విష్ణుకే సింగిల్స్ టైటిల్ | Vishnu Vardhan bags another ITF title | Sakshi
Sakshi News home page

విష్ణుకే సింగిల్స్ టైటిల్

Published Sun, Sep 18 2016 1:36 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

విష్ణుకే సింగిల్స్ టైటిల్ - Sakshi

విష్ణుకే సింగిల్స్ టైటిల్

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ ‘డబుల్’ సాధించాడు. భారత్‌కే చెందిన శ్రీరామ్ బాలాజీతో కలిసి శుక్రవారం డబుల్స్ టైటిల్ నెగ్గిన విష్ణు... శనివారం సింగిల్స్ విభాగంలోనూ విజేతగా నిలిచాడు. చెన్నైలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో విష్ణు 6-4, 6-3తో శ్రీరామ్ బాలాజీని ఓడించాడు. విష్ణు కెరీర్‌లో ఇది పదో ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. ఈ ఏడాది అతని ఖాతాలో చేరిన మూడో సింగిల్స్ టైటిల్ ఇది. భారత్‌లోనే జరిగిన ఫ్యూచర్స్-1, ఫ్యూచర్స్-3 టోర్నీలలోనూ అతను విజేతగా నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement