dyavuda
-
ఎవరికీ వ్యతిరేకం కాదు
భాను, శరత్, కారుణ్య, హరిణి, అనుషా, జై ముఖ్య తారలుగా సాయిరామ్ దాసరి దర్శకత్వంలో హరీష్ కుమార్ గజ్జల నిర్మించిన సినిమా ‘ద్యావుడా’. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రజల్ క్రిష్ స్వరపరచిన ఈ సినిమా పాటలను షకీలా విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ–‘‘ ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. మంచి కంటెంట్‌తో వస్తున్నా చిన్న సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నా’’ అన్నారు. ‘‘ఈ నెల 13న విడుదల సినిమాను విడుదల చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకూ సినిమా నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం. మా సినిమా ఎవరికీ వ్యతిరేకం కాదు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: తరుణ్. -
‘ద్యావుడా’ సినీ డైరెక్టర్ అరెస్ట్
హైదరాబాద్: ద్యావుడా సినిమా డైరెక్టర్ దాసరి సాయిరామ్‌ను హైదరాబాద్‌లోని నేరేడ్మెట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సినిమాలో హిందూ దేవుళ్లపై అభ్యంతరకర సన్నివేశాలను యూట్యూబ్‌లో పోస్ట్ చేసినందుకు గాను సాయిరామ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మల్కాజిగిరి డీసీపీ రమేశ్ నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయిరామ్ నగరంలోని ఫిలింనగర్లో నివసిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా కడప నగరానికి చెందిన గజ్జల హరికుమార్‌రెడ్డి నిర్మిస్తున్న ద్యావుడా సినిమాకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. నూతన సంవత్సరం మొదటి రోజున యూట్యూబ్‌లో విడుదలైన ఈ సినిమా టీజర్ తీవ్ర అలజడి సృష్టించింది. అందులో హిందువుల ఆరాధ్య దైవమైన శివుడిపై అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నట్లు విమర్శలు వచ్చాయి. సాయిరామ్, హరికుమార్ రెడ్డిలపై బజరంగ్‌దళ్‌కు చెందిన యు.నవీన్ నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 4న ఫిర్యాదు చేశారు. దీంతో కుషాయిగూడ ఏసీపీ సయ్యద్ రఫీక్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ నర్సింగ్‌రావు, ఆంజనేయులు రంగంలోకి దిగి డైరెక్టర్ సాయిరామ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే అభ్యంతరకర సన్నివేశాలను యూట్యూబ్ నుంచి తొలగించినట్లు డీసీపీ తెలిపారు. కాగా హరికుమార్‌రెడ్డి పరారీలో ఉన్నారని.. త్వరలో అతడిని కూడా పట్టుకుంటామని తెలిపారు. -
ఆలయ ఘటనలతో... ద్యావుడా!
‘రేసుగుర్రం’ చిత్రంలో అల్లు అర్జున్ పలికిన ‘ద్యావుడా’ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో ఓ చిత్రం తెరకెక్కింది. భాను, శరత్, జై, అనూష, హరిణి, కారుణ్య ముఖ్య పాత్రల్లో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో శాన్వీ క్రియేషన్స్, అమృత సాయి ఆర్ట్స్ పతాకాలపై హరికుమార్ రెడ్డి.జి నిర్మించిన చిత్రం ‘ద్యావుడా’. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, లోగోను ‘హ్యాపీడేస్’, ‘వంగవీటి’ ఫేమ్ వంశీ ఆవిష్కరించారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘దైవాంశ పరమైన అంశంతో ముడిపడి ఉన్న చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘విభిన్న కథా చిత్రమిది. ఇండియాలోని కొన్ని దేవాలయాల్లో జరిగిన సంఘటనలతో తెరకెక్కించాం. నటీనటులు కొత్తవారైనా బాగా చేశారు’’ అని దర్శకుడు చెప్పారు. ‘నాటుకోడి’ చిత్ర నిర్మాత బందరు బాబీ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్ క్రిష్, కెమెరా: తరణ్. కె, సోను. కె.