ITF tournament
-
ఐటీఎఫ్ టోర్నీ సెమీస్‌లో సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోరీ్నలో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలోని విచిటా సిటీలో ఈ టోర్నీ జరుగుతోంది. శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సహజ 6–1, 6–1తో ఒలీవియా లిన్సెర్ (పోలాండ్)పై విజయం సాధించింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. -
విజేత అంకిత రైనా
గ్వాలియర్: భారత టెన్నిస్ ఆశాకిరణం అంకిత రైనా మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టైటిల్ నెగ్గింది. శనివారం గ్వాలియర్‌లో ముగిసిన ఐటీఎఫ్ మహిళల టోర్నమెంట్ ఫైనల్లో అంకిత 6–2, 7–5తో సెకండ్ సీడ్ అమాన్‌డైన్ హెసీ (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. గంటా 25 నిమిషాల పాటు సాగిన పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అంకిత వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది. రెండో సెట్లో హెసీ నుంచి ప్రతిఘటన ఎదురైనా తుదికంటా పోరాడిన అంకిత విజేతగా నిలిచింది. 2014 డిసెంబర్లో చివరిసారి అంకిత పుణే ఐటీఎఫ్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో ఆరు సింగిల్స్, 12 డబుల్స్ టైటిళ్లు ఉన్నాయి. -
విష్ణుకే సింగిల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ ‘డబుల్’ సాధించాడు. భారత్‌కే చెందిన శ్రీరామ్ బాలాజీతో కలిసి శుక్రవారం డబుల్స్ టైటిల్ నెగ్గిన విష్ణు... శనివారం సింగిల్స్ విభాగంలోనూ విజేతగా నిలిచాడు. చెన్నైలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో విష్ణు 6-4, 6-3తో శ్రీరామ్ బాలాజీని ఓడించాడు. విష్ణు కెరీర్లో ఇది పదో ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. ఈ ఏడాది అతని ఖాతాలో చేరిన మూడో సింగిల్స్ టైటిల్ ఇది. భారత్‌లోనే జరిగిన ఫ్యూచర్స్-1, ఫ్యూచర్స్-3 టోర్నీలలోనూ అతను విజేతగా నిలిచాడు.