అరుకులో మాస్ జాతర చేయనున్నారు హీరో రవితేజ. ఆయన కెరీర్‌లో రూపొందుతున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్‌లైన్. హిట్ ఫిల్మ్ ‘సామజవరగమన’కు ఓ రైటర్‌గా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత రవితేజ, హీరోయిన్ శ్రీలీల కలిసి నటిస్తున్న సినిమా ఇది.
ఈ చిత్రంలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ లక్ష్మణ్ భేరీ పాత్రలో రవితేజ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా తాజా షెడ్యూల్ డిసెంబరు మూడో వారంలో అరకులో ప్రారంభం కానుందని సమాచారం. ముఖ్యంగా అరకు, ఆ తర్వాత పాడేరు, ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు లొకేషన్స్‌లో ‘మాస్ జాతర’ చిత్రీకరణ జరగనుందని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం పాల్గొంటారు. కొంత టాకీ పార్టుతో పాటు, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ప్లాన్ చేశారు మేకర్స్. రాజేంద్రప్రసాద్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మే 09న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment