యి వేయాలి. ►వేడెక్కిన నెయ్యిలో బాస్మతి బియ్యాన్ని కడిగి వేసి రెండు నిమిషాలు మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. ►ఇప్పుడు బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాసపువ్వు, మరాటి మొగ్గ, అరటీస్పూను జీలకర్ర వేసి తిప్పాలి. ►దీనిలో ఒకటిన్నర కప్పులు నీళ్లుపోసి అన్నం పొడిపొడిగా వచ్చేలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద మరో బాణలి పెట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు నెయ్యి వేయాలి. ►నెయ్యి వేగాక అరటీస్పూను జీలకర్ర, జీడిపప్పు పలుకులువేసి వేయించాలి. ►ఇవి వేగాక తరిగిన పచ్చిమిర్చి, ఉడికించిన పచ్చిబఠాణి, స్వీట్ కార్న్ వేసి మీడియం మంటమీద వేయించాలి. ►ఇప్పుడు అన్నం వేసి అన్నింటిని చక్కగా కలిసేలా కలియతిప్పి దించేయాలి. ►నెయ్యి, బాస్మతీల సువాసనలతో కాస్త ఘాటుగా, తియ్యగా ఉండే నెయ్యి అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. పనీర్ జిలేబీ కావలసినవి: ►పనీర్ ముక్కలు– అరకప్పు ►మైదా – అరకప్పు ►వంటసోడా – చిటికెడు ►కార్న్‌ఫ్లోర్ – టేబుల్ స్పూను ►ఆరెంజ్ ఫుడ్ కలర్ – పావు టీస్పూను ►పాలు – పావు కప్పు ►నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా ►పిస్తాపలుకులు – గార్నిష్‌కు తగినంత. సుగర్ సిరప్ కోసం: పంచదార – కప్పు, నీళ్లు – అరకప్పు, కుంకుమపువ్వు రేకలు – ఎనిమిది, నిమ్మరసం – రెండు చుక్కలు, యాలకులపొడి – పావు టీస్పూను. తయారీ: ►పనీర్ ముక్కలను బ్లెండర్లో వేసి పేస్టులా గ్రైండ్ చేయాలి ►పనీర్ పేస్టుని ఒక గిన్నెలో వేయాలి. ఈ గిన్నెలోనే కార్న్‌ఫ్లోర్, వంటసోడా, మైదా, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలపాలి. ►ఇప్పుడు టేబుల్ స్పూన్ చొప్పున పాలు పోసి కలుపుతూ మెత్తటి పిండి ముద్దలా కలుపుకోవాలి. ►పిండి ఎండిపోకుండా తేమగా ఉండేలా పాలు అవసరాన్ని బట్టి పోసి, కలిపి పక్కన పెట్టుకోవాలి. ►పంచదారను మందపాటి బాణలిలో వేసి నీళ్లు, నిమ్మరసం, కుంకుమ పువ్వు వేసి మీడియం మంటమీద పంచదార తీగపాకం రానివ్వాలి. ►పాకం వచ్చిన వెంటనే యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి. ►కలిపి పెట్టుకున్న పిండిముద్దను మౌల్డ్‌లో వేసుకుని నచ్చిన పరిమాణంలో జిలేబీ ఆకారంలో వేసి డీప్‌ఫ్రై చేసుకోవాలి. ►జిలేబీలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక తీసి పాకంలో వేయాలి. ►రెండు నిమిషాలు నానాక మరోవైపు తిప్పి మరో రెండు నిమిషాలు నాననిచ్చి పిస్తా పలుకులతో గార్నిష్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి. ఈ వంటకాలు ట్రై చేయండి: Papaya Halwa Recipe: మొక్కజొన్న, మైదాపిండితో.. నోరూరించే బొప్పాయి హల్వా! తయారీ ఇలా Malida Muddalu: మలీద ముద్దల తయారీ విధానం! వీటిని తింటే ఇన్ని ఆరోగ్య లాభాలా?! -
బ్రౌన్ రైస్, వైల్డ్ రైస్.. 40 వేల రకాల బియ్యాలు.. హాయిగా అన్నమే తిందాం!
