
అంకిత రైనా
గ్వాలియర్: భారత టెన్నిస్ ఆశాకిరణం అంకిత రైనా మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టైటిల్ నెగ్గింది. శనివారం గ్వాలియర్‌లో ముగిసిన ఐటీఎఫ్ మహిళల టోర్నమెంట్ ఫైనల్లో అంకిత 6–2, 7–5తో సెకండ్ సీడ్ అమాన్‌డైన్ హెసీ (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. గంటా 25 నిమిషాల పాటు సాగిన పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అంకిత వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది. రెండో సెట్‌లో హెసీ నుంచి ప్రతిఘటన ఎదురైనా తుదికంటా పోరాడిన అంకిత విజేతగా నిలిచింది. 2014 డిసెంబర్‌లో చివరిసారి అంకిత పుణే ఐటీఎఫ్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో ఆరు సింగిల్స్, 12 డబుల్స్ టైటిళ్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment