ITF Womens Tournament
-
విజేత అంకిత రైనా
గ్వాలియర్: భారత టెన్నిస్ ఆశాకిరణం అంకిత రైనా మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టైటిల్ నెగ్గింది. శనివారం గ్వాలియర్‌లో ముగిసిన ఐటీఎఫ్ మహిళల టోర్నమెంట్ ఫైనల్లో అంకిత 6–2, 7–5తో సెకండ్ సీడ్ అమాన్‌డైన్ హెసీ (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. గంటా 25 నిమిషాల పాటు సాగిన పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అంకిత వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది. రెండో సెట్లో హెసీ నుంచి ప్రతిఘటన ఎదురైనా తుదికంటా పోరాడిన అంకిత విజేతగా నిలిచింది. 2014 డిసెంబర్లో చివరిసారి అంకిత పుణే ఐటీఎఫ్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో ఆరు సింగిల్స్, 12 డబుల్స్ టైటిళ్లు ఉన్నాయి. -
విజేత ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: జూనియర్ బాలికల విభాగంలో పలు టైటిల్స్ సాధించిన హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ యడ్లపల్లి ప్రాంజల సీనియర్ స్థాయిలోనూ తన సత్తా చాటుకుంది. ఈజిప్ట్‌లో ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో 18 ఏళ్ల ప్రాంజల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. 2 గంటల 48 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రాంజల 6–7 (0/7), 7–5, 6–4తో క్లెరికి (ఇటలీ)పై నెగ్గింది. సీనియర్ స్థాయిలో ప్రాంజలకిదే తొలి ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో నాలుగు ఏస్‌లు సంధించిన ప్రాంజల, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసింది. టోర్నీ మొత్తం ప్రాంజల కేవలం ఒక సెట్ మాత్రమే తన ప్రత్యర్థులకు కోల్పోవడం విశేషం.