Health Tips: బ్రౌన్ రైస్, హోల్ గ్రైన్ బాసుమతి రైస్, స్టీమ్డ్ బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, వైల్డ్ రైస్... ఇన్ని రకాల బియ్యాలున్నాయా! అని ఆశ్చర్యపోవద్దు. ప్రపంచవ్యాప్తంగా నలభై వేల రకాల బియ్యాలున్నాయి. వీటన్నింటికి తోడుగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల కోసం శాస్త్రవేత్తలు శోధించి, అనేక ప్రయోగాలు చేసి మరో కొత్త రకం బియ్యాన్ని పండించారు. అదే ‘లో గ్లైసిమిక్ వైట్ రైస్’. ‘తెల్లటి అన్నం తినకపోతే భోజనం చేసినట్లే ఉండదు, ఈ డయాబెటిస్ పాలిట పడి మంచి అన్నం కూడా తినలేకపోతున్నాను’ అని ఆవేదన చెందేవాళ్లకు ఈ బియ్యం మంచి పరిష్కారం. ఈ బియ్యం సగ్గుబియ్యం కొద్దిగా పొడవుగా సాగినట్లు ఉండి, ముత్యాలు రాశిపోసినట్లు ఉంటాయి. అయితే వీటి ధర కొంచెం ఎక్కువే. కేజీ నూటపాతిక వరకు ఉంటోంది. లభ్యత విరివిగా లేదు. ఎందుకంటే రైతులకు ఈ వంగడం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదింకా. సరదాగా తెలుసుకుందాం! బ్లాక్‌రైస్ ఈశాన్య రాష్ట్రాల్లో పండుతుంది. ఇప్పుడు మన దగ్గర కొందరు రైతులు ప్రయోగాత్మకంగా కొద్ది మోతాదులో పండిస్తున్నారు. ఈ బియ్యంతో వండిన అన్నం కొంచెం వగరుగా ఉంటుంది. వైల్డ్రైస్ అనే పదమే విచిత్రంగా ఉంది కదూ! నిజమే, ఇది ఎవరూ నారు పోసి నీరు పెట్టి పండించే పంట కాదు. నేటివ్ అమెరికన్లు నదుల తీరాన, కాలువల తీరాన సేకరించే బియ్యం. హోల్ బాసుమతి బియ్యం నగరాల్లో దొరుకుతోంది. ఇక బ్రౌన్‌రైస్, స్టీమ్డ్ బ్రౌన్ రైస్, రెడ్ రైస్లయితే చిన్న పట్టణాల్లో కూడా విరివిగా లభిస్తాయి. వీటిలో ఏవీ పొట్టు తీసినవి కాదు, కాబట్టి ఈ అన్నాలన్నీ ఆరోగ్యానికి మంచిదే. ప్రకృతి బియ్యం గింజలో మెత్తటి గంజిపొడిలాంటి పదార్థంతోపాటు దానిని నెమ్మదిగా జీర్ణం చేయించడానికి పీచును కూడా పై పొరగా కలిపి ఇచ్చింది. మనం రుచికి బానిసలమై ఆరోగ్యకరమైన పోషకాలు నిండిన పై పొరను తొలగించి తినడంతోనే ఈ సమస్యలన్నీ. ఇవి కూడా మంచివే! శాస్త్రవేత్తలు రూపొందించిన ‘లో గ్లైసిమిక్ వైట్ రైస్’ అందుబాటులో లేనప్పుడు మనం పైన చెప్పుకున్న బియ్యాల్లో దేనినైనా వండుకుని హాయిగా అన్నం తినవచ్చు. బ్రౌన్‌రైస్‌కి పైన ఉండే పోషకాలు, పీచుతో కూడిన పొరను తీసేసి బియ్యాన్ని తెల్లబరుస్తారు. అవే డబుల్ పాలిష్డ్ రైస్. ఆ బియ్యంలో కేవలం గంజిపొడిలాంటి భాగం మాత్రమే మిగులుతుంది. డబుల్ పాలిష్ చేసిన ఆ బియ్యంతో వండిన అన్నం తిన్నప్పుడు కార్బోహైడ్రేట్లు, కేలరీలు పెద్ద మొత్తంలో దేహానికి అందుతాయి. చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరుగుతాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్థులు అన్నం తినడం మంచిది కాదని చెబుతారు డాక్టర్లు. చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే.. -
వావ్ బాస్మతి.. బిర్యానీ రైస్‌కు భలే క్రేజ్
సాక్షి, హైదరాబాద్ : బిర్యానీ అంటేనే బాస్మతి రైస్...బాస్మతి రైస్ ఉంటేనే బిర్యానీ. చికెన్..మటన్..వెజ్..వెరైటీ ఏదైనా బాస్మతీ రైస్‌తో చేస్తేనే ఆ బిర్యానీకి ఘుమఘుమలాడే వాసన..అద్భుతమైన రుచీ వస్తుంది. ఉత్తరాదిలో పండించే ఈ రకం బియ్యానికి గ్రేటర్ వాసులు ఫిదా అవుతున్నారు. ఫంక్షన్లు, పెళ్లిళ్లు, హోటళ్లు, ఫుడ్‌సెంటర్లు, ఇళ్లల్లోని వారు రోజుకు దాదాపు 12 వేల క్వింటాళ్ల బాస్మతీ బియ్యాన్ని కొంటున్నారంటే..ఇక్కడ ఆదరణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒక్కప్పుడు నవాబులు, సంపన్నుల ఇళ్లల్లో బాస్మతిని వినియోగించే వారని చెప్పేవారు. ప్రస్తుతం ధరలు అందుబాటులోకి రావడంతో అన్ని వర్గాల ప్రజలు ఈ రైస్‌ను వంటకాల్లో వినియోగిస్తున్నారు. గతంలో బిర్యానీకే పరిమితమైన బాస్మతి బియ్యం నేడు అన్ని రకాల వంటకాల్లోనూ వినియోగిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇతర దేశాలకు ఎగుమతులు భారీగా తగ్గాయి. దీంతో సాధారణ బియ్యం ధరకే ఇక్కడ విక్రయిస్తున్నారు. వినియోగమూ ఎక్కువైంది. ఉత్తరాది పంటకు నగరంలో ఆదరణ గ్రేటర్లో వివాహాలు, వేడుకలు పెరగడంతో బాస్మతిని రికార్డు స్థాయిలో వినియోగిస్తున్నారు. ధరలు తగ్గడంతో జంటనగరాల మార్కెట్లకు భారీ ఎత్తున బాస్మతి బియ్యం దిగుమతి అవుతోంది. ప్రధాన మార్కెట్లయిన బేగంబజార్, కిషన్‌గంజ్, ఉస్మాన్‌గంజ్ టోకు మార్కెట్లు ఈ బియ్యం అమ్మకాలకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. స్టార్ హోటళ్లు, ఇతర బిర్యానీ హోటళ్ల నిర్వాహకులు ఈ మార్కెట్ల నుంచే బాస్మతి రైస్‌ను కొనుగోలు చేస్తుంటారని వ్యాపారులు అంటున్నారు. ఇక సాధారణ జనం సూపర్మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ఆన్‌లైన్‌లోనూ బాస్మతి రైస్‌ను భారీగా కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరకు లభ్యమవుతుండడంతో ఇళ్లల్లోనూ చికెన్, మటన్ బిర్యానీలకు దీన్ని వినియోగిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 60 వేల క్వింటాళ్ల సాధారణ బియ్యం వినియోగం అవుతుండగా..ఇందులో బాస్మతి బియ్యం దాదాపు 12 వేల క్వింటాళ్ల వరకూ ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈసారి బాస్మతి ఉత్పత్తి భారీగా ఉండడంతో నగరానికి సరఫరా పెరిగింది. రిటైల్ మార్కెట్లో స్టీమ్ కేజీ బాస్మతి బియ్యం రూ.50 నుంచి రూ.65 వరకు లభిస్తున్నాయి. రా బాస్మతి బియ్యం మొదటి రకం రూ.80–110 వరకు ధర పలుకుతుంది.ఉత్తరాది రాష్ట్రాల్లో పండే బాస్మతికి ఢిల్లీ తప్ప ఇతర రాష్ట్రాల్లో వినియోగం తక్కువ. దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్ నగరం బాస్మతికి హబ్‌గా మారింది. దేశంలో ఢిల్లీ తర్వాత గ్రేటర్లో ఎక్కువగా వినియోగం ఉందని బేగంబజార్ వ్యాపారులు చెబుతున్నారు. బాస్మతి ఎక్కువగా పంజాబ్‌లో పండిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ బియ్యం వినియోగం తక్కువ. హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్. దీంతో కూడా ఇక్కడ వినియోగం ఎక్కువైంది. కరోనా కారణంగా ఈ ఏడాది ఇతర దేశాలకు ఎగుమతులు అంతగాలేవు. దీంతో ధరలు చాలా తగ్గాయి. మామూలు రైస్ రేట్లకే బాస్మతి రైస్‌ను విక్రయిస్తున్నాం. – రాజ్‌కుమార్ టాండన్, కశ్మీర్ హౌస్ నిర్వాహకుడు, బేగంబజార్ -
బాస్మతి బియ్యం.. నష్టాల రుచి
లాక్‌డౌన్‌తో రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు సైతం మూతపడడం, ఫంక్షన్లు, పెళ్లిళ్లు వాయిదాపడడంతో గ్రేటర్లో బాస్మతి బియ్యం వినియోగం భారీగా త గ్గింది. దీంతో 80 శాతం విక్రయాలు పడిపోయాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. సాక్షి, సిటీబ్యూరో: గాలిలోంచి తేలియాడుతూ వచ్చే ఆ సుమధుర ఘుమఘుమల సువాసనలు ముక్కుపుటాలను సమ్మోహనపరుస్తాయి. ఆ రుచి జిహ్వను మైమరిపించేలా చేస్తుంది. నోటిలో అలా ఓ ముద్ద పెట్టుకోగానే గొంతులోంచి జారిపోవాల్సిందే. ఆ బియ్యంతో వంట ఇంటిల్లిపాదినీ.. శుభకార్యాల్లోనైతే బంధు, మిత్రులకు బ్రహ్మాండమైన విందు భోజనమే. ప్రస్తుతం ఆ రుచికి కరోనా రూపంలో అడ్డుకట్ట పడింది. బాస్మతి బియ్యానికి డిమాండ్ కరువయ్యింది. బాస్మతి బియ్యం మార్కెట్ నష్టాల రుచులను చవిచూస్తోంది. వందల కోట్ల రూపాయల మేర ఆదాయానికి గండి పడింది. 20 శాతానికి పడిపోయాయ్.. కోవిడ్‌కు ముందు గ్రేటర్ పరిధిలో రోజుకు 32 వేల క్వింటాళ్ల సాధారణ బియ్యం వినియోగమయ్యేవి. ఇందులో బాస్మతి బియ్యం దాదాపు 8వేల క్వింటాళ్ల వరకూ ఉంటుందని వ్యాపారుల అంచనా. రిటైల్ మార్కెట్లో కిలో బాస్మతి బియ్యం రూ.60 నుంచి రూ.120 వరకు ఉండేది. అనధికారిక లెక్కల ప్రకారం జంట నగరాల్లో బాస్మతి బియ్యం వ్యాపారం రోజుకు దాదాపు రూ.15కోట్లకు పైనే ఉండేది. ప్రధాన మార్కెట్లయిన బేగంబజార్, కిషన్‌గంజ్, ఉస్మాన్‌గంజ్ టోకు మార్కెట్లు బాస్మతి బియ్యం అమ్మకాలకు ప్రధాన కేంద్రాలు. ఈ ఏడాది మార్చి నుంచి కరోనా ప్రభావంతో బాస్మతి విక్రయాలు 20 శాతానికి పడిపోయాయి. మూడు నెలలుగా వివాహాది శుభకార్యాలు లేకపోవడం, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు మూతపడటంతో బిర్యానీ వంటకాలకు ఫుల్స్టాప్ పడింది. దీంతో బాస్మతి బియ్యం వినియోగం భారీ స్థాయిలో పడిపోయింది. కోలుకోలేని దెబ్బ.. కరోనా ప్రభావంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా బాస్మతి బియ్యం విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. కొంత మంది వ్యాపారులు కొనుగోలు చేసిన ధరల కంటే తక్కువకు బాస్మతి విక్రయిస్తున్నారు. నష్టాల నుంచి గట్టెక్కడానికి ఈ పరిస్థితి తప్పడంలేదు. కిరాణా రంగంలో ఇతర వస్తువులతో పోలిస్తే బాస్మతి నష్టాలు భారీగా ఉన్నాయి. – రాజ్‌కుమార్ టాండన్,కశ్మీర్ హౌస్ యజమాని, బేగం బజార్ ప్రస్తుతం..అంతంత మాత్రమే.. లాక్డౌన్ సడలింపుల అనంతరం హోటళ్లతో పాటు తక్కువ సభ్యులతో ఫంక్షన్లు ప్రారంభం కావడంతో కొంత మొత్తంలో బాస్మతి విక్రయాలు జరుగుతున్నాయి. గతంలో రోజుకు ఐదు నుంచి పది క్వింటాళ్ల బాస్మతి బియ్యం విక్రయిస్తే.. ప్రస్తుతం రెండు క్వింటాళ్లకు పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. ఉత్తరాదిలో పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో గత రెండేళ్లలో బాస్మతి ఉత్పత్తి భారీగా ఉండడంతో నగరానికి సరఫరా పెరిగింది. అలా నాణ్యతను బట్టి ధరలు కూడా కొద్దిగా తగ్గడంతో అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లోనే బాస్మతి లభించేది. అన్ని రకాల ఫంక్షన్లలో మామూలు బియ్యానికి బదులు బాస్మతి వినియోగించే వారు. దీంతోనూ నగర మార్కెట్‌కు భారీగానే వ్యాపారులు దిగుమతి చేసుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో బాస్మతి బియ్యం విక్రయాలు జరగకపోవడంతో భారీ నష్టాల్లో కూరుకుపోయామని వ్యాపారులు చెబుతున్నారు. -
బాసుమతి జొన్న!
బాసుమతి బియ్యం సువాసనకు పెట్టింది పేరు. అదేవిధంగా మరికొన్ని రకాల దేశీ వరి వంగడాలు కూడా సువాసనను వెదజల్లుతుంటాయి. అయితే, సువాసనను వెదజల్లే జొన్న వంగడం కూడా ఒకటి ఉంది! హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) కృషితో ఇది వెలుగులోకి వచ్చింది. ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ ఎం. ఇలంగోవన్ సంప్రదాయ జొన్న వంగడాలపై వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తున్న క్రమంలో మధ్యప్రదేశ్‌లో ‘బాసుమతి జొన్న’ గురించి తెలిసింది. ఛత్తర్పూర్ జిల్లా బిజావర్ సమీపంలోని కర్రి, సర్వ గ్రామాల ప్రజలు సువాసన కలిగిన జొన్న గురించి చెప్పారని డాక్టర్ ఎం. ఇలంగోవన్ తెలిపారు. దీన్ని ‘బాసుమతి జొన్న’ అని వారు పిలుస్తూ ఉన్నారు. అయితే, అప్పటికే ఇది దాదాపు అంతరించిపోయింది. అతికష్టం మీద నాలుగైదు కంకులు దొరికాయి. ఆ తర్వాత కాలంలో అదే జిల్లాలోని కటియ, కెర్వన్ గ్రామాల్లో కూడా ఈ జొన్న కనిపించింది. ఎస్.బి.బి.ఎ.డి.హెచ్.2 అనే జన్యువు సువాసనకు కారణమని పరిశోధనలో తేలిందని డాక్టర్ ఇలంగోవన్ తెలిపారు. సువాసన కలిగి ఉండే తిండి గింజలకు దేశ విదేశీ మార్కెట్లలో మంచి గిరాకీ ఉంటుందన్నారు. ఆ గ్రామాలలో కొందరు రైతులకు ఇచ్చి సాగు చేయించదలిచామని డా. ఇలంగోవన్ (elangovan @millets.res.in) ‘సాక్షి’కి చెప్పారు. ఈ వంగడం బాగా వ్యాప్తిలోకి వస్తే ఆయా గ్రామాలకు ఆదాయం కూడా సమకూరుతుంది. అంతరించిపోతున్న అరుదైన జొన్న వంగడాన్ని తిరిగి సాగులోకి తెస్తున్న ఐఐఎంఆర్‌కు జేజేలు! డా. ఇలంగోవన్ -
ఖిచడీచప్పుడు లేకుండా గుటుక్కు!
ఆకేసి పప్పేసి నెయ్యేసీ బువ్వపెట్టి... అంటూ రకరకాలు కలిపి ఆకుమీద వేశాకే అది మృష్టాన్నం అవుతుంది. కానీ ఖిచిడీ అలా కాదు... పప్పు నెయ్యి బియ్యం... ఇంకా ఎన్నెన్నో సంభారాలన్నీ కలిపి గిన్నెలో వేసేసి వండేస్తే చాలు... అన్నీ కలగలిసి అదే ఖిచిడీ అవుతుంది. ఆ ఆహారం సంపూర్ణమవుతుంది. అప్పుడే అన్నప్రాశన చేసిన పిల్లాడి నుంచి మొదలుకొని అర్జెంటుగా ఆఫీసుకెళ్లాల్సిన పెద్దాళ్ల వరకు... పచ్చడీ కూరా చెట్నీ ఉన్నా బెంగలేదు... లేకున్నా పర్వాలేదు. విడివిడిగానైనా, కలివిడిగానైనా కలుపుకోకుండానూ, కలుపుకొనైనా రుచిరుచిగా వడివడిగా తినగలిగేది ఖిచిడీ! అన్నట్టు... మామూలు ఖిచిడీలే ఎందుకు...? చూడగానే మింగాలి అనిపించే పాలక్, బెంగాలీ... తినేసి బ్రేవున త్రేన్చాలనిపించే సాబుదానా, చెనాదాల్!! వీటన్నింటినీ వండేద్దాం...! (ఖి)చడీచప్పుడూ లేకుండా గుటుక్కుమనిపిద్దాం!! రండి... ముందుగా వంట దినుసులు అందుకోండి. సాబుదానా ఖిచిడీ కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు; బంగాళ దుంపలు – 2 (మీడియం సైజువి); వేయించిన పల్లీలు – అర కప్పు; కరివేపాకు – 2 రెమ్మలు; అల్లం తురుము – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 2; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు; పంచదార – అర టీ స్పూను; నిమ్మ రసం – అర టీ స్పూను; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత. తయారీ: ►సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి, ముందు రోజు రాత్రంతా నానబెట్టాలి ►మరుసటి రోజు నీటిని వడ కట్టి సగ్గుబియ్యాన్ని పక్కనుంచాలి ►బంగాళ దుంపలను ఉడికించి, తొక్క తీసేసి, చేతితో మెత్తగా మెదపాలి ►వేయించిన పల్లీలను మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా రవ్వలా మిక్సీ పట్టాలి ►ఒక పాత్రలో సగ్గుబియ్యం, ఉడికించిన మెదిపిన బంగాళ దుంప, పంచదార, ఉప్పు వేసి కలపాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీలకర్ర వేసి వేయించాలి ►కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము జత చేసి మరోమారు వేయించాలి ►తయారుచేసి ఉంచుకున్న సగ్గు బియ్యం మిశ్రమాన్ని జత చేసి ఐదారు నిమిషాల పాటు వేయించాలి ►బాగా ఉడికిన తరువాత దింపేయాలి ∙కొత్తిమీరతో అలంకరించి ప్లేట్లలో వేడివేడిగా అందించాలి. బెంగాలీ ఖిచిడీ కావలసినవి: బాస్మతి బియ్యం – ఒక కప్పు; పొట్టు పెసర పప్పు – ఒక కప్పు; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ఏలకులు – 2; లవంగాలు – 3; బిర్యానీ ఆకు – 1; జీలకర్ర – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; టొమాటో తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4; ఉడికించిన బంగాళ దుంపలు – 2; క్యాలీఫ్లవర్ తరుగు – అర కప్పు; పచ్చి బఠాణీ – పావు కప్పు; క్యారట్ తరుగు – పావు కప్పు; పంచదార – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – 5 కప్పులు. తయారీ: ►బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి ►స్టౌ మీద పాన్‌లో పొట్టు పెసర పప్పును వేసి బంగారు రంగులోకి మారేవరకు ఆపకుండా కలుపుతూ వేయించి, దింపి చల్లారాక, తగినన్ని నీళ్లు జత చేసి బాగా కడిగి నీరు వడ కట్టేయాలి ►స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ►దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి ►అల్లం తురుము, పసుపు, మిరప కారం, ఇంగువ జత చేసి మరోమారు వేయించాలి ►టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి టొమాటో ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి ►బంగాళ దుంప తరుగు, క్యాలీఫ్లవర్ తరుగు, పచ్చి బఠాణీ జత చేసి బాగా మెత్తబడేవరకు కలుపుతుండాలి ►వేయించిన పొట్టు పెసర పప్పు జత చేసి మరోమారు వేయించాలి ►వడ కట్టిన బియ్యం జత చేయాలి ’ ఐదు కప్పుల నీళ్లు పోసి బాగా కలిపి, ఉప్పు, పంచదార జత చేసి బాగా కలియబెట్టి, మూత పెట్టాలి ’ ఉడికిన తరవాత దింపేయాలి ’ పెరుగు, అప్పడాలతో వేడివేడిగా సర్వ్ చేయాలి. పాలక్ ఖిచిడీ కావలసినవి: పాలకూర తరుగు – 2 కప్పులు; వేయించిన పల్లీలు – పావు కప్పు; పెసర పప్పు – అర కప్పు; బాస్మతి బియ్యం – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; బంగాళ దుంప తరుగు – పావు కప్పు; దాల్చిన చెక్క – చిన్న ముక్క; బిర్యానీ ఆకు – ఒకటి; లవంగాలు – 2; ఏలకులు – 2; జీలకర్ర – అర టీ స్పూను; అల్లం + వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 1; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – 4 కప్పులు. తయారీ: ►ఒక పాత్రలో బియ్యం, పెసర పప్పు వేసి శుభ్రంగా కడగాలి ►తగినన్ని నీళ్లు జత చేసి సుమారు అర గంట సేపు నానబెట్టాలి ►పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి, మిక్సీలో వేసి మెత్తగా చేసి, తీసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ►జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, ఏలకులు వేసి వేయించాలి ►బాగా వేగిన తరవాత ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు వేయించాలి ►టొమాటో తరుగు జత చేసి టొమాటో ముక్కలు మెత్తబడేవరకు వేయించాలి ►పసుపు, ఇంగువ జత చేసి మరోమారు వేయించాక, పాలకూర పేస్ట్ వేసి రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి ►నానబెట్టిన బియ్యం, పెసర పప్పు వేసి, బాగా కలిపి, నాలుగు కప్పుల నీళ్లు జత చేయాలి ►ఉప్పు కూడా వేసి బాగా కలియబెట్టి, కుకర్ మూత ఉంచాలి ►నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙ఆనియన్ రైతా, సింపుల్ వెజిటబుల్ సలాడ్‌తో వేడివేడిగా అందించాలి. ఓట్స్ ఖిచిడీ కావలసినవి: నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం తురుము – అర టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – ఒకటి; బిర్యానీ ఆకు – 1; టొమాటో తరుగు – పావు కప్పు; క్యారట్ తరుగు – పావు కప్పు; బంగాళదుంప తరుగు – పావు కప్పు; పచ్చి బఠాణీ – పావు కప్పు; పొట్టు పెసర పప్పు – అర కప్పు (శుభ్రంగా కడిగి, నీళ్లు ఒంపేయాలి); ఓట్స్ – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; నీళ్లు – రెండున్నర కప్పులు; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►స్టౌ మీద కుకర్‌లో నెయ్యి వేసి కరిగాక బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు జత చేసి కొద్దిసేపు వేయించాలి ►టొమాటో తరుగు జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ►తరిగిన కూరగాయ ముక్కలు జత చేసి బాగా కలిపి మెత్తబడే వరకు వేయించాలి ►పెసర పప్పు జత చేసి, మరోమారు వేయించాలి ►ఓట్స్ జత చేయాలి ∙పసుపు, మిరప కారం వేసి, బాగా కలిపి, రెండున్నర కప్పుల నీళ్లు జత చేయాలి ►ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి ►నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►మూత తీసి కొత్తిమీరతో అలంకరించి, రైతా లేదా ఏదైనా ఊరగాయతో వేడివేడిగా అందించాలి. (ఈ విధంగా జొన్నలు, సజ్జలు, రాగులతో కూడా తయారుచేసుకోవచ్చు) తామర గింజలు – గోధుమరవ్వ ఖిచిడీ కావలసినవి: తామర గింజలు – పావు కప్పు; గోధుమ రవ్వ – అర కప్పు.; ఉప్పు – తగినంత; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; తరిగిన పచ్చి మిర్చి – 8; కొత్తిమీర – చిన్న కట్ట; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం + వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; టొమాటో తరుగు – పావు కప్పు; జీలకర్ర – ఒక టేబుల్ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను తయారీ : ►ముందుగా రవ్వకు తగినన్ని నీళ్లు జత చేసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి ►రవ్వ వేసి బాగా కలియబెట్టి ఉడికించాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీలకర్ర వేసి చిటపటలాడించాలి ►ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి వేయించాలి ►ఉప్పు, నిమ్మ రసం జత చేయాలి ►ఒక పాత్రలో ఉడికించిన రవ్వ, వేయించిన మసాలా మిశ్రమం వేసి బాగా కలపాలి ►చివరగా తామర గింజలు జత చేసి కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి. స్వీట్ కార్న్ ఖిచిడీ కావలసినవి: స్వీట్ కార్న్ గింజలు – మూడు కప్పులు (మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టాలి) ; నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – ఒకటి ; పాలు – ఒక కప్పు; పంచదార – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – 2 టీ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి ►ఇంగువ, పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు వేయించాలి ►స్వీట్‌కార్న్ ముద్ద వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించాలి ►పాలు, పంచదార, ఉప్పు, పావు కప్పు నీళ్లు జత చేసి, సన్నని మంట మీద ఐదు నిమిషాల పాటు కార్న్ మెత్తగా అయ్యేవరకు ఉడికించి దింపేయాలి ►నిమ్మ రసం జత చేసి, కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి. సెనగ పప్పు ఖిచిడీ కావలసినవి: బాస్మతి బియ్యం – అర కప్పు; పచ్చి సెనగ పప్పు – అర కప్పు; ఇంగువ – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; నీళ్లు – ఒక కప్పు; నూనె లేదా నెయ్యి – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ►పచ్చి సెనగ పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ముందు రోజు రాత్రంతా నానబెట్టాలి లేదంటే వేడి నీళ్లలో అర గంట సేపు నానబెట్టాలి ►బియ్యాన్ని శుభ్రంగా కడిగి అర గంట సేపు నానబెట్టాలి ►కుకర్‌లో నెయ్యి వేసి కరిగాక, మిరప కారం, ఇంగువ, ఉప్పు వేసి కలపాలి ►సెనగ పప్పు జత చేసి బాగా కలిపి, ఒక కప్పుడు నీళ్లు పోసి, మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చాక దింపేయాలి (పప్పు పొడిపొడిలాడేలా ఉడికించాలి) ►బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి కొద్దిగా పొడిపొడిలా ఉండేలా ఉడికించాలి ►ఉడికించిన పదార్థాలను ఒక పాత్రలోకి తీసి కలపాలి ►ఆనియన్ రైతాతో లేదా సాంబారుతో అందిస్తే రుచిగా ఉంటుంది. నాన్–వెజ్ అవధి గోష్ కుర్మా కావల్సినవి: మటన్ ముక్కలు – 250 గ్రా.లు; దాల్చిన చెక్క – చిన్నముక్క; లవంగాలు – 6; యాలకులు – 6; చిరోంజి పప్పు – 3 టేబుల్ స్పూన్లు; బాదంపప్పు (నానబెట్టి, పొట్టు తీయాలి) – పావు కప్పు; నెయ్యి – 6 టేబుల్ స్పూన్లుక; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టీ స్పూన్; కారం – టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; గరం మసాలా – టీ స్పూన్; పచ్చిమిర్చి – 3 (సన్నగా తరగాలి); ఉల్లిపాయ తరుగు – ముప్పావు కప్పు; రోజ్ వాటర్ – టీ స్పూన్, ఉప్పు – తగినంత తయారీ: ►మటన్ ముక్కలను శుభ్రం చేసి పక్కన ఉంచాలి ►తగినన్ని నీళ్లు పోసి చిరోంజిçపప్పు, బాదంపప్పు వేసి, పది నిమిషాలు ఉడికించి, మెత్తగా నూరి పక్కన ఉంచాలి ►మందపాటి గిన్నెలో నెయ్యి వేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపాలి ►మటన్ ముక్కలు వేసి 5–6 నిమిషాలు ఉడికించాలి. దీంట్లో కప్పు టొమాటో గుజ్జు కలిపి ఉడికించి, బాదాంపప్పు మిశ్రమం, కారం, ఉప్పు, కప్పు నీళ్లు పోసి, సన్నని మంట మీద ఉడికించాలి ►చివరగా రోజ్ వాటర్, గరం మసాలా వేసి మరికొన్ని నిమిషాలు ఉంచి, మటన్ ముక్క ఉడికిందా లేదా సరిచూసుకోవాలి ►వేడి వేడిగా పులావ్ లేదా పరాటాలోకి వడ్డించాలి. రొయ్యల కూర కావల్సినవి: రొయ్యలు – పావుకేజీ; నూనె – 3 టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి – అర టీ స్పూన్; అల్లం – టీ స్పూన్; ఉల్లిపాయ – 1 (తరగాలి); పసుపు – పావు టీ స్పూన్; కరివేపాకు – రెమ్మ; ఉప్పు – తగినంత; పేస్ట్ కోసం.. జీలకర్ర – టీ స్పూన్; కొబ్బరి తరుగు పాలు – అర కప్పు; మిరియాలు – 15; కారం – టీ స్పూన్; వెనిగర్ – అర టీ స్పూన్; అల్లం – అర టీ స్పూన్; వెల్లుల్లి – అర టీ స్పూన్ తయారీ: ►ఉల్లిపాయలను, వెల్లుల్లిని గ్రైండ్ చేసి పేస్ట్ కోసం తీసుకున్న దినుసులన్నీ కలిపి మెత్తగా నూరుకోవాలి. దీంట్లో వెనిగర్ కలపాలి ►రొయ్యలను శుభ్రపరచి, కడాయిలో నూనె వేసి వేడి చేయాలి ►దీంట్లో వెల్లుల్లి వేయించి, తరిగిన ఉల్లిపాయలు వేయాలి. కరివేపాకు, నూరిన మిశ్రమం కూడా కలపాలి ►దీంట్లో రొయ్యలు వేసి 15 నిమిషాలు ఉడికించాలి. సీమకోడి వేపుడు కావల్సినవి: బోన్‌లెస్ చికెన్ – 200 గ్రాములు; అల్లం – వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు; నిమ్మకాయ – సగం ముక్క; గరం మసాలా – అర టీ స్పూన్; మొక్కజొన్న పిండి – టీ స్పూన్; కారం – టీ స్పూన్; మైదా – టీ స్పూన్; ఉప్పు – తగినంత; కరివేపాకు – రెమ్మ; నూనె – తగినంత; పసుపు – అర టీ స్పూన్ తయారీ: ►చికెన్‌ను కడిగి, వడకట్టి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నిమ్మకాయ రసం పిండి కలిపి 5 నిమిషాలు పక్కనుంచాలి. ►తర్వాత చికెన్‌లో కారం, పసుపు, గరం మసాలా, మొక్కజొన్నపిండి, మైదా.. వేసి కలపాలి. ►కడాయిలో తగినంత నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి చికెన్ ముక్కలను బాగా వేయించాలి. -
చుక్కలు చూపిస్తున్న బాస్మతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిర్యానీ రైస్‌గా ప్రాచుర్యంలో ఉన్న బాస్మతి.. సామాన్యుడికి చిక్కనంటోంది. బాస్మతి మరింత విలాస ఉత్పాదన అవుతోంది. కనీవిని ఎరుగని రీతిలో ధర దూసుకెళ్తోంది. ఏడాదిలో ధర 65 శాతం పెరిగిందని కంపెనీలు అంటున్నాయి. డిసెంబరుకల్లా మరో 10 శాతం పెరగొచ్చని అంచనా. అంతర్జాతీయంగా బాస్మతి బియ్యానికి డిమాండ్ పెరుగుతుండడం ఒక ఎత్తై.. రూపాయి విలువ పడిపోవడాన్ని ఎగుమతిదార్లు సొమ్ము చేసుకుంటున్నారు. దేశీయంగానూ వినియోగం ఎక్కువవుతుండడంతో ధర పెరుగుతూ వస్తోంది. ఇంకా విలాసమే.. మార్కెట్లో సాధారణ బియ్యమే కిలోకు మంచి రకం రూ.50 దాకా పలుకుతోంది. ఇక బాస్మతి బియ్యం వేరేగా చెప్పక్కర లేదు. అత్యధికంగా అమ్ముడవుతున్న పూస బాస్మతి 1121 రకం కొత్త పంట ఏడాది క్రితం ధర కిలోకు రూ.60 మాత్రమే. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో రూ.100 దాటింది. హైదరాబాద్ రిటైల్ మార్కెట్లో విడి బియ్యం కిలోకు రూ.120 దాకా ఉంది. బ్రాండెడ్ కంపెనీలు కిలో ప్యాక్‌లను రూ.180 వరకు విక్రయిస్తున్నాయి. కొద్ది రోజుల్లో ధర మరో 10 శాతం పెరగొచ్చని కంపెనీలు అంటున్నాయి. బిర్యానీతోపాటు ఇతర వంటకాలకు బాస్మతి వినియోగం పెరుగుతోందని రాడికల్ ఫుడ్స్ సేల్స్, మార్కెటింగ్ సీనియర్ జీఎం ఉదయ్ నాయక్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. అమ్మకాలు ఏటా 30 శాతం వద్ధి చెందుతోందని చెప్పారు. బాస్మతి ఆధారిత రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ఉత్పత్తులను ఏడాదిలో ప్రవేశపెడతామన్నారు. ధర వస్తుండడంతో.. ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాక్, కువైట్, యూకే, యూఎస్ తదితర దేశాల నుంచి ఆర్డర్లు వెల్లువలా వస్తున్నాయి. దీనికితోడు టన్ను బాస్మతి బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్లో 1,800 డాలర్ల దాకా ధర వస్తోందని పరిశ్రమ వర్గాలు సమాచారం. దీంతో బాస్మతి ప్రధానంగా పండే పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ రైతులు ఎగుమతులపై దష్టిపెట్టారు. ఉత్పత్తిలో భారత్ తర్వాతి స్థానంలో ఉన్న పాకిస్తాన్ నుంచి కొన్నేళ్లుగా ఎగుమతులు తగ్గుముఖం పడుతున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరగడం, మార్కెటింగ్ బలహీనతలు ఇందుకు కారణం. ఈ అంశాలన్నీ బాస్మతి ధరకు రెక్కలొచ్చేలా చేస్తున్నాయి. 40 లక్షల టన్నులకు.. గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో 71 లక్షల టన్నుల బాస్మతి పండిందని సమాచారం. 2013-14లో ఇది 90 లక్షల టన్నులకు ఎగబాకొచ్చని అంచనా. ఇక భారత్ నుంచి 2013-14లో బాస్మతి ఎగుమతులు గతేడాదితో పోలిస్తే 11 శాతం వద్ధితో 40 లక్షల టన్నులకు చేరుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. 2012-13లో దేశం నుంచి రూ.19,390 కోట్ల విలువైన బాస్మతి ఎగుమతులు జరిగాయి. కాగా, దేశీయ వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 32 శాతం కాగా, ఇందులో ఆంధ్రప్రదేశ్ 18 శాతం కైవసం చేసుకుంది. దేశీయంగా 25 ప్రధాన కంపెనీలు సుమారు రూ.20 వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. అసంఘటిత రంగంలో వ్యాపారం రూ.40 వేల కోట్లుంది